Followers

Thursday 8 January 2015

నామరామాయణం (ఉత్తరకాండము- తాత్పర్యము తో పాటుగా )



ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |
తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |
ఉత్తరకాండము: తాత్పర్యము
ఓ రామా! నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.
మంగళం-
భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |

రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

Popular Posts