Followers

Wednesday 5 August 2015

కర్మయోగః 4 (అథ తృతీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


తత్త్వవిత్తు మహాబాహో
గుణకర్మవిభాగయోః‌
గుణాగుణేషు వర్తంత
ఇతి మత్వా న సజ్జతే.


గొప్ప బాహువులుగల ఓ అర్జునా! గుణముల యొక్కయు, కర్మలయొక్కయు విభజననుగూర్చిన యథార్థమెఱగిన జ్ఞాని గుణములు (ఇంద్రియాదులు) గుణములందు (శబ్దాదివిషయములందు) ప్రవర్తించుచున్నవని, (అత్మస్వరూపుడగు తనకు వాస్తవముగ వానితో ఏ సంబంధమున్ను లేదని) తలంచి కర్మలందు సంగము(అభిమానము) లేకుండును.

*******************************************************************************************  28

ప్రకృతేర్గుణసమ్మూఢాః
సజ్జంతే గుణకర్మసు
తానకృత్స్నవిదోమందా
ంకృత్స్నవిన్నవిచాలయేత్‌‌.


ప్రకృతియొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడినవారై దేహేంద్రియాదులయొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మసంగులగు అల్పజ్ఞులను, మందమతులను అత్మజ్ఞుడగు జ్ఞాని చలింపజేయగూడదు (కర్మలు మానునట్లు చేయరాదు.)

*******************************************************************************************  29

మయి సర్వాణి కర్మాణి
సన్న్యస్యాధ్యాత్మ చేతసా,
నిరాశీర్నిర్మ మో భూత్వా
యుధ్యస్వ విగతజ్వరః.


సమస్త కర్మములను నాయందు ఆధ్యాత్మచిత్తముతో సమర్పించి ఆశగాని, మమకారముగాని లేని వాడవై, నిశ్చింతగ యుద్ధమును జేయుము.

*******************************************************************************************  30

యే మే మతమిదం నిత్య
మనుతిష్ఠంతి మానవాః,
శ్రద్ధావంతో నసూయంతో
ముచ్యంతే తేపి కర్మభిః.


ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయలేనివారై ఈ నా యభిప్రాయముల నెల్లపుడును ఆచరణయందుంచుచున్నారో, వారున్ను, కర్మబంధములనుండి విడిపడుచున్నారు.

*******************************************************************************************  31

యే త్వేతదభ్యసూయంతో
నానుతిష్ఠంతి మే మతమ్‌,
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్‌
విద్ధి నష్టా న చేతసః.


ఎవరు నా యీ అభిప్రాయమును (ఆధ్యాత్మమార్గమును, నిష్కామ కర్మయోగపద్ధతిని) ద్వేషించువారై యనుసరింపక యుందురో, అట్టివారిని బుద్ధిహీనులుగను, బొత్తిగా జ్ఞానము లేనివారలుగను, చెడిపోయినవారలుగను యెఱుగుము.

*******************************************************************************************  32

సదృశ్యం చేష్టతే స్వస్యాః
ప్రకృతేర్జ్ఞా నవానపి,
ప్రకృతిం యాంతి భూతాని
నిగ్రహః కిం కరిష్యతి.


జ్ఞానవంతుడైనను (శాస్త్రపాండిత్యము లేక లౌకికజ్ఞానము కలవాడైనను) తన ప్రకృతికి (జన్మాంతర సంస్కారముచే గలిగిన స్వభావమునకు) అనుగుణముగనే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతి ననుసరించియే నడచుచున్నవి. కావున ఇక నిగ్రహమేమి చేయగలదు?.

*******************************************************************************************  33

ఇంద్రియ స్యేంద్రియస్యార్థే
రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్న వశ మాగఛ్ఛే
త్తౌ వ్యాస్య పరిపంథినౌ.


ప్రతి ఇంద్రియమునకును దానిదాని విషయమందు (శబ్దాదులందు) రాగద్వేషములు (ఇష్టానిష్టములు) ఏర్పడియున్నవి. ఆ రాగ ద్వేషములకు ఎవరును లోబడగూడదు. అవి మనుజునకు ప్రబల శత్రువులు గదా!.

*******************************************************************************************  34

శ్రేయాన్‌ స్వధర్మోవిగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్‌,
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయోవహః‌.


చక్కగ నాచరింపబడిన ఇతరుల ధర్మముకంటె గుణములేనిదైనను తన ధర్మమే శ్రేష్ఠమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమేయగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది.

*******************************************************************************************  35

అర్జున ఉవాచ :-

అథ కేన ప్రయుక్తోయం
పాపం చరతి పూరుషః,
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ
బలాదివ నియోజితః.


ఓ కృష్ణా! అయితే మనుజుడు పాపముచేయవలెనని కోరుకున్నప్పటికిని, దేనిచే ప్రేరేపించబడి బలాత్కారముగ పాపము చేయుచున్నాడు?

*******************************************************************************************  36

Popular Posts