Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఎనిమిదవ అధ్యాయం


                  ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఎనిమిదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
దేవాసురమనుష్యేసు యే భజన్త్యశివం శివమ్
ప్రాయస్తే ధనినో భోజా న తు లక్ష్మ్యాః పతిం హరిమ్

ధనవంతులందరూ శివున్ని ప్రార్థిస్తారు. విష్ణువును పూజించడములేదు. అన్నీ ఉండీ స్వామి ఏమీ ఇవ్వడా. స్వామిని ఆరాధించే వారు దరిద్రులుగా ఉంటున్నారు

ఏతద్వేదితుమిచ్ఛామః సన్దేహోऽత్ర మహాన్హి నః
విరుద్ధశీలయోః ప్రభ్వోర్విరుద్ధా భజతాం గతిః

నాకు ఇది ఒక పెద్ద సందేహము. ఇరువురి స్వభావం విరుద్ధం. ఐనా వారిని పూజిస్తే విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ సందేహం తీర్చండి

శ్రీశుక ఉవాచ
శివః శక్తియుతః శశ్వత్త్రిలిఙ్గో గుణసంవృతః
వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా

శంకరుడు అహంకారం నుండి వచ్చాడు. అందులో సాత్విక రాజసిక రాజసిక అహంకారములో సాత్విక అహంకారమునుండి శంకరుడు వచ్చాడు. ఆయన శక్తితో కూడి ఉన్నవాడు. ఈయన సాత్విక రాజసిక తామస గుణములు కలవాడు, ఈ మూడు గుణములూ సూచించేవాడు, ధరించేవాడు. ఇదే సాత్విక రాజసిక తామస అహంకారం

తతో వికారా అభవన్షోడశామీషు కఞ్చన
ఉపధావన్విభూతీనాం సర్వాసామశ్నుతే గతిమ్

దానినుండే పంచ జ్ఞ్యానేంద్రియాలూ కర్మేంద్రియాలూ పంచభూతాలూ పుట్టాయి.
వీటిని ఏ విహ్బూతికి ఆ విభూతి, ఏ శక్తికి ఆ శక్తికీ వేరుగా ఉంటే పని జరుగదు. అన్ని ఇంద్రియాలనూ శాసించేది మనసు.
సకల విభూతుల స్వరూపాన్ని తాను స్వీకరించి ఒక నిర్దేశాన్ని ఇస్తాడు. ఏ ఇంద్రియం ఏ పని చేయాలో నిర్దేశిస్తాడు.

హరిర్హి నిర్గుణః సాక్షాత్పురుషః ప్రకృతేః పరః
స సర్వదృగుపద్రష్టా తం భజన్నిర్గుణో భవేత్

శంకరుడు సగుణుడిగా ఏర్పడ్డ స్వామి. గుణాలనూ అహంకారాన్ని అహంకారములో భేధాలను వాటి వలన కలిగే వికారాలనూ అందరికీ సమానముగా పంచి వాటి అనుభావాలను అందరికీ అందించడం ఆయన పని
అందుకు ఆయనను సేవించినవారికి ఆ గుణములూ అనుభూతులూ ఉంటాయి
హరి, ప్రకృతికి అతీతుడు. ఆయన అన్నీ చూచేవాడు. ఎవరు ఏ పని చేస్తున్నా వారికి ఆ పని చూపేవాడూ, చూసేవాడు శంకరుడు. ఆయన నిర్గుణుడు. ఆయనను సేవిస్తే మనం నిర్గుణులమవుతాము.

నివృత్తేష్వశ్వమేధేషు రాజా యుష్మత్పితామహః
శృణ్వన్భగవతో ధర్మానపృచ్ఛదిదమచ్యుతమ్

నీవడిగిన ప్రశ్నను ధర్మరాజు కూడా అశ్వమేధ యాగం పూర్తి ఐన తరువాత అడిగాడు
భగవంతుని ధర్మాలను భగవానుని నుండే విన్నాడు

స ఆహ భగవాంస్తస్మై ప్రీతః శుశ్రూషవే ప్రభుః
నృణాం నిఃశ్రేయసార్థాయ యోऽవతీర్ణో యదోః కులే

శ్రద్ధాళువైన ధర్మరాజుకు,  సకల జీవులను ఉద్ధరించడానికి యాదవ కులములో అవతరించిన పరమాత్మ ధర్మరాజుతో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః
తతోऽధనం త్యజన్త్యస్య స్వజనా దుఃఖదుఃఖితమ్

నేను ఎవరిని అనుగ్రహించుకోదలచుకున్నానో మెల మెల్లగా వారి సంపదలను హరిస్తాను.
మనను బంధించే వారు మన బంధువులే. వీరి మధయన ఉన్న మనం భగవంతుని తలచుకోలేము. మనం భగవంతుని తలచుకోవడానికి వీలు లేకుండా చేస్తారు. ఒక సారి ధనము పోతే వారంతా విడిచిపెడతారు. దుఃఖముతో దుఃఖిస్తున్న వీడి ఏడుపు మనకెందుకు అని వదలిపెడతారు. ఎపుడైతే డబ్బు లేదో బిక్షుకులంతా చేరుతారు.

స యదా వితథోద్యోగో నిర్విణ్ణః స్యాద్ధనేహయా
మత్పరైః కృతమైత్రస్య కరిష్యే మదనుగ్రహమ్

అటువంటి వారు నన్ను శరణు వేడుతారు. డబ్బు సంపాదించుట డబ్బు కూర్చుంకొనుట ఇటువంటి ఫలితాన్నే ఇస్తుంది అని విరక్తిని పొందుతాడు. అపుడు
నా భక్తులతో స్నేహం ఏర్పరచుకుంటాడు. నేను నా అనుగ్రహాన్ని వాడి మీద చూపుతాను. తరువాత నేను ఎంత ధనం ఇచ్చినా, విరక్తుడైన అతని మీద ఎటువంటి ప్రభావం చూపదు

తద్బ్రహ్మ పరమం సూక్ష్మం చిన్మాత్రం సదనన్తకమ్
విజ్ఞాయాత్మతయా ధీరః సంసారాత్పరిముచ్యతే

అందుకే నన్ను సేవించడం కష్టం. నేను ఎవరికీ అర్థం కాను. నేను చేసేదీ ఎవరికీ అర్థం కాదు. మనసు నా మీద నిలువదు. నన్ను ఆరాధించుట చాలా కష్టం. నేను కేవల్ జ్ఞ్యానాంద స్వరూపుడిని. అందరకూ జ్ఞ్యానము లేని ఆనందం కావాలి. 

అతో మాం సుదురారాధ్యం హిత్వాన్యాన్భజతే జనః
తతస్త ఆశుతోషేభ్యో లబ్ధరాజ్యశ్రియోద్ధతాః
మత్తాః ప్రమత్తా వరదాన్విస్మయన్త్యవజానతే

మద్యపానం చేసిన వాడికి నాలుక మీద రుచి పోవాలి, లోపల మనసును మత్తెక్కించాలి, చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకూడదు. అజ్ఞ్యానముతో అలా రమించేవరికి జ్ఞ్యానాకరమైన నేను ఎలా నచ్చుతాను
చాలా కష్టముతో పూజించవలసిన నన్ను విడిచిపెట్టి లోకులు ఇతరులను పూజిస్తారు. శంకరుడు త్వరగా సంతోషిస్తాడు. అన్నీ అందరికీ ఇచ్చే శంకరుడు తానేదీ కోరడు
సనకాదులు శంకరుని ద్వారానే తత్వ జ్ఞ్యానం పొందారు
త్వరగా సంతోషిస్తారు మిగతా దేవతలు

శ్రీశుక ఉవాచ
శాపప్రసాదయోరీశా బ్రహ్మవిష్ణుశివాదయః
సద్యః శాపప్రసాదోऽఙ్గ శివో బ్రహ్మా న చాచ్యుతః

వారి నుండి రాజ్యమూ సంపదా పొంది మదిస్తారు. మదం వారి తలకెక్కి వరమిచ్చినవారినే సంహరిస్తారు.ఒక్క సారి నన్ను స్మరిస్తే మళ్ళీ మరువరు .వరమిచ్చిన వారికే హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు.
దేవతలంతా శపిస్తారూ, అనుగ్రహిస్తారు. ఐనా తొందరగా అనుగ్రహించడం. తొందరగా కోపించడం బ్రహ్మా శివులు చేస్తారు. విష్ణువు మాత్రం తొందరగా వరమివ్వడు, తొందరగా శపించడు


అత్ర చోదాహరన్తీమమితిహాసం పురాతనమ్
వృకాసురాయ గిరిశో వరం దత్త్వాప సఙ్కటమ్

ఈ విషయములో ఒక పురాణ కథనం ఉంది. వృకాసురుడనే అసురునికి శంకరుడు వరమిచ్చి లేనిపోని కష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇతను శకుని పుత్రుడు. నారదుడు దారిలో కలిస్తే, ఉన్న దేవతలలో త్వరగా ప్రసన్నమై వరాలిచ్చేది ఎవరు అని అడిగితే శంకరుని పేరు చెప్పాడు

వృకో నామాసురః పుత్రః శకునేః పథి నారదమ్
దృష్ట్వాశుతోషం పప్రచ్ఛ దేవేషు త్రిషు దుర్మతిః

స ఆహ దేవం గిరిశముపాధావాశు సిద్ధ్యసి
యోऽల్పాభ్యాం గుణదోషాభ్యామాశు తుష్యతి కుప్యతి

రావణాసురునికీ బాణాసురునికీ పిలవగానే వచ్చి వరమిచ్చాడు

దశాస్యబాణయోస్తుష్టః స్తువతోర్వన్దినోరివ
ఐశ్వర్యమతులం దత్త్వా తత ఆప సుసఙ్కటమ్

ఇత్యాదిష్టస్తమసుర ఉపాధావత్స్వగాత్రతః
కేదార ఆత్మక్రవ్యేణ జుహ్వానో గ్నిముఖం హరమ్

ఇది విని శంకరున్ని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళి భయంకరముగా పూజించాడు. తన మాంసాన్నే

దేవోపలబ్ధిమప్రాప్య నిర్వేదాత్సప్తమేऽహని
శిరోऽవృశ్చత్సుధితినా తత్తీర్థక్లిన్నమూర్ధజమ్

తదా మహాకారుణికో స ధూర్జటిర్యథా వయం చాగ్నిరివోత్థితోऽనలాత్
నిగృహ్య దోర్భ్యాం భుజయోర్న్యవారయత్తత్స్పర్శనాద్భూయ ఉపస్కృతాకృతిః

తమాహ చాఙ్గాలమలం వృణీష్వ మే యథాభికామం వితరామి తే వరమ్
ప్రీయేయ తోయేన నృణాం ప్రపద్యతామహో త్వయాత్మా భృశమర్ద్యతే వృథా

హోమం చేస్తూ పూజించాడు.  ఇంత చేసినా శంకరుడు రాకపోతే ఏడవ రోజున తన శిరస్సునే ఆహుతి చేయబోతూ ఉంటే కరుణామయుడైన స్వామి అగ్ని నుండి వచ్చి పట్టుకున్నాడు . పరమాత్మ స్పర్శ వలన శరీరం మళ్ళీ బలం పుంజుకోగా, శంకరుడు ఏమి వరం కావాలి కోరుకో. ఈ శరీరాన్ని ఇంత హింసిస్తావా


దేవం స వవ్రే పాపీయాన్వరం భూతభయావహమ్
యస్య యస్య కరం శీర్ష్ణి ధాస్యే స మ్రియతామితి

తచ్ఛ్రుత్వా భగవాన్రుద్రో దుర్మనా ఇవ భారత
ఓం ఇతి ప్రహసంస్తస్మై దదేऽహేరమృతం యథా

స తద్వరపరీక్షార్థం శమ్భోర్మూర్ధ్ని కిలాసురః
స్వహస్తం ధాతుమారేభే సోऽబిభ్యత్స్వకృతాచ్ఛివః

తేనోపసృష్టః సన్త్రస్తః పరాధావన్సవేపథుః
యావదన్తం దివో భూమేః కష్ఠానాముదగాదుదక్

తాను ఎంత భయంకరముగా పూజించాడో, అంత భయంకరమైన వరాన్నే అడిగాడు. నేను ఎవరి శిరస్సున హస్తముంచుతానొ వారు భస్మం కావాలి అని అడిగితే శంకరుడు బాధపడుతూనే చిరునవ్వు నవ్వి ఆ వరాన్ని ఇచ్చహడు
వృకాసురునికి పార్వతీ అమ్మవారిని హరించాలి అన్న కోరిక పుట్టింది. ఆ లాలసతో ఈ వరము నిజమైనదేనా పరీక్షిద్దామని శంకరున్నే పరీక్షించబోయాడు

అజానన్తః ప్రతివిధిం తూష్ణీమాసన్సురేశ్వరాః
తతో వైకుణ్ఠమగమద్భాస్వరం తమసః పరమ్

యత్ర నారాయణః సాక్షాన్న్యాసినాం పరమో గతిః
శాన్తానాం న్యస్తదణ్డానాం యతో నావర్తతే గతః

ఇటువంటి సంకట స్థితిలో శంకరుడు పరిగెత్తాడు. భూ భువ సువర్లోకాలు పరిగెత్తి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ సన్యాసులకు గతి ఐన నారాయణుడు ఉన్నాడు


తం తథా వ్యసనం దృష్ట్వా భగవాన్వృజినార్దనః
దూరాత్ప్రత్యుదియాద్భూత్వా బటుకో యోగమాయయా

మేఖలాజినదణ్డాక్షైస్తేజసాగ్నిరివ జ్వలన్
అభివాదయామాస చ తం కుశపాణిర్వినీతవత్

శ్రీభగవానువాచ
శాకునేయ భవాన్వ్యక్తం శ్రాన్తః కిం దూరమాగతః
క్షణం విశ్రమ్యతాం పుంస ఆత్మాయం సర్వకామధుక్

యది నః శ్రవణాయాలం యుష్మద్వ్యవసితం విభో
భణ్యతాం ప్రాయశః పుమ్భిర్ధృతైః స్వార్థాన్సమీహతే

అన్నీ వదలిపెట్టి పరమశాంతులైన వారు అన్ని వదలి అక్కడకు వెళితే మరలి రారు. అతను దుఃఖాన్నీ కష్టాన్ని తొలగించేవాడు. ఆయన శంకరున్ని చూచి యోగ మాయతో బ్రహ్మచారి రూపాన్ని ధరించి, మేకలం అజినమ బ్రహ్మ దండం వీటిని తీసుకుని రెండవ అగ్నిలా ప్రకాశిస్తూ ఆ అసురునికి ఎదురుపడ్డాడు. శంకరుడు ఆయనకు నమస్కరించాడు. అపుడూ వృకాసురునికి ఎదురుపడి.
బాగా అలసిపోయినట్లు ఉన్నావు. ఎక్కడ నుంచి వస్తున్నావు. అంత తొంద్ర ఎందుకు ఎక్కడకు వెళుతున్నావు. ఇక్కడ విశ్రాంతి తీసుకో


నాకు చెప్పవచ్చు అనుకుంటే మీరేమి చేయబోతున్నారో తెలియజేయండి. లోకములో ప్రతీ ప్రాణీ స్వార్థాన్నే కోరుతుంది.నీకు ఏమి కావాలి. దేన్ని కోరి ఇలా బయలు దేరావో చెప్పవచ్చు అనుకుంటే చెప్పండి అని అడిగితే

శ్రీశుక ఉవాచ
ఏవం భగవతా పృష్టో వచసామృతవర్షిణా
గతక్లమోऽబ్రవీత్తస్మై యథాపూర్వమనుష్ఠితమ్

కాస్త విశ్రాంతి తీసుకుని యధాపూర్వం జరిగింది చెప్పాడు

శ్రీభగవానువాచ
ఏవం చేత్తర్హి తద్వాక్యం న వయం శ్రద్దధీమహి
యో దక్షశాపాత్పైశాచ్యం ప్రాప్తః ప్రేతపిశాచరాట్

శంకరున్ని నమ్ముతావా. ఆయన సంగతి తెలిసే దక్షుడు శపించాడు. ఆయన ప్రేతాలకు రాజు.

యది వస్తత్ర విశ్రమ్భో దానవేన్ద్ర జగద్గురౌ
తర్హ్యఙ్గాశు స్వశిరసి హస్తం న్యస్య ప్రతీయతామ్

యద్యసత్యం వచః శమ్భోః కథఞ్చిద్దానవర్షభ
తదైనం జహ్యసద్వాచం న యద్వక్తానృతం పునః

నేనైతే ఆయనను నమ్మను.నీవు అమాయకుడిలా ఉన్నావు.
నీవు అనుకున్నది నిజమో అబద్దమో తెలియడానికి శంకరుడెందుకు.నీకూ తల ఉంది, చేయి ఉంది. నీ తల మీద చేయి వేసి చూసుకో. నేనైతే నమ్మను. నీవు కూడా నమ్మవు కదా. నీ నెత్తిన చేయి వేసి చూసుకో. ఆయన ఇచ్చిన వరం అబద్దం అని తెలిసిపోతుంది. అపుడు ఆయనను శిక్షిద్దాము
మళ్ళీ ఇలా అబద్దం ఆడకుండా శిక్షిద్దాము

ఇత్థం భగవతశ్చిత్రైర్వచోభిః స సుపేశలైః
భిన్నధీర్విస్మృతః శీర్ష్ణి స్వహస్తం కుమతిర్న్యధాత్

అథాపతద్భిన్నశిరాః వ్రజాహత ఇవ క్షణాత్
జయశబ్దో నమఃశబ్దః సాధుశబ్దోऽభవద్దివి

ముముచుః పుష్పవర్షాణి హతే పాపే వృకాసురే
దేవర్షిపితృగన్ధర్వా మోచితః సఙ్కటాచ్ఛివః

ముక్తం గిరిశమభ్యాహ భగవాన్పురుషోత్తమః
అహో దేవ మహాదేవ పాపోऽయం స్వేన పాప్మనా

అది విని సరే అని, ఆ రాక్షసుడు చిత్రమైన మాటలతో మనసును మరిపించగా ఆ కుమతి, తన చేయి తన నెత్తి మీద పెట్టుకుని వజ్రముతో కొట్టబడిన పర్వతములా కిందబడిపోయాడు. అందరూ జయ జయ ధ్వానాలు చేసారు, పుష్పవర్షం కురిపించారు. శంకరునికి కష్టం తప్పించబడింది అని అందరూ అనుకున్నారు


ఆపద నుండి బయటపడిన శంకరునితో స్వామి ఇలా అన్నాడు. వీడు పాపి. వాడి పాపముతో వాడే చచ్చాడు. మహానుభావులకు అపకారం చేయాలి అనుకున్నవాడు ఎవడు బాగుంటాడు

హతః కో ను మహత్స్వీశ జన్తుర్వై కృతకిల్బిషః
క్షేమీ స్యాత్కిము విశ్వేశే కృతాగస్కో జగద్గురౌ

య ఏవమవ్యాకృతశక్త్యుదన్వతః పరస్య సాక్షాత్పరమాత్మనో హరేః
గిరిత్రమోక్షం కథయేచ్ఛృణోతి వా విముచ్యతే సంసృతిభిస్తథారిభిః

అందులో నీవు విశ్వేశ్వరుడవు, జగద్గురువువి. నీకు అపకారం చేసిన వాడు బాగుంటాడా
ఈ రీతిలో ఎవరికీ ఏమీ అర్థం కాని అనంతమైన శక్తులకు నిధి ఐన పరమాత్మ నుండి శంకరుని మోక్షాన్ని చెప్పినవాడూ విన్నవాడూ, సంసారం నుండి విడువడతాడు, సంసారములో ఉన్నా శత్రు బాధలు ఉండవు
ఈ అధ్యాయం రోజూ పదకొండు సార్లు చదివితే శత్రువులు కూడా లొంగుతారు. శత్రుభయం ఉన్నపుడు ఈ అధ్యాయం చదవాలి

                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts