Followers

Wednesday 17 June 2015

ద్విగ్రహయోగం

జనన కలమున రెండు గ్రహముల చేరిక ఉన్న జాతకుని గ్రహ చేరికను అనుసరించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవి ఒక్కొక్క రాశికి తగినట్లు స్తానానికి తగినట్లు ఫలితాలు మారుతూ ఉంటాయి.
రవి ఇతరగ్రహ కలయిక
ద్విగ్రహ యోగంలో రవి, చంద్రులు కలిసి ఉన్న జాతకుడు, స్త్రీ వశవర్తి , నీతి హీనుడు, కపటమెరిగిన వాడు, ధనికుడు, కార్యములందు నిపుణత కల వాడు.

రవి, కుజులు కలిసి ఉన్న జాతకుడు సాహసము, మూర్ఖత, బలము,సత్వము,అనృతము, పాపబుద్ధి కోపం మొదలైనవి కల వాడు, వధ అందు ఆసక్తి కలిగి ఉంటాడు.

రవి,బుధులు కలసి ఉన్నట్లయితే సేవ, అస్థిరమైన ధనం, యసస్సే ధనంగా కల వాడు,రాజ ప్రియుడు, పూజ్యుడు, సత్పురుషులలో శ్రేష్టుడు, బలము, రూపము, ద్రవ్యము కలవాడు ఔతాడు.

రవి,గురులు కలిసి ఇన్న జాతకుడు ధార్మికుడు, మంత్రి, బుద్ధిమంతుడు, మిత్రుల వలన ధనం ప్రాప్తించిన వాడు, ఉపాధ్యాయుడు ఔతాడు.

రవి,శుక్రులు కలిసి ఉన్నచో శస్త్ర విద్యలు మొదలైన వాటి అందు ప్రావిణ్యం కలవాడు, వార్ధక్యములో దృష్టి బలం లేని వాడు, నాట్య క్రియలు తెలిసిన వాడు వివాహానంతరం ధనం బంధువులు కలవాడు ఔతాడు.

రవి , శనులు కలిసి ఉన్న జాతకుడు స్వ దర్మమున ఆసక్తి కలవాడు, భార్యా పుత్రుల అందు ఖేదం కల వాడు ఔతాడు.
చంద్రుడు ఇతరగ్రహముల చేరిక

చంద్రుడు, కుజుడు కలసి ఉన్న జాతకుడు శూరుడు, రణరంగమున ప్రతాపం కలవాడు, బాహుయుద్ధం చేయు వాడు, రక్త హీనత కలవాడు, మత్తుడు, కపటం కలవాడు, ధర్మపన్నాలు వల్లించు వాడు ఔతాడు.

చంద్రుడు, బుధుడు కలిసి ఉన్న జాతకుడు కావ్య కథలురచన చేయుటలో నిపుణుడు. ధనికుడు, స్త్రీ జితుడు, ధర్మం అందు ఆసక్తి, చిరునవ్వు ముఖము కలవాడు, సుందరుడు ఔతాడు.

చంద్రుడు, గురువు కలిసి ఉన్న జాతకుడు స్థిరమైన మిత్రులు కల వాడు, ధనికుడు, దేవ బ్రాహ్మణ భక్తి కల వాడు, బంధువులను సత్కరించు వాడు ఔతాడు.

చంద్రుడు , శుక్రుడు కలిసి ఉన్న జాతకుడు పుష్ప మాలికలు, దేవతా వస్త్రాలు, పరిమళ ద్రవ్యములను అనుభవించు వాడు , వంశ శ్రేష్టుడు, కార్య విధులను తెలిసిన వాడు, మిక్కిలి నిర్లక్ష్యము, క్రయ విక్రయముల అందు నేర్పరి అగును.

చంద్రుడు, శని కలిసి ఉన్న జాతకుడు వ్రుద్దాంగానలను ప్రేమించు వాడు, గజములు, అశ్వములు కలవాడు, ధనము లేని వాడు , పరాజితుడు, జన వశ్యుడు ఔతాడు.
కుజుడు ఇతరగ్రహముల కలయిక

కుజుడు ,బుధుడు చేరిక ఉన్న జాతకుడు దుష్ట స్త్రీ సాంగత్యం కలవాడు, స్వల్ప ధనికుడు, సువర్ణము మొదలైనవి చేయువాడు, దుష్టులైన విధవ అంగనా సఖుడు, ఔషధం చేయుటలో నేర్పరి ఔతాడు.

కుజుడు, గురువు కలిసి ఉన్న జాతకుడు శిల్ప శాస్త్రం, వేద శాస్త్రం తెలిసిన వాడు, ధారణా శక్తి కల వాడు, బుద్ధిమంతుడు, మాటలలో నేర్పరి, అస్త్ర ప్రయోగంలో నేర్పరి శ్రేష్ట్రుడు అగును.

కుజుడు, శుక్రుడు కలయిక కలిగిన జాతకుడు పూజ్యుడు, సేనానాయకుడు, గణితజ్ఞుడు, పరస్త్రీ ఆసక్తుడు, కోపం కలవాడు, జూదము, అనృతం తెలిసిన వాడు ఔతాడు.

కుజుడు శనుల కలయిక ధాతువులతో ఇంద్రజాలము చేయుటలో ఘటికుడు, ప్రబలుడు, చొరవిద్యలో నేర్పరి, అనృతుడు , ధర్మ హీనుడు, సత్రములు విషము మొదలైన వాటితో మరణమును పొందు వాడు.

బుధుడు ఇతర గ్రహముల కలయిక

గురువు, బుధులు బుధుడు, గురువుల కలయిక ఉన్న జాతకుడు నాట్య విద్య తెలిసిన వాడు , ప్రాజ్ఞుడు, సంగీత శాస్త్రం తెలిసిన వాడు, బిద్ధిమంతుడు , సౌఖ్యం మొదలైన ఉత్తమ గుణములు కల వాడు ఔతాడు.

బుధుడు, శుక్రుడు గొప్ప ధనికుడు, నీతి తెలిసిన వాడు, మాట్లాడటంలో నేర్పరి, నీతి, శిల్పం, వేదాలు తెలిసిన వాడు, గానం, హాస్యం తెలిసిన వాడు, సౌక్యములను అనుభవించు వాడు.
బుధుడు, శని కలిసి ఉన్న జాతకుడు రుణ గ్రస్తుడు, డంభం కలవాడు, ఆహరం లేక తిరుగు వాడు, విస్తరించు వాడు , దేశ శుక్రుడు ఇతర, దేశ దిమ్మరి చేరిక అధికంగా తిరిగేస్వభావం కల వాడు, నేర్పరితనం కలవాడు ఔతాడు.
గురువు ఇతర గ్రహ కలయిక

గురువు శుక్రుడు చేరిక కలిగిన జాతకుడు విద్యచేత జీవించు వాడు, ధార్మికుడు, ప్రామాణికుడు, ఉన్నతమైన భార్య కల వాడు, బుద్ధిమంతుడు మొదలైన ఉన్నత గుణవంతుడు.
గురు శనులు చేరిక కలిగిన జాతకుడు శూరుడు, నగరాధిపతి, యశస్సు కల వాడు, సభలలో ప్రధానుడు.
శుక్రుడు ఇతర గ్రహముల చేరిక

శుక్ర శనుల కలయిక కలిగిన జాతకుడు చెట్లు కొట్టుట, చిత్రిక పట్టుట( కొయ్య శిల్పాలు చెక్కుట ), చిత్రమైన రాతి పనియందు సమర్ధుడు, బాహు యుద్ధము చేయువాడు, పశువులు కలవాడు ఔతాడు.

Popular Posts