Followers

Friday 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –43 శత బాహువు కధ


త్రేతాయుగం లో ఒక సారి శత బాహువు అనే రాజ కుమారుడు వేట కోసం దట్ట మైన అడవికి వెళ్లి ,వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు .అక్కడ ఒక బ్రాహ్మణుడి ఒక చేతిలో పుస్తకం ,రెండవ చేతి లో ఒక మూట ఉండటం చూశాడు .బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి ,దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు .బ్రాహ్మణుడు ”రాజా !నేను కన్యా కుబ్జం నుంచి వచ్చాను .హనుమంతెశ్వరం ఎక్కడ ఉందా అని వెతుకు తున్నాను .మా మహారాజు శిఖండి గారి అనుజ్న తో ఈ మూట లో ఉన్న అస్తికలను హనుమంతేశ్వర తీర్ధం లో నిమజ్జన చేయ టానికి వచ్చాను ”అని బదులు చెప్పాడు .
రాజుకు ఆశ్చర్యం వేసి అస్తికల నిమజ్జనం చేస్తారా ,దాని ప్రాధాన్యత గురించి వివ రించ మని కోరాడు .అప్పుడా బ్రాహ్మణుడు ”మహా రాజా !కన్యా కుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు .ఒక అమ్మాయి పుట్టింది .ఆమెకు పూర్వ జన్మ స్మృతి ఉంది .అల్లారు ముద్దు గా పెరిగింది .తగిన వరున్ని వెతికి వివాహం చేయాలని రాజు గారు ప్రయత్నం చేస్తున్నారు .తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకో మని చెప్పింది .”కారణం ఏమిటి?” అని తండ్రి అడుగగా తన పూర్వ జన్మ కధను వివ రించింది .
”తండ్రీ !నేను పూర్వ జన్మ లో ఒక ఆడ నెమలిని .ణా భర్త అయిన మగ నెమలి ,నేను చాలా అన్యోన్యం గా ఉన్నాం .ఒక సారి ఆకాశం మేఘావృతం గా ఉన్న రోజు న మేమిద్దరం ఆనంద పరవశం తో నృత్యం చేస్తున్నాము .క్రీన్కారాలతో హోరేత్తిస్తున్నాము .ఇంతలో అకస్మాత్తు గా ఒక కిరాతకుడు ఒకే సారి మా మీద బాణాలను వేశాడు .మమ్మల్ని చంపి ,మా శరీరాలను తీసుకొని పోయి మాంసం వండు కొని తిన్నాడు. నా శరీరం లోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది .దానిని ఒక గ్రద్ద దక్కించు కొని నోట కరచుకొని ఆకాశానికి ఎగిరింది .దాని కోసం ఇంకో గ్రద్ద దానితో పోటీ పడి,ఆకాశం లోనే పోట్లాడుకోన్నాయి .చివరికి అవి హను మంతేశ్వరం వచ్చే సరికి ఆ మాంసం ముద్దఆ తీర్ధం లో పడింది .ఆ తీర్ధ ప్రభావం తో నేను నీకు పుత్రిక గా జన్మించాను .
”నా భర్త అయిన మగ నెమలికి ఇంకా పక్షి రూపం వదల లేదు . బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్తికలు ఉన్నాయి .నర్మదా నది దక్షిణ తీరం లో హనుమంతేశ్వరం లో ఎత్తు గా ఉన్న మహా బలిష్ట మైన విస్తారమైన ఊడలు గల వట వృక్షం ఉంది .దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి .మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి ,ఆతని చేత ఆ అస్తికలను సేకరింప జేసి ,హనుమంతేశ్వర తీర్ధం లోని నర్మదా నదీ పవిత్ర జలాలలో నిక్షేపింప జేయించండి. .నాభర్త ఆ తీర్ధ ప్రభావం తో రాజ కుమారుడు గా జన్మిస్తాడు .అతడే నా భర్త అవుతాడు .”అని రా కుమార్తె తండ్రికి వివ రించింది .”
”ఇదంతా విన్న శిఖండి రాజు నన్ను ఈ పనికి నియోగించాడు .అందుకే ఇక్కడికి వచ్చాను .ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్తికలను సేకరించాను ..నర్మదా నదీ జలాల్లో నిమజ్జనం చేయటానికి వెళ్తున్నాను .”అని శతబాహువు రాజు కు చెప్పాడు బ్రాహ్మణుడు .
హను మంతేశ్వరం చేరి ఆ బ్రాహ్మణుడు పవిత్ర స్నానాన్ని నర్మదా నది లో చేసి ,ఆ మయూరాస్తికలను మంత్ర పూతం గా నర్మదా నది లో నిమజ్జనం చేసి ,మళ్ళీ స్నానం చేసి కన్యా కుబ్జం చేరాడు .బ్రాహ్మణుడి వల్ల హనుమంతేశ్వర క్షేత్ర మహాత్మ్యాన్ని విన్న శత బాహువు నర్మదా నదీ స్నానం చేసి ,హనుమంతుని ధ్యానించి ,ధర్మ మార్గం లో సంచ రిస్తూ ధర్మం గా రాజ్య పాలన చేస్తూ ,దేవతల మెప్పు పొందాడు .చివరకు శివ సాయుజ్యం పొందాడు . నర్మదా నది లో కలిపిన నెమళ్ళ అస్తికలు దేవ రూపాలను పొంది ,వెండి కొండను చేరి ,ఆ తర్వాతా పరమేశ్వరుని అనుగ్రహం పొంది ,కాశీ రాజుకు కుమారుడి గా జన్మించి ,,పూర్వ జన్మ స్మ్రుతి కలిగి ,శిఖండి రాజ కుమార్తె ను వివాహం చేసుకొన్నాడు .చాలా కాలం సుఖాలను అనుభవించి ,ఆ దంపతులు శివ లోకం చేరారు .
సశేషం —

Popular Posts