Followers

Thursday 6 August 2015

ఆత్మసంయమయోగః 5 (అథ షష్ఠోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


అర్జున ఉవాచ -

అయతిశ్శ్రద్ధయోపేతో
యోగాచ్చలితమానసః,
అప్రాప్య యోగసంసిద్ధిం
కాం గతిం కృష్ణ గచ్చతి.


అర్జును డడిగెను:- కృష్ణా! శ్రద్ధతో గూడియున్నవాడును, కాని నిగ్రహశక్తి లేనివాడగుటచే యోగమునుండి జాఱిన మనస్సుగలవాడునగు సాధకుడు యోగసిద్ధిని (ఆత్మ సాక్షాత్కారము) బొందజాలక మఱియేగతిని బొందుచున్నాడు?

*******************************************************************************************  37

కచ్చిన్నో భయవిభ్రష్ట
శ్ఛిన్నాభ్రమివ నశ్యతి,
అప్రతిష్ఠో మహాబాహో
విమూఢో బ్రహ్మణః పథి.


గొప్ప బాహువులుగల ఓ కృష్ణా! బ్రహ్మమార్గమున (యోగమున) స్థిరత్వము లేనివాడగు మూఢుడు ఇహపరముల రెండింటికిని చెడినవాడై చెదరిన మేఘమువలె నశించిపోడా ఏమి?.

*******************************************************************************************  38

ఏత న్మే సంశయం కృష్ణ
ఛేత్తు మర్హస్య శేషతః,
త్వదన్యః సంశయస్యాస్య
ఛేత్తా న హ్యుపపద్యతే.


కృష్ణా! ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు. (సమర్థులు). మీరుతప్ప ఇతరులెవరును దీనిని తొలగింపజాలరు.

*******************************************************************************************  39

శ్రీ భగవానువాచ -

పార్థ నైవేహ నాముత్ర
వినాశ స్తస్య విద్యతే,
న హి కల్యాణకృత్కశ్చి
ద్దుర్గతిం తాత గచ్ఛతి‌.


శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా! అట్టి యోగభ్రష్టున కీ లోకమందుగాని, పరలోకమందుగాని వినాశము కలుగనే కలుగదు. నాయనా! మంచికార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడుగదా! .

*******************************************************************************************  40

ప్రాప్య పుణ్యకృతాం లోకా
నుషిత్వా శాశ్వతీః సమాః,
శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టో భిజాయతే.


యోగభ్రష్టుడు (మరణానంతరము) పుణ్యాత్ముల లోకములను పొంది,అట అనేక వత్సరములు నివసించి, తదుపరి పరిశుద్ధులైనట్టి (సదాచారవంతులైన) శ్రీమంతులయొక్క గృహమందు పుట్టుచున్నాడు.

*******************************************************************************************  41

అథవా యోగినామేవ
కులే భవతి ధీమతామ్‌,
ఏతద్ధి దుర్లభతరం,
లోకే జన్మ యదీదృశమ్‌.


లేక (ఉత్తమతరగతి యోగియైనచో) జ్ఞానవంతులగు యోగులయొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారమగు జన్మము లోకమున మహాదుర్లభమైనది.

*******************************************************************************************  42

తత్ర తం బుద్ధిసంయోగం
లభతే పౌర్వదైహికమ్‌,
యతతే చ తతో భూయ
స్సంసిద్ధౌ కురునందన.


ఓ అర్జునా! అట్లాతడు యోగులవంశమున జన్మించి పూర్వదేహ సంబంధమైన (యోగవిషయిక) బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి (యోగ) సంస్కారము వలన నాతడు సంపూర్ణయోగ సిద్ధి (మోక్షము) కొఱకై మరల తీవ్రతర ప్రయత్నమును సల్పుచున్నాడు.

*******************************************************************************************  43

పూర్వాభ్యాసేన తేనైవ
హ్రియతే హ్యవశోపి సః
జిజ్ఞాసురపి యోగస్య‌
శబ్దబ్రహ్మాతివర్తతే.

అతడు (యోగభ్రష్టుడు) యోగాభ్యాసమునకు తానుగా (మొదట) నిశ్చయింపకున్నను పూర్వజన్మము నందలి అభ్యాసబలముచే యోగమువైపునకే ఈడ్వబడుచున్నాడు. యోగము నెఱుగ దలంపుగలవాడైనంత మాత్రముచేతనే (యోగాభ్యాసముచేయ నిచ్చగించి నంతమాత్రముచేతనే) వేదములందు జెప్పబడిన కర్మానుష్ఠానఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు.

*******************************************************************************************  44

ప్రయత్నాద్యతమానస్తు
యోగీ సంశుద్ధకిల్బిషః,
అనేక జన్మ సంసిద్ధ
స్తతో యాతి పరాం గతిమ్‌.


పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై, అనేక జన్మలందు చేయబడిన అభ్యాసముచే యోగసిద్ధిని బొందినవాడై, ఆ పిదప సర్వోత్తమమగు (మోక్ష) గతిని బడయుచున్నాడు.

*******************************************************************************************  45

తపస్విభ్యోధికో యోగీ
జ్ఞానిభ్యోపి మతోధికః,
కర్మిభ్యశ్చాధికో యోగీ
తస్మాద్యోగీ భవార్జున.


ఓ అర్జునా! యోగియగువాడు ( కృచ్ఛ్ర చాంద్రాయణాది) తపస్సులు చేయువారికంటెను, శాస్త్రజ్ఞానము గలవారికంటెను, (అగ్నిహోత్రాది) కర్మలు చేయువారికంటెను గూడ శ్రేష్ఠుడని తలంప బడుచున్నాడు. కాబట్టి నీవుయోగివి కమ్ము.

*******************************************************************************************  46

యోగినామపి సర్వేషాం
మద్గతేనా నంతరాత్మనా,
శ్రద్ధావాన్‌ భజతే యో మాం
స మే యుక్తతమో మతః.


యోగులందఱిలోను ఎవడు నాయందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నాయభిప్రాయము.

*******************************************************************************************  47

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, ఆత్మసంయమయోగోనామ షష్ఠోధ్యాయః


Popular Posts