Followers

Friday 27 February 2015

ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 45 శ్రీ హనుమత్కేశ్వరం


 రాముడు రాజ్య పాలన చేస్తున్న కాలం లో ఒక సారి అగస్త్యుడు మున్నగు మహర్షులు వచ్చి సందర్శించారు .వారందరికి తగిన విధం లో స్వాగతించి ,ఉచితాసనాలపై కూర్చో బెట్టి ,అగస్త్య మహర్షి తో ”శంకరుడు- హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు ?వాళ్ళిద్దరి సాహసాలను మనం తెలుసు కోవటం యెట్లా ?”అని శ్రీ రాముడు ప్రశ్నించాడు .అప్పుడు అగస్త్య ముని ”విజయ భాస్కరా రామా !విను .శంకరుడే హను మంతుడు .వాయు వర ప్రసాది .వాయువు లాగా అంతటా సంచ రించే నేర్పున్న వాడు .అందులో సందేహం లేదు .నీకు అనుమానం వస్తే పరీక్షించ వచ్చు ”అన్నాడు .
శ్రీ రాముడు మారుతి ని ఆప్యాయం గా పిలిచి ,”హనుమా ! ఇప్పుడే లంకకు వెళ్లి ,విభీషణుడి దగ్గరున్న ”మౌక్తిక లింగం ”ను తీసుకొని రావాలి .”అని ఆజ్ఞా పించాడు .హనుమ మారు మాట చెప్ప కుండా ,రామాదులకు నమస్కరించి ,తండ్రి వాయుదేవునికి వందనం చేసి ,రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు ,పట్టణాలు ,కొండలు ,కోనలు అన్ని దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంఘించి ,లంకలో ప్రవేశించాడు .అక్కడున్న రాక్షస వీరు లందరూ ఇంత హటాత్తు గా హనుమ రావటం చూసి ఆశ్చర్య పోయారు .సరాసరి మహా రాజు విభీషణుని కొలువు చేరాడు .విభీషణుడు మారుతి ని గౌరవించాడు .వచ్చిన కారణం తెలుప మన్నాడు .శ్రీ రాముని ఆజ్న ను వినిపించాడు హనుమ .రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్టించిన చోటు కు వెళ్లి అక్కడున్న ఆరు శివ లింగాలను చూపించాడు .అందులో మౌక్తిక లింగాన్ని ఆంజనేయుడి చేతికిస్తూ ”హనుమా ! దీనిని నా అన్న రావణుడు కుబేరుడి నుండి తెచ్చాడు .కుబేరుడికి దాన్ని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు .ఆ లింగాన్ని కుబేరుడు పూజించి ,నవ నిదు ల తో కూడిన రాజ్యానికి రాజు ఆవ గలిగాడు .రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధి పతి అయ్యాడు .దీన్ని నేను శ్రీ రామ చంద్రునికి సభక్తికం గా సమర్పిం చానని చెప్పు ”అని లింగాన్ని ఇచ్చేశాడు .
హనుమ భక్తిగా ఆ మౌక్తిక లింగానికి నమస్కరించి ,గ్రహించాడు .విభీషణుడి దగ్గర వీడ్కోలు తీసుకొని అయోధ్య కు బయల్దేరాడు .ఆకాశం లో ఎగురుతూ ,ఏడవ రోజున అవంతీ నగర ప్రాంతం లో ఉన్న పర్వతం  మీదకు చేరాడు .లింగాన్ని అక్కడ ఉంచి ”,రుద్ర సరస్సు” లో స్నానం చ సి ,అర్ఘ్యాదులు సమర్పించి ,మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరాడు .అప్పుడు మౌక్తిక లింగం చిన్న పర్వతం అంత గా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు .దానికి కదిలించటానికి విశ్వ ప్రయత్నం చేసి ,విఫలుడైనాడు .అప్పుడు ఉమా పతి పరమేశ్వరుడు ప్రత్యక్ష మై ”హనుమా !విచార పడకు .నువ్వు దుఖిస్తే ,లోకం అంతా చింతా క్రాంత మవుతుంది .నువ్వు సంతోషం గా ఉంటె ప్రపంచం నవ్వుతుంది .ఈ లింగం ఇక్కడే ఉండాలని భాగ వంతుని భావన గా కన్పిస్తోంది .ఈ పర్వతం చాలా పవిత్ర మైనది .ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం .మౌక్తిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యులైన దేవ గణం రుషి గణం దీనిని సేవించే పరమాద్భుత మైన అవకాశం కలుగు తుంది .దీన్ని వారందరూ ”శ్రీ హనుమత్కేశ్వరం ”అనే పేరు తో పిలుస్తారు .ఆ పేరు తో ఇది ప్రశస్తి పొందుతుంది . మానవు లందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి ధన్య మవుతుంది .ఇక్కడ జరిగిన విషయాల నన్నిటిని శ్రీ రామ చంద్రునికి నా మాట గా చెప్పు .ఆయన దానిని అర్ధం చేసుకోగలదు ”అని దీవించి పంపాడు శివుడు .
అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీ రామునికి అన్నీ సవిరం గా వివ రించాడు .శ్రీ రాముడు ,అగస్త్య మహర్షి  మొదలైన వారంతా హనుమ ను ఆశీర్వ దించారు .ఈ కద లో మనకు తెలిసిన్దేమిటి ?ఎవరి కైనా కర్మ ఫలం అనుభ విన్చాల్సిందే .శ్రీ రాముడు ,నారాయణుడు ,శంకరుడు ,హనుమంతుడు ,ఎవరైనా దుష్ట రాక్షస సంహారం చేసి నందున తపస్సు చేయాల్సి వచ్చింది .అలాంటి మహాను భావులే పాపాలకు భయ పడి నప్పుడు ,సామాన్య మాన వుల సంగతి వేరే చెప్పాలా ?అందుకే అనుభవం ఉన్న వారు అందరు చెప్పే మాట లు వినాలి -మనసు చేత ,వాక్కు చేత ,క్రియల చేత ,ఇతరులకు బాధ కలుగ కుండా నడచు కోవాలి .అప్పుడు అదే తపస్సు అవుతుంది .శ్రీ రామ హనుమదాదుల చర్యలు సర్వ కాలలో ,సర్వ మానవులకు శిరో ధార్యం .ఆదర్శ ప్రాయం .మనందరి నడక శుభదాయకం గా ఉంటె దేశానికి శాంతి శుభాలు కలుగు తాయి .
సశేషం —

Popular Posts