Followers

Sunday 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై నాలుగవ అధ్యాయం

             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై నాలుగవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఏకదోపవనం రాజన్జగ్ముర్యదుకుమారకాః
విహర్తుం సామ్బప్రద్యుమ్న చారుభానుగదాదయః

ఒక సారి కృష్ణుని పుత్రులంతా, అందరిలో ఒక గుంపుగా ఉపవనములో విహారానికి వెళ్ళారు

క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్వన్తః పిపాసితాః
జలం నిరుదకే కూపే దదృశుః సత్త్వమద్భుతమ్

అక్కడ నీరు లేని బావి చూసారు. అందులో ఒక పెద్ద తొండ (ఊసరవెల్లి) ఉంది. అది పెద్ద పర్వతం అంత ఉంది

కృకలాసం గిరినిభం వీక్ష్య విస్మితమానసాః
తస్య చోద్ధరణే యత్నం చక్రుస్తే కృపయాన్వితాః

బావిలో పడింది. బయటకు రావడానికి కష్టపడుతోందని ఎంత ప్రయత్నించినా వారి వలన కాలేదు.

చర్మజైస్తాన్తవైః పాశైర్బద్ధ్వా పతితమర్భకాః
నాశక్నురన్సముద్ధర్తుం కృష్ణాయాచఖ్యురుత్సుకాః

ఏమి చేయాలో అర్థం కాక స్వామి వద్దకు వెళ్ళారు అందరూ కలసి

తత్రాగత్యారవిన్దాక్షో భగవాన్విశ్వభావనః
వీక్ష్యోజ్జహార వామేన తం కరేణ స లీలయా

కృష్ణుడు అవలీలగా ఎడమ చేత్తో బయటకు తీసాడు

స ఉత్తమఃశ్లోకకరాభిమృష్టో విహాయ సద్యః కృకలాసరూపమ్
సన్తప్తచామీకరచారువర్ణః స్వర్గ్యద్భుతాలఙ్కరణామ్బరస్రక్

కృష్ణ పరమాత్మ స్పర్శ కలగగానే అతనికి ఆ ఆకారం పోయి ఆభరణములతో కుండలములతో సుందరమైన రూపం వచ్చింది.

పప్రచ్ఛ విద్వానపి తన్నిదానం జనేషు విఖ్యాపయితుం ముకున్దః
కస్త్వం మహాభాగ వరేణ్యరూపో దేవోత్తమం త్వాం గణయామి నూనమ్

కృష్ణ పరమాత్మ తెలిసికూడా, ఆయనను అడిగారు. ఇలాంటి రూపం కలిగిన నీవు జుగుప్సాకరమైన తొండ రూపాన్ని ఎలా పొందావు. మేము వినదగినదే ఐతే, వినవచ్చు అని నీవనుకుంటే మాకు చెప్పవలసింది. అని స్వామి అన్నాడు

దశామిమాం వా కతమేన కర్మణా సమ్ప్రాపితోऽస్యతదర్హః సుభద్ర
ఆత్మానమాఖ్యాహి వివిత్సతాం నో యన్మన్యసే నః క్షమమత్ర వక్తుమ్

శ్రీశుక ఉవాచ
ఇతి స్మ రాజా సమ్పృష్టః కృష్ణేనానన్తమూర్తినా
మాధవం ప్రణిపత్యాహ కిరీటేనార్కవర్చసా

నృగ ఉవాచ
నృగో నామ నరేన్ద్రోऽహమిక్ష్వాకుతనయః ప్రభో
దానిష్వాఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశమ్

నేను ఇక్ష్వాకు పుత్రున్ని. నా పేరు నృగుడు.

కిం ను తేऽవిదితం నాథ సర్వభూతాత్మసాక్షిణః
కాలేనావ్యాహతదృశో వక్ష్యేऽథాపి తవాజ్ఞయా

భూమి మీద ఎన్ని రేణువులున్నాయో ఆకాశములో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని గోవులను దానం చేసాడు.

యావత్యః సికతా భూమేర్యావత్యో దివి తారకాః
యావత్యో వర్షధారాశ్చ తావతీరదదం స్మ గాః

పయస్వినీస్తరుణీః శీలరూప గుణోపపన్నాః కపిలా హేమసృఙ్గీః
న్యాయార్జితా రూప్యఖురాః సవత్సా దుకూలమాలాభరణా దదావహమ్

స్వలఙ్కృతేభ్యో గుణశీలవద్భ్యః సీదత్కుటుమ్బేభ్య ఋతవ్రతేభ్యః
తపఃశ్రుతబ్రహ్మవదాన్యసద్భ్యః ప్రాదాం యువభ్యో ద్విజపుఙ్గవేభ్యః

ఇంక ప్రపంచములో నా అంత గోదానం చేసేవాడు  ఎవరూ  ఉండరు అని కూడా అనుకున్నాడు. నేను మాత్రమే ధర్మాన్ని ఆచరించగలను అనుకోవడం తప్పు.
ఒక సారి ఈ రాజు ఇచ్చిన ఆవులలో ఒక ఆవు తప్పించుకుని వచ్చి రాజుగారి ఆవుల గుంపులో చేరితే ఆ గుంపును ఇంకొకరికి దానం ఇచ్చాడు. అది చూసిన మొదటి బ్రాహ్మణుడు అది నా ఆవు అని అంటే కాదు రాజుగారు నాకు ఇచ్చారని అన్నాడు.

గోభూహిరణ్యాయతనాశ్వహస్తినః కన్యాః సదాసీస్తిలరూప్యశయ్యాః
వాసాంసి రత్నాని పరిచ్ఛదాన్రథానిష్టం చ యజ్ఞైశ్చరితం చ పూర్తమ్

కస్యచిద్ద్విజముఖ్యస్య భ్రష్టా గౌర్మమ గోధనే
సమ్పృక్తావిదుషా సా చ మయా దత్తా ద్విజాతయే

తాం నీయమానాం తత్స్వామీ దృష్ట్రోవాచ మమేతి తమ్
మమేతి పరిగ్రాహ్యాహ నృగో మే దత్తవానితి

విప్రౌ వివదమానౌ మామూచతుః స్వార్థసాధకౌ
భవాన్దాతాపహర్తేతి తచ్ఛ్రుత్వా మేऽభవద్భ్రమః

ఇద్దరూ రాజు వద్దకు వెళ్ళి నివేదించారు. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇచ్చినా, ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకున్నా అది మహా పాపం. వాంతి చేసుకున్నదాన్ని తినడముతో సమానం.
అపుడు రాజు గారు "ఇది నేను తెలిసి చేసిన పాపం కాదు. దీనికి పరిహారముగా ఒక లక్ష ఆవులు ఇస్తాను" అని అంటే. ఇద్దరు బ్రాహ్మణులూ ఒప్పుకోలేదు. నాకు ఆ ఆవే కావలి అంటే కావాలి అన్నారు.

అనునీతావుభౌ విప్రౌ ధర్మకృచ్ఛ్రగతేన వై
గవాం లక్షం ప్రకృష్టానాం దాస్యామ్యేషా ప్రదీయతామ్

భవన్తావనుగృహ్ణీతాం కిఙ్కరస్యావిజానతః
సముద్ధరతం మాం కృచ్ఛ్రాత్పతన్తం నిరయేऽశుచౌ

నాహం ప్రతీచ్ఛే వై రాజన్నిత్యుక్త్వా స్వామ్యపాక్రమత్
నాన్యద్గవామప్యయుతమిచ్ఛామీత్యపరో యయౌ

ఏమి చేయలేక ఊరుకున్నాడు. కొన్నాళ్ళకు ఆయన మరణించి నరకానికి వెళ్ళాడు. యముడు "నీవు చాలా పుణ్యం చేసావు, కొద్ది పాపం చేసావు. పాపాన్ని ముందు అనుభవించు " అన్నాడు. నేను అలాగే అన్నాను. వెంటనే తొండగా వచ్చి పడ్డాను.

ఏతస్మిన్నన్తరే యామైర్దూతైర్నీతో యమక్షయమ్
యమేన పృష్టస్తత్రాహం దేవదేవ జగత్పతే

పూర్వం త్వమశుభం భుఙ్క్ష ఉతాహో నృపతే శుభమ్
నాన్తం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః

పూర్వం దేవాశుభం భుఞ్జ ఇతి ప్రాహ పతేతి సః
తావదద్రాక్షమాత్మానం కృకలాసం పతన్ప్రభో

బ్రహ్మణ్యస్య వదాన్యస్య తవ దాసస్య కేశవ
స్మృతిర్నాద్యాపి విధ్వస్తా భవత్సన్దర్శనార్థినః

నీ అనుగ్రహముతో, నేను తొండగా జన్మించినా నాకు పూర్వ జన్మ స్మృతి అలాగేఉంది. నిన్ను చూడగలిగి నీ స్పర్శను పొందగలిగి నా శాపం నుండి విముక్తి పొందాను

స త్వం కథం మమ విభోऽక్షిపథః పరాత్మా
యోగేశ్వరః శ్రుతిదృశామలహృద్విభావ్యః
సాక్షాదధోక్షజ ఉరువ్యసనాన్ధబుద్ధేః
స్యాన్మేऽనుదృశ్య ఇహ యస్య భవాపవర్గః

మహా యోగేశ్వరుల చెవిలో పడని నీవు నా కంటపడ్డావు

దేవదేవ జగన్నాథ గోవిన్ద పురుషోత్తమ
నారాయణ హృషీకేశ పుణ్యశ్లోకాచ్యుతావ్యయ

అన్ని నామాలు కలిగిన స్తోత్రం ఇది.

అనుజానీహి మాం కృష్ణ యాన్తం దేవగతిం ప్రభో
యత్ర క్వాపి సతశ్చేతో భూయాన్మే త్వత్పదాస్పదమ్

స్వామి నీ కృపతో శాప విమోచనం అయ్యింది. ఇంక నేను వెళతాను అనుమతి ఇవ్వు. ఇప్పటినుంచీ నేను ఎక్కడ ఉన్నా మనసు నీ యందే ఉండాలి

నమస్తే సర్వభావాయ బ్రహ్మణేऽనన్తశక్తయే
కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః

నీవే వాసుదేవుడవు, కృష్ణుడవు సకల యోగ పతివి

ఇత్యుక్త్వా తం పరిక్రమ్య పాదౌ స్పృష్ట్వా స్వమౌలినా
అనుజ్ఞాతో విమానాగ్ర్యమారుహత్పశ్యతాం నృణామ్

అలా అని నమసక్రించి, ప్రదక్షిణం చేసి , పాదాలను స్పృశించి విమానాన్ని అధిరోహించి అక్కడి వారందరూ చూస్తుండగా ఈ నృగుడు వెళ్ళిపోయాడు

కృష్ణః పరిజనం ప్రాహ భగవాన్దేవకీసుతః
బ్రహ్మణ్యదేవో ధర్మాత్మా రాజన్యాననుశిక్షయన్

నృగుడు వెళ్ళిపోయిన తరువాత అక్కడ చేరిన వారందరికీ కృష్ణ పరమాత్మ (రాబోయే కలి యుగాన్ని దృష్టిలో పెట్టుకుని) ఈ విధముగా ఉపదేశించాడు
బ్రాహ్మణులంటే ప్రీతిగల పరమాత్మ రాజులందరికీ పాఠం చెప్పదలచి ఈ విధముగా అన్నాడు

దుర్జరం బత బ్రహ్మస్వం భుక్తమగ్నేర్మనాగపి
తేజీయసోऽపి కిముత రాజ్ఞాం ఈశ్వరమానినామ్

బ్రాహ్మణ ధనం భుజిస్తే అరగదు. అగ్నిలో పడేసినా అరగదు.
మహా తేజస్సు కలవాడుకూడా  బ్రాహ్మణ ధనాన్ని అరిగించుకోఈఏడు. సామాన్యుల సంగతి వేరే చెప్పాలా

నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియా
బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిధిర్భువి

హాలా హలానికి కూడా మందు ఉంది. విరుగుడు ఉంది. బ్రాహ్మణ ధనం అపహరిస్తే దానికి ప్రతీకారంలేదు. విషం తిన్నవారినే చంపుతుంది. అగ్ని నీరు చల్లితే చల్లారుతుంది

హినస్తి విషమత్తారం వహ్నిరద్భిః ప్రశామ్యతి
కులం సమూలం దహతి బ్రహ్మస్వారణిపావకః

బ్రహ్మత్వం నుండి పుట్టిన అగ్ని మొత్తం కులాన్నే దహించివేస్తుంది.

బ్రహ్మస్వం దురనుజ్ఞాతం భుక్తం హన్తి త్రిపూరుషమ్
ప్రసహ్య తు బలాద్భుక్తం దశ పూర్వాన్దశాపరాన్

తెలియకుండా చేస్తేనే మూడు పురుషార్థాలనూ నశింపచేస్తుంది
తెలిసి బలవంతముగా అపహరిస్తే పది ముందూ, పది తరువాత తరాలనూ, 21 తరాలను బాధిస్తుంది

రాజానో రాజలక్ష్మ్యాన్ధా నాత్మపాతం విచక్షతే
నిరయం యేऽభిమన్యన్తే బ్రహ్మస్వం సాధు బాలిశాః

రాజ్య సంపదతో గుడ్డివారై రాజులు తమ పతనాన్ని తాము తెచ్చుకోవద్దు

గృహ్ణన్తి యావతః పాంశూన్క్రన్దతామశ్రుబిన్దవః
విప్రాణాం హృతవృత్తీనామ్వదాన్యానాం కుటుమ్బినామ్

అజ్ఞ్యానులారా బ్రహ్మత్వాన్ని మించిన అగ్ని వంటి అగ్ని లేదు.దాని వలన వచ్చేంత నరకం ఇంకొకటి లేదు.
బ్రాహ్మణులు ఏడిస్తే, వారి వృత్తిని లాక్కుంటే, అతని కన్నీటి చుక్కలు భూమి మీద ఎన్ని రేణువులను ఆక్రమించాయో, అన్ని సంవత్సరాలు కుంభీపాక నరకములో ఉంటారు.

రాజానో రాజకుల్యాశ్చ తావతోऽబ్దాన్నిరఙ్కుశాః
కుమ్భీపాకేషు పచ్యన్తే బ్రహ్మదాయాపహారిణః

స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేచ్చ యః
షష్టివర్షసహస్రాణి విష్ఠాయాం జాయతే కృమిః

తాను ఇచ్చినది కానీ ఇతరులు ఇచ్చిన దాన్ని కానీ బ్రాహ్మణ వృత్తిని హరించినట్లైతే అరవై వేల సంవత్సరాలు మలములో ఉండే పురుగుగా పుడతారు

న మే బ్రహ్మధనం భూయాద్యద్గృధ్వాల్పాయుషో నరాః
పరాజితాశ్చ్యుతా రాజ్యాద్భవన్త్యుద్వేజినోऽహయః

నేను కూడా బ్రహ్మ ధనం కావాలని కోరుకోవడం లేదు. దాన్ని భుజించి మానవులు అల్పాయుష్యులవుతారు
ఎదుటివారిని భయపెట్టే పాములుగా పుడతారు

విప్రం కృతాగసమపి నైవ ద్రుహ్యత మామకాః
ఘ్నన్తం బహు శపన్తం వా నమస్కురుత నిత్యశః

నా బంధువులారా పొరబాటున బ్రాహ్మణుడు ఏదైనా అపచారం చేసినా మీరు వారికి ద్రోహం చేయప్రయత్నించకండి. వారు తిట్టినా కొట్టినా అధిక్షేపించినా, అలాంటివారికి నమస్కారం చేసి వెళ్ళిపొండి కాని ప్రతి క్రియ చేయకండి.

యథాహం ప్రణమే విప్రాననుకాలం సమాహితః
తథా నమత యూయం చ యోऽన్యథా మే స దణ్డభాక్

నన్ను చూసి నేర్చుకోండి. నేను ప్రతీ  దినం బ్రాహ్మణోత్తములకు నమస్కరిస్తాను.
దీనికి వ్యతిరేకముగా ఆచరిస్తే అలాంటి వారు దండాన్ని అనుభవిస్తారు. నేనేవారిని శిక్షిస్తాను

బ్రాహ్మణార్థో హ్యపహృతో హర్తారం పాతయత్యధః
అజానన్తమపి హ్యేనం నృగం బ్రాహ్మణగౌరివ

బ్రాహ్మణ ధనం అపహరించబడితే, అపహరించిన వాడిని పతనం చేస్తుంది. తెలియకుండా హరించినా పతనం చేస్తుంది. ఇపుడు మీరు చూసినదే దుష్టాంతం
నావలన బ్రాహ్మణ ధనాపహరం జరగకుండా ఉండాలని పరమాత్మని ప్రార్థిస్తూ తన జీవితాన్ని గడిపినవాడు ఉత్తముడు

ఏవం విశ్రావ్య భగవాన్ముకున్దో ద్వారకౌకసః
పావనః సర్వలోకానాం వివేశ నిజమన్దిరమ్

ఇలా స్వామి వివరించి బోధించి, తన లోకములకు పవిత్రమైన స్వామి తన ఇంటికి వెళ్ళిపోయాడు.


               సర్వం శ్రీకృష్ణార్పణంస్తు
                                    

Popular Posts