Followers

Wednesday 5 August 2015

సాంఖ్య యోగః 6 (అథ ద్వితీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


యావానర్థ ఉదపానే
సర్వత స్సంప్లుతోదకే
తావాంసర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః.


స్నానపానాదుల కుపయుక్తమగు స్వల్పజలముగల బావి మొదలగువానియందెంత ప్రయోజనముకలదో, అంత ప్రయోజనము అంతటను నీటితో నిండియున్న మహత్తర జలప్రవాహమునం దిమిడియున్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థతత్త్వము నెఱిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున నిమిడియున్నది.

*******************************************************************************************  46

కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతు ర్భూ
ర్మాతే సజ్గోస్త్వకర్మణి.


అర్జునా! నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు. కర్మఫలముల నాశించుటయం దేనాడును నీకధికారము లేదు. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు కాకుము. మఱియు కర్మలు మానుటయందును నీకాసక్తి కలుగకుండుగాక!

*******************************************************************************************  47

యోగస్థః కురు కర్మాణి
సజ్గం త్యక్త్వా ధనంజయ!
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే.


ఓ అర్జునా! నీవు యోగనిష్ఠయందుండి, సంగమును త్యజించి, కార్యము ఫలించినను, ఫలించక పోయినను సమానముగ నున్నవాడవై కర్మలను జేయుము. అట్టిసమత్వబుద్ధియే యోగమనబడును.

*******************************************************************************************  48

దూరేణ హ్యవరం కర్మ
బుద్ధియోగా ద్ధనంజయ
బుద్ధౌ శరణ మన్విచ్ఛ
కృపణాః ఫల హేతవః.


ఓ అర్జునా! (పైనదెల్పిన) సమత్వబుద్ధితో గూడిన నిష్కామకర్మముకంటె ఫలాపేక్షతోగూడిన కామ్యకర్మము చాలతక్కువైనదిగదా! కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠానబుద్ధినే నీవాశ్రయింపుము. ఫలమును గోరువారు అల్పులు (దీనులు).

*******************************************************************************************  49

బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలమ్‌.


సమత్వబుద్ధి కలవాడు పుణ్యపాపముల రెండింటిని ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున ఇట్టి సమత్వబుద్ధియుక్తమగు నిష్కామకర్మయోగము కొఱకు యత్నింపుము. కర్మలయందలి నేర్పరితనమే యోగమనబడును.

*******************************************************************************************  50

కర్మజం బుద్ధియుక్తాహి
ఫలం త్యక్త్వా మనీషిణః
జన్మబంధవినిర్ముక్తాః
పదం గచ్ఛంత్యనామయమ్‌


సమత్వబుద్ధితోగూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వానిఫలమును త్యజించివైచి జనన మరణ రూపమగు బంధమునుండి విడుదలను బొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు.

*******************************************************************************************  51

యదా తే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ.


అర్జునా! నీబుద్ధి యెపుడు అజ్ఞానమను మాలిన్యమును దాటివేయునో (తొలగించుకొని పరిశుద్ధమగునో) అపుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు, నీవు విరక్తిగలగి యుందువు.

*******************************************************************************************  52

శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి
స్తదా యోగ మవాప్స్యసి.


నానావిధములగు శ్రవణాదులచే కలత జెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును బొందగలవు.

*******************************************************************************************  53

అర్జున ఉవాచః -

స్థితప్రజ్ఞస్య కా భాషా
సమాధిస్థస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిమ్‌.


అర్జును డడిగెను : ఓ కృష్ణా! సమాధియందున్న స్థితప్రజ్ఞుడగు జీవన్ముక్తునియొక్క లక్షణమేమి? అతడెట్లు మాట్లాడును? ఏ రీతిగ నుండును? ఎట్లు సంచరించును?

*******************************************************************************************  54

Popular Posts