Followers

Friday 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –39 విషూచీ కధనం


పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి హనుమ చేతిలో ఓడి పోయిన లంకిణి సోదరి విశూచి వృత్తాంతాన్ని తెలియ జేయ మని కోరాడు ..
   పరాశారుడు చెప్పటం ప్రారంభించాడు .విశూచ్చీ వృత్తాంతం వాల్మీకి రామాయణం లో లేదని ,కానీ జనం దాన్ని గురించి చెప్పు కోవటం ఉందని ,తాను విన్న విషయాలను తెలియ జేస్తాను అన్నాడు .రావణుని లంక కు కాపలా గాఉన్న లంకిణి కి విశూఛీ  చెల్లెలని ,ముష్యుల్ని చంపట మే దాని పని అని చెప్పాడు .మానవుల హితం కోరిన బ్రహ్మ దాన్ని తన లోకం లోనే బంధించి ఉంచాడని తెలియ జేశాడు .లంక లో ఆంజనేయుడి చేతి లో పరాభవం చెందిన తన అక్క లంకిణి గురించి విన్న విషూచి బ్రహ్మ లోకం లో నుంచి ,మాయోపాయం తో తప్పించుకొని బయట పడింది .సరాసరి లంకకు చేరింది .హనుమ ను దూషిస్తూ ,అక్కకు జరిగిన అవమానానికి బాధ పడుతూ  ,బలమైన  వంకర కర్రతో హనుమంతుణ్ణి కొడ్తూ ,తిడ్టు హడావిడి చేసింది కాసేపు .హనుమ ముందు కుప్పి గంతులు చెల్లాలేదు .ఆ కర్రనే తీసుకొని బాది  పారేశాడు .అది కేకలు ,బొబ్బలు పెడ్తూ ఆ దెబ్బలకు తట్టు కోలేక అరిచి అరిచి చచ్చింది . 
    విషూచి చచ్చిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్ష మై ‘’హనుమా !నువ్వు మంచి పనే చేశావు .దీన్ని చంపి లోకానికి ఉపకారం చేశావు .దానికి చంపటం ఒక లీల .తగిన శాస్తి పొందింది .నీవు చిరంజీవివి .కనుక నీకు పాపం ఏమీ అంటదు .నీ నామ స్మరణ చేసిన వారికి సకల శుభాలు జరుగుతాయి .’’అని దీవించి అదృశ్యమైనాడు .
           ‘’హనుమా,నంజనా సూను ,వాయుపుత్రో ,మహాబలః –కపీంద్రః ,పిన్గలాక్షస్చ ,లంకా ద్వీప భయంకరః
          ప్రభంజన సుతో వీరః ,సీతా శోక వినాశనః –అక్ష హంతా ,రామ సఖః ,రామ కార్య దురంధరః
         మహౌషధాగి రేర్హారి ,వానర ప్రాణ దాయకః –వారీ శాతాకరస్చైవ ,మైనాక గిరి భంజనః
        నిరంజనో ,జిత క్రోధః ,కదళీవన సంవృతః –ఊర్ధ్వ రే తా ,మహా సత్త్వః ,సర్వ మంత్ర ప్రవర్తకః
        మహా లింగ ప్రతిష్టాతా ,భాష్యక్రుజ్జగతాం వరః –శివ ధ్యాన పరో నిత్యం ,శివ పూజా పరాయణః ‘’
   అనే ఇరవైఏడు నామాలున్న స్తవాన్ని భక్తీ తో  చదివితే వ్యాధుల నుండి కాపాడ బడతారు .రాబోయే సృష్టి లో ఆంజనేయుడే సృష్టికర్త అవుతాడని బ్రహ్మ వరం ఇచ్చాడు .

   ‘’ ఆంజనేయ మతి పాట లాననం ,కాన్చానాద్రి కమనీయ విగ్రహం –పారిజాత తరు మూల వాసినం ,భావయామి పవ మాన నందనం ‘’
     సశేషం —

Popular Posts