Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై తొమ్మిదవ అధ్యాయం


           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తతః పర్వణ్యుపావృత్తే ప్రచణ్డః పాంశువర్షణః
భీమో వాయురభూద్రాజన్పూయగన్ధస్తు సర్వశః

బలరాముడు కొంత కాలం అక్కడ ఉండి, పర్వ వచ్చేంత వరకూ వేచి చూసాడు.

తతోऽమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితమ్
అభవద్యజ్ఞశాలాయాం సోऽన్వదృశ్యత శూలధృక్

పర్వ రాగానే ప్రంచండమైన దుమ్మూ ధూళీ కురిపిస్తూ ఆ రాక్షసుడు రానే వచ్చాడు.

తం విలోక్య బృహత్కాయం భిన్నాఞ్జనచయోపమమ్
తప్తతామ్రశిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్రభ్రుకుటీముఖమ్

అలా శూలం ధరించిన రాక్షసున్ని చూచాడు. కాటుక ముద్దలా,గుట్టలా ఉన్నాడు.
బాగా కాలిన ఎర్రని మీసాలూ దమ్ష్ట్రలూ కలిగి ఉన్నాడు

సస్మార మూషలం రామః పరసైన్యవిదారణమ్
హలం చ దైత్యదమనం తే తూర్ణముపతస్థతుః

బలరాముడు, శత్రు సైన్యాన్ని సంహరించే తన నాగలినీ రోకలినీ స్మరించాడు

తమాకృష్య హలాగ్రేణ బల్వలం గగనేచరమ్
మూషలేనాహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మద్రుహం బలః

నాగలి మెడకేసి లాగి రోకలితో మోదాడు. ఆ ఒక్క దెబ్బతో పడిపోయి నెత్తురు కక్కుతూ పడిపోయాడు

సోऽపతద్భువి నిర్భిన్న లలాటోऽసృక్సముత్సృజన్
ముఞ్చన్నార్తస్వరం శైలో యథా వజ్రహతోऽరుణః

బలరామున్ని మునులు పొగిడి ఆశీర్వచనం చేసారు. వేదమంత్రాలతో అభిషేకం చేసారు. వైజయంతీ మాలను (ఎన్నడూ వాడని పద్మం కలది) కొత్త వస్త్రాలనూ దివ్యాభరణాలనూ , వీటితో అలంకరిస్తే వారి ఆజ్ఞ్యను పొంది

సంస్తుత్య మునయో రామం ప్రయుజ్యావితథాశిషః
అభ్యషిఞ్చన్మహాభాగా వృత్రఘ్నం విబుధా యథా

వైజయన్తీం దదుర్మాలాం శ్రీధామామ్లానపఙ్కజాం
రామాయ వాససీ దివ్యే దివ్యాన్యాభరణాని చ

అథ తైరభ్యనుజ్ఞాతః కౌశికీమేత్య బ్రాహ్మణైః
స్నాత్వా సరోవరమగాద్యతః సరయూరాస్రవత్

బయలు దేరి కైశికీ నదిలో స్నానం చేసి అక్కడ నుండి సరోవరానికి వెళ్ళాడు. ఈ సరోవరం నుండి బయలుదేరిన నదే సరయూ నది

అనుస్రోతేన సరయూం ప్రయాగముపగమ్య సః
స్నాత్వా సన్తర్ప్య దేవాదీన్జగామ పులహాశ్రమమ్

పులహాశ్రామినికి చేరాడు

గోమతీం గణ్డకీం స్నాత్వా విపాశాం శోణ ఆప్లుతః
గయాం గత్వా పితౄనిష్ట్వా గఙ్గాసాగరసఙ్గమే

గయలో పితృ శ్రార్థాలు చేసి, గంగా సంగమానికి వెళ్ళి

ఉపస్పృశ్య మహేన్ద్రాద్రౌ రామం దృష్ట్వాభివాద్య చ
సప్తగోదావరీం వేణాం పమ్పాం భీమరథీం తతః

మహేంద్రాద్రికి వెళ్ళి పరశురామున్ని చూచి నమస్కరించాడు
భీమరధీ కి వెళ్ళి కుమారస్వామిని చూచాడు

స్కన్దం దృష్ట్వా యయౌ రామః శ్రీశైలం గిరిశాలయమ్
ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాద్రిం వేఙ్కటం ప్రభుః

శ్రీశైలం వేంకటాద్రీ వెళ్ళాడు

కామకోష్ణీం పురీం కాఞ్చీం కావేరీం చ సరిద్వరామ్
శ్రీరన్గాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః

కాంచిపురాన్ని కావేరీ నదినీ, శ్రీరంగాన్నీ,

ఋషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా
సాముద్రం సేతుమగమత్మహాపాతకనాశనమ్

ఋషభాద్రినీ రామేశ్వారాన్నీ చూచాడు

తత్రాయుతమదాద్ధేనూర్బ్రాహ్మణేభ్యో హలాయుధః
కృతమాలాం తామ్రపర్ణీం మలయం చ కులాచలమ్

ఈ సేతువులో పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు

త్రాగస్త్యం సమాసీనం నమస్కృత్యాభివాద్య చ
యోజితస్తేన చాశీర్భిరనుజ్ఞాతో గతోऽర్ణవమ్
దక్షిణం తత్ర కన్యాఖ్యాం దుర్గాం దేవీం దదర్శ సః

కులాచలములో అగస్త్యున్ని దర్శించి నమస్కరించాడు. అక్కడ నుంచి సముద్రానికి వెళ్ళాడు
కన్యాకుమారికి వెళ్ళి దుర్గా దేవిని దర్శించాడు

తతః ఫాల్గునమాసాద్య పఞ్చాప్సరసముత్తమమ్
విష్ణుః సన్నిహితో యత్ర స్నాత్వాస్పర్శద్గవాయుతమ్

తతోऽభివ్రజ్య భగవాన్కేరలాంస్తు త్రిగర్తకాన్
గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం యత్ర ధూర్జటేః

ఆవులను దానం చేసాడు
గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు

ఆర్యాం ద్వైపాయనీం దృష్ట్వా శూర్పారకమగాద్బలః
తాపీం పయోష్ణీం నిర్విన్ధ్యాముపస్పృశ్యాథ దణ్డకమ్

ప్రవిశ్య రేవామగమద్యత్ర మాహిష్మతీ పురీ
మనుతీర్థముపస్పృశ్య ప్రభాసం పునరాగమత్

అన్నిటినీ తిరిగి ప్రభాస తీర్థానికి వచ్చాడు..

శ్రుత్వా ద్విజైః కథ్యమానం కురుపాణ్డవసంయుగే
సర్వరాజన్యనిధనం భారం మేనే హృతం భువః

యుద్ధం ఎంత వరకూ వచ్చింది అని విచారిస్తే, రాజులనదరూ వధించబడ్డారు అన్న వార్త విని భూభారం తగ్గింది అనుకున్నాడు

స భీమదుర్యోధనయోర్గదాభ్యాం యుధ్యతోర్మృధే
వారయిష్యన్వినశనం జగామ యదునన్దనః

దుర్యోధన భీములు గదా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసి దాన్ని ఆపుదామని వచ్చాడు

యుధిష్ఠిరస్తు తం దృష్ట్వా యమౌ కృష్ణార్జునావపి
అభివాద్యాభవంస్తుష్ణీం కిం వివక్షురిహాగతః

ఆయన రాగానే అందరూ నమస్కారం చేసాడు. వచ్చి ఏమి చేస్తాడా అని అందరూ ఆలోచిస్తూ మౌనముగా ఉన్నారు. ఎక్కువగా మాట్లాడలేదు

గదాపాణీ ఉభౌ దృష్ట్వా సంరబ్ధౌ విజయైషిణౌ
మణ్డలాని విచిత్రాణి చరన్తావిదమబ్రవీత్

గదలు పట్టుకుని ఉన్న దుర్యోధనున్నీ భీమున్నీ చూచాడు

యువాం తుల్యబలౌ వీరౌ హే రాజన్హే వృకోదర
ఏకం ప్రాణాధికం మన్యే ఉతైకం శిక్షయాధికమ్

భీమా దుర్యోధనా మీరిద్దరూ సమాన బలం ఉన్నవారు. ఒకరికి బలమెక్కువ ఒకరికి నేర్పరితనం ఎక్కువ.

తస్మాదేకతరస్యేహ యువయోః సమవీర్యయోః
న లక్ష్యతే జయోऽన్యో వా విరమత్వఫలో రణః

మీ ఇద్దరిలో ఏ ఒక్కరో గెలిచే మాట అబద్దం. ఫలితం లేని యుద్ధాన్ని మానేయ్యండి అని చెప్పగా ఆయన మాటను ఎవరూ వినిపినంచుకోలేదు

న తద్వాక్యం జగృహతుర్బద్ధవైరౌ నృపార్థవత్
అనుస్మరన్తావన్యోన్యం దురుక్తం దుష్కృతాని చ

బాగా బద్ధ వైరులైన వారికి ఆ మాటలౌ పట్టలేదు
ఒకరు పలికిన మాటలు ఒకరికి జ్ఞ్యాపకం వచ్చి ద్వేషం పెరుగుతూనే ఉంది వారికి

దిష్టం తదనుమన్వానో రామో ద్వారవతీం యయౌ
ఉగ్రసేనాదిభిః ప్రీతైర్జ్ఞాతిభిః సముపాగతః

వారి కర్మ అని వారిని వదిలేసి ద్వారకకు వెళ్ళాడు

తం పునర్నైమిషం ప్రాప్తమృషయోऽయాజయన్ముదా
క్రత్వఙ్గం క్రతుభిః సర్వైర్నివృత్తాఖిలవిగ్రహమ్

మళ్ళీ తిరిగి బలరాముడు నైమిషారణ్యానికి వెళ్ళగా ఆయనతో ఋషులందరూ యజ్ఞ్యం చేయించారు
యజ్ఞ్యమంతా చేయగా అన్ని వైరాలనూ మానుకున్న బలరాముడు

తేభ్యో విశుద్ధం విజ్ఞానం భగవాన్వ్యతరద్విభుః
యేనైవాత్మన్యదో విశ్వమాత్మానం విశ్వగం విదుః

వారందరికీ పరిశుద్ధమైన బ్రహ్మజ్ఞ్యానాన్ని ఉపదేశించాడు
ఈ జ్ఞ్యానముతో జగత్తంతా పరమాత్మలో ఉన్నదనీ పరమాత్మ జగత్తులో ఉన్నాడని వారికి అర్థమయ్యింది

స్వపత్యావభృథస్నాతో జ్ఞాతిబన్ధుసుహృద్వృతః
రేజే స్వజ్యోత్స్నయేవేన్దుః సువాసాః సుష్ఠ్వలఙ్కృతః

ఇలా భార్యతో బంధువులతో మిత్రులతో అవభృత స్నానం చేసాడు
మంచి వస్త్రాలు కట్టుకుని బాగా అలంకరించుకుని శోభించాడు

ఈదృగ్విధాన్యసఙ్ఖ్యాని బలస్య బలశాలినః
అనన్తస్యాప్రమేయస్య మాయామర్త్యస్య సన్తి హి

బలరాముడు చేసిన ఇటువంటి అమోఘమైన బలము చూపే పనులు చాలానే ఉన్నాయి
ఈయన అనంతుడు, ఇంతటివాడు అని తెలుసుకోదగిన వాడు కాడు

యోऽనుస్మరేత రామస్య కర్మాణ్యద్భుతకర్మణః
సాయం ప్రాతరనన్తస్య విష్ణోః స దయితో భవేత్

ఇలాంటి బలరాముని కర్మలు పొద్దున్నా సాయంకాలం స్మరిస్తే పరమాత్మకు ప్రీతి పాత్రుడవుతాడు

 
                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts