Followers

Friday 27 February 2015

ఆంజనేయ స్వామి మహాత్మ్యం —37 శరావోదయ వ్రతం– 1

                         
             
       మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని ‘’శరావోదయ వ్రతం ‘’గురించి వివ రించ మని కోరాడు .అప్పుడు పరాశరుడు ఆ వ్రత విదానానాలను గురించి ,దానికి కావలసిన వస్తు సామగ్రి గురించి తెలియ జేశాడు .
       వ్రతం చేయ దలచిన వారు సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు మట్టి మూకుడు లో ఆవు నెయ్యి వేసి ,వండిన అప్పాలను హనుమంతునికి నైవేద్యం చేస్తే అదే శరావదోయ ఉత్సవం .ఇది ఉత్తమ వ్రతం గా తెలియ జేశాడు .పూర్వ కాలం లో ఈ వ్రాతానాన్ని ,మృకండ మహర్షి  బదరికాశ్రమం లో చేశాడు .ఆ వ్రత ప్రభావం వల్ల ,ఆ మహర్షి కి చిరంజీవి ,మహా యోగి ,ఇంద్రియ నిగ్రహుడు అయిన మార్కండేయుడు పుత్రుడు గా జన్మించాడు .అతని కీర్తి మూడు లోకాల్లో వ్యాపించింది .ఈ వ్రతం కోరు కొన్న అన్ని కోరిక లను తీరుస్తుంది ..ఇతర వ్రతాలతో పొంద  లేని ఫలితాన్ని శరావోదయ వ్రతం వల్ల పొంద  వచ్చు .ఈ వ్రతం యొక్క మంత్రాలు నాస్తికునికి ,కృతఘ్నుదికి ,దామ్భికుడికి ,దుర్మార్గునికి ,ఎవరు ఉపదేశింప రాదు అనే నియమాన్ని అందరు పాటించాల్సిందే .
                   మల్లెలు ,పున్నాగ ,మొగలి ,పొగడ ,నంది వర్ధన ,,దాసాని ,కదంబ   ,,గజనిమ్మ ,,తామర ,,కలువ ,యెర్ర గన్నేరు ,,జాజి ,మల్లె,సంపెంగ ,మందార ,పారిజాత ,మోదుగ ,కనకాంబరం ,తుమ్మి ,నీలామ్బరం , ,పచ్చ గోరింటా ,మెట్టతామర సురపోన్న ,వేగిస ,అడవి మల్లె ,పూల గురివింద ,,కొండ గోగు ,పోట్ల  తెల్ల ,జిల్లేడు ,,చంద్ర కాంత ,సుర పున్నాగ ,కుసుమ ,మద్ది ,బంగారు ,చామంతి ,మొదలైన పుష్పాలన్నీ ఈ వ్రతానికి వాడ వచ్చు .అక్షింతలు ,నడుము విరగని తెల్ల బియ్యం ,తిలలు ,ఉపయోగించ వచ్చు .మారేడు ,ఉసరిక ,తామర ,గరిక ,తామర ,జమ్మి ,మామిడి ,నేరేడు ,రుద్రా జట  ,,తులసి ,మాచి పత్రీ ,మర్రి ,గౌరీ జట  ,ఉత్తరేణి పత్రాలను ఉపయోగించ వచ్చు .
           అరటి పళ్ళు ,మామిడి పండ్లు ,నిమ్మ పండ్లు ,పనస ,చింత ,వెలగా ,నేరేడు ,ఖర్జూర ,,రేగు ,దానిమ్మ ,సీతాఫలము ,దోస ,ద్రాక్ష ,చెరకు ,కొబ్బరి కాయ మొదలైన ఫలాలు  శ్రేష్ఠ మైనవి .ఉదయం ,మధ్యాహ్నం ,సాయంత్ర పూజల్లో వేరు వేరు రకాల పూలను ఉపయోగించాలి .వాడిన పుష్పాలను మళ్ళీ వాడ కూడదు .సువాసన నిచ్చే పూలనే వాడాలి .సంపెంగ ,గన్నేరు ,మల్లె ,సన్నజాజి ,దవనం ,వట్టి వేరు ,తులసి మొద లైనవి కూడా వాడ వచ్చు .
           పద్మము ,నంది వర్ధనం ,వనమాలికా ,సంధ్యా వర్తనం (నంది వర్ధనం ),మాధవి పున్నాగ ,మొగలి పూలను ఉదయ కాలం చేసే పూజ లో ఉప యోగించాలి ..మధ్యాహ్న పూజకు తెల్ల తామర ,గన్నేరు ,మోదుగ ,తులసి ,కలువ ,బిల్వ పత్రాలు ,యెర్ర కలువ ,కోవిదారం ,ఏక పత్రం ,తపసాన్కురం ,అనే పది రకాలైన పుష్పాలను వాడాలి .సాయంకాల పూజ కు యెర్ర మందార ,కలువ ,మల్లె ,జాజి ,మాధవి ,గన్నేరు ,హ్రాబెరం ,గజకర్నిక ,దమనం లను వాడాలి .రాత్రి పూజ కు గరిక ,తులసి ,బిల్వం ,గన్నేరు ,సంపెంగ ,విష్ణు క్రాంత ,అశోకం అన్ని వేళలా ఉపయోగించ వచ్చు .రాత్రి మాత్రం బిలవ దళాలకు బదులు వెలగ దళాలను ఉపయోగించ వచ్చు .అన్ని కాలాల్లో ,అన్ని వేలల్లో తులసీ దళాన్ని వాడ వచ్చు .
             దీని తర్వాతా యే పుష్పాలతో పూజిస్తే ,ఏయే కోర్కెలు నేర వేరు తాయో ఇంకో సారి తెలియ జేస్తాను .
  సశేషం 



      

Popular Posts