Followers

Friday 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –38 శరావోదయ వ్రతం –2


ఏరకం పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో పరాశర మహర్షి వివ రిస్తున్నాడు ..తెల్లని పుష్పాలతో ఆంజనేయుని పూజిస్తే అన్ని కోర్కెలు తీరుతాయి .పసుపు పచ్చ పూలు ఐశ్వర్యాన్నిస్తాయి .శత్రు వును బాధించాలంటే నల్ల పూలతో పూజ చేయాలి ..సువర్ణ పుష్పాల టో పూజిస్తే రాజ సూయ యాగ ఫలం వస్తుంది .తులసి ,తామర ,జాజి ,మొగలి ,,యెర్ర కలువ మొదలైన పది రకాల పూలు స్వామికి అత్యంత ప్రీతికరం ..హనుమ విగ్రహానికి ,యంత్రానికి ,హనుమ సాలగ్రామానికి దేనికి పూజించినా మంచి ఫలితమే కలుగు తుంది .
                       హనుమ సాల గ్రామం ఎలా ఉంటుందో మహర్షి వివ రిస్తున్నాడు .హనుమత్సాలగ్రామం శిరస్సు  కుడి వైపు గుండ్ర ని చక్రం ఉంటుంది .దానికి ఎడమ వైపు బాణం తో  దెబ్బ తిన్న ఆవు గిట్ట  వంటి లోతు భాగం ఉంటుంది .సూక్ష్మ పంజరం తో ,మాలికాకారం గా ,వాలము తో ,అనేక శిఖరాలుండి  ,సూక్ష్మ మైన కార్ముఖ రేఖ ఉంటుంది .ముఖం లో రెండు చక్రాలుండి  ,సూక్ష్మ మైన తామర పూవుతో ఉండే ఈ సాలగ్రామం మంత్ర స్వరూపం గా ఉండి  సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది ..ఇది సాక్షాత్తు శ్రీ హనుమంతుని ప్రతి రూపమే .దీన్ని పురుషోత్తం అని ,సుక్షేత్రం అనీ అంటారు .
                      సాలగ్రామం లేక పోతే కలశం లేక యంత్రం ఉంచి పూజ చేయ వచ్చు .ఈ శారావోదయ వ్రతాన్ని అరటి వనం లో ఆచరిస్తే మహా ఫలితం ..లేకపోతే హనుమంతుని దేవాలయం లో చేసుకో వచ్చు ..వీటిలో ఏదో ఒక దానికి మంత్ర పూతం గా ప్రాణ ప్రతిష్ట చేసి షోడచోప చార పూజ ,అష్టోత్తర ,సహస్ర నామ పూజ చేయాలి .రెండు పూటలా భోజనం నిషిద్ధం ..నేల మీదే నిద్రించాలి .బ్రహ్మ చర్యం పాటించాలి .ఈవ్రతాన్ని చాలా అంది చేసి విపరీత మైన ఫలితాలను పొందారు .
     చైత్ర మాసం లో పుష్యమి నక్షత్రం లో మైందుడు అనే బ్రాహ్మణుడు పూజించి సంపూర్ణ మనో రధుడు అయ్యాడు .వైశాఖం లో ఆశ్లేషా నక్షత్రం లో చేసి ధ్వజదత్తుడు మహా ఐశ్వర్య వంతుడ యాడు .వైశాఖ దశమి నాడు యవనాశ్వుడు పూజించి ముక్తిని పొందాడు .జ్యేష్టం లో మఘా నక్షత్రం లో చేసి హరిశర్మ హనుమ అనుగ్రహం పొందాడు .జ్యేష్ట శుద్ధ విదియ రోజున చేసి గాలుడు అనే కిరాతకుడు చేసి కుష్టు వ్యాధి ని పోగొట్టు కొన్నాడు .జ్యేష్ట శుద్ధ దశమి నాడు సుముఖుడు పూజించి ఆంజనేయుణ్ణి ప్రత్యక్షం పొందాడు ..ఆషాఢ  మాసం రోహిణీ నక్షత్రం లో చేసి ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు . శ్రావణ పౌర్ణమి నాడు అర్చించి కశ్యపుడు సర్వాభీష్టాలు పొందాడు ..భాద్రపదం లో అశ్వినీ నక్షత్రం లో సేవించి నాగ కన్య  నాగ లోకం చేరింది .ఆశ్వయుజ మృగశిరా నక్షత్రం లో ద్రౌపది అర్చించి చాలా ప్రసిద్ధి చెందింది .కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అగస్త్య మహర్షి పూజించి సముద్ర జలాలను పురిశిడి  లో నిమ్పేశాడు ..మార్గ శిర శుద్ధ త్రయోదశి నాడు సోమదత్త మహారాజు చేసి పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు ..పుష్యం లో ఉత్తరా నక్షత్రం లో సుషేణుడు అనే గంధర్వుడు అర్చించి గాన విద్య లో మేటి అని పించు కొన్నాడు ..మాఘం లో ఆర్ద్రా నక్షత్రం లో పూజ చేసి నీలుడు సర్వాభీష్టుడ య్యాడు .ఫాల్గుణ పునర్వసు నక్షత్రం లో అంగదుడు సేవించి యువ రాజయ్యాడు .ఆదివారం హస్తా నక్షత్రం లో అర్జునుడు పూజించి శ్రీ కృష్ణు ని  సారధి గా పొందాడు .ఆదివారం మృగశిరా నక్షత్రం లో భీముడు పూజ చేసి కౌరవసంహారం చేశాడు .పూర్వాభాద్ర నక్షత్రం వానర రాజు పుష్కరుడు పూజించి తపస్సిద్ధి పొందాడు .ప్రతి శని వారం భరతుడు సేవించి అవక్ర పరాక్రముడైనాడు .ప్రతి నేల లో వచ్చే ‘’వైద్రుతి యోగం ‘’లో దూర్వాస మహర్షి ఆంజనేయుని పూజ చేసి తపస్సిద్ధి సాధించాడు
                         సోమ వారం నుండి అమా వాస్య వరకు సుగ్రీవుడు భజించి తారను పొంది భయం లేని వాడ నాడు .సీతా దేవి మంగళ వారం పూజించి మనో వాన్చా సిద్ధి పొందింది .కనుక ఈ శారావోదయ వ్రతాన్ని భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారందరూ కృత మనో రధులై అభీష్ట సిద్ధి పొందుతారు అని పరాశరుడు మైత్రేయునికి తెలియ జేశాడు
  శారావోదయ వ్రత  కధ సంపూర్ణం
  సశేషం 

Popular Posts