Followers

Thursday 6 August 2015

కర్మసన్న్యాసయోగః 2(అథ పంచమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సజ్గం త్యక్త్వా కరోతి యః,
లిప్యతే న స పాపేన
పద్మ పత్ర మివాంభసా.


ఎవడు తానుజేయు కర్మములను పరమాత్మ కర్పించి సంగమును (ఆసక్తిని) విడచిచేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే నంటబడకుండును.

*******************************************************************************************  10

కాయేన మనసా బుద్ధ్యా
కేవలై రింద్రియైరపి,
యోగినః కర్మ కుర్వంతి
సజ్గం త్యక్త్వాత్మ శుద్ధయే.


(నిష్కామ కర్మ) యోగులు చిత్తశుద్ధికొఱకై ఫలాసక్తిని విడిచి శరీరముచేతను, మనస్సుచేతను, బుద్ధిచేతను, అభిమానములేని వట్టి ఇంద్రియములచేతను కర్మలను జేయుచున్నారు.

*******************************************************************************************  11

యుక్తః కర్మఫలం త్యక్త్వా
శాంతిమాప్నోతి నైష్ఠికీమ్‌,
అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే.


యోగయుక్తుడు (నిష్కామకర్మయోగి) కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి (చిత్తశుద్ధివలన) ఆత్మ నిష్ఠాసంబంధమైన శాశ్వతమగు శాంతిని బొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు (ఫలాపేక్షతో కర్మలను జేయువాడు) ఆశచే ప్రేరితుడై కర్మఫలమందాసక్తి గల్గి బద్ధుడగుచున్నాడు.

*******************************************************************************************  12

సర్వకర్మాణి మనసా
సన్న్యస్యాస్తే సుఖం వశీ,
నవద్వారే పురే దేహీ
నైవ కుర్వన్నకారయన్‌.


ఇంద్రియ నిగ్రహముగల దేహధారి మనస్సుచే సమస్త కర్మములను (కర్మఫలములను) పరిత్యజించి ఏమియు చేయనివాడై, చేయింపనివాడై, తొమ్మిది ద్వారములుగల పట్టణమగు శరీరమందు హాయిగా ఉండుచున్నాడు.

*******************************************************************************************  13

న కర్తృత్వం న కర్మాణి
లోకస్య సృజతి ప్రభుః,
న కర్మఫలసంయోగం
స్వభావస్తు ప్రవర్తతే.


భగవంతుడు (ఆత్మ) జీవులకు కర్తృత్వమునుగాని, కర్మములనుగాని, కర్మఫలములతోటి సంబంధముగాని కలుగజేయడు. మఱేమనిన, ప్రకృతియే (ప్రకృతి సంబంధము వలన గలిగిన జన్మాంతర సంస్కారమే) ఆయాకర్తృత్వాదులను గలుగజేయుచున్నది.

*******************************************************************************************  14

నాదత్తే కన్యచిత్పాపం
న చైవ సుకృతం విభుః,
అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యంతి జంతవః.


పర్మమాత్మ యెవని యొక్కయు పాపమునుగాని, పుణ్యమునుగాని స్వీకరింపడు. అజ్ఞానముచేత జ్ఞానము కప్పబడియున్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు.

*******************************************************************************************  15

జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశితమాత్మనః,
తేషామాదిత్యవజ్జ్ఞా నం
ప్రకాశయతి తత్పరమ్‌.


ఆత్మజ్ఞానముచే ఎవరియొక్క అజ్ఞానము నశింపజేయబడినదో, అట్టివారి జ్ఞానము సూర్యునివలె ఆ పర బ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. (స్వస్వ రూపానుభవమును గలుగజేయుచున్నది) .

*******************************************************************************************  16

తద్బుద్ధయ స్తదాత్మాన
స్తన్నిష్ఠాస్తత్పరాయణాః,
గచ్ఛంత్యపునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాః.

ఆ పరమాత్మయందే బుద్ధిగలవారును, ఆ పరమాత్మయందే మనస్సును నెలకొల్పినవారును, ఆ పరమాత్మయందే నిష్ఠగలవారును, ఆ పరమాత్మనే పరమగతిగ నెంచువారును, జ్ఞానముచే నెగురగొట్టబడిన పాపముగలవారై పునరావృత్తిరహితమగు ( పునర్జన్మ వర్జితమగు) శాశ్వత మోక్షపదవిని బొందుచున్నారు.

*******************************************************************************************  17

విద్యావినయసంపన్నే
బ్రాహ్మణే గవి హస్తిని,
శుని చైవ శ్వపాకే చ
పణ్డితాః సమదర్శినః‌.


విద్య, వినయము గలిగియున్న బ్రాహ్మణునియందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, కుక్కమాంసము వండుకొనితిను చండాలునియందును సమదృష్టికలవారే (వారిని సమముగ జూచువారే) జ్ఞానులు (ఆత్మానుభవముగలవారు) అని చెప్పబడుదురు.

*******************************************************************************************  18

Popular Posts