Followers

Tuesday 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం


శ్రీరాజోవాచ
మన్వన్తరేషు భగవన్యథా మన్వాదయస్త్విమే
యస్మిన్కర్మణి యే యేన నియుక్తాస్తద్వదస్వ మే

పరమాత్మ ఏ ఏ అవతారాలు ధరించే ఏ ఏ పనులు చేసాడు.   

శ్రీఋషిరువాచ
మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే
ఇన్ద్రాః సురగణాశ్చైవ సర్వే పురుషశాసనాః

అందరూ భగవంతుని ఆజ్ఞ్యను పాటించేవారే. మనువులూ మను పుత్రులూ సప్తఋషులూ ఇంద్రులూ దేవతలూ. పరమాత్మ ఆజ్ఞ్యకు బద్ధులే. 

యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృప
మన్వాదయో జగద్యాత్రాం నయన్త్యాభిః ప్రచోదితాః

వారాచరించే పనులు (యజ్ఞ్య యాగాదులు) కూడా ఆయన పనులే. ఇలాంటి పరమాత్మ కళలతో శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తారు. 

చతుర్యుగాన్తే కాలేన గ్రస్తాన్ఛ్రుతిగణాన్యథా
తపసా ఋషయోऽపశ్యన్యతో ధర్మః సనాతనః

నాలుగు యుగాలు కాగానే వేదాలన్నీ అంతర్ధానం చెందుతాయి. వాటిని సప్తఋషులు సాక్షాత్కరింపచేసుకుంటారు. 

తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః
యుక్తాః సఞ్చారయన్త్యద్ధా స్వే స్వే కాలే మహీం నృప

ధర్మం వేదములనుండే ప్రవర్తింపబడుతుంది. వేదముల నుండి వచ్చే ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడుపుతారు 

పాలయన్తి ప్రజాపాలా యావదన్తం విభాగశః
యజ్ఞభాగభుజో దేవా యే చ తత్రాన్వితాశ్చ తైః

ఆయా వారి వారి కాలం అంతమయ్యే వరకూ వీరు ప్రజలను పరిపాలిస్తారు. దేవతలు ఇలాంటి రాజ్లూ ప్రజలూ ఇచ్చే యజ్ఞ్య భాగాలను తీసుకుంటారు. ఇలా ప్రజలాచరించే యజ్ఞ్యఫలితాన్నీ పరమాత్మ అనుగ్రహముతో వచ్చిన త్రైలోక్య రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ పాలిస్తాడు.

ఇన్ద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితామ్
భుఞ్జానః పాతి లోకాంస్త్రీన్కామం లోకే ప్రవర్షతి

ప్రజలాచరించే యజ్ఞ్య ఫలితం తీసుకుని ఇంద్రుడు వర్షాన్ని ఇస్తాడు. మనువు ధర్మాన్ని పరిపాలిస్తాడు. ఋషులు వేదాన్ని మళ్ళ్ళీ తెస్తారు. అవతరించిన పరమాత్మ తత్వబోధను అందరికీ బోధిస్తాడు ఋషిరూపం ధరించి. యోగమూ కర్మా జ్ఞ్యానం బోధిస్తాడు
ప్రజాపతి రూపములో సృష్టి చేస్తాడు. సామ్రాట్టు గాబట్టి దుర్మార్గులని శిక్షిస్తాడు. కాల రూపములో అందరినీ ఆదరిస్తాడు. వేరు వేరు గుణాలను ఆయాపనులకు అనుగుణముగా స్వీకరిస్తాడు.
ఆయా పేర్లతో నామాలతో ఉన్న పరమాత్మను అందరూ ఆరాధిస్తారు. 

జ్ఞానం చానుయుగం బ్రూతే హరిః సిద్ధస్వరూపధృక్
ఋషిరూపధరః కర్మ యోగం యోగేశరూపధృక్

సర్గం ప్రజేశరూపేణ దస్యూన్హన్యాత్స్వరాడ్వపుః
కాలరూపేణ సర్వేషామభావాయ పృథగ్గుణః

స్తూయమానో జనైరేభిర్మాయయా నామరూపయా
విమోహితాత్మభిర్నానా దర్శనైర్న చ దృశ్యతే


పరమాత్మ మాయతో మోహించబడి నానాదర్శనాలతో  పరమాత్మ కనపడక ఆయన మాయ కనపడుతుంది. కర్మే ఫలితం ఇస్తుంది అని అంటారు కొందరు, పరమాణువే జగత్తు అంటారు కొందరు. 
నీవడిగిన ప్రశ్నకు ఇది సమాధానం.కల్పమంటే వికల్పమంటే ఇది ప్రమాణం. 

ఏతత్కల్పవికల్పస్య ప్రమాణం పరికీర్తితమ్
యత్ర మన్వన్తరాణ్యాహుశ్చతుర్దశ పురావిదః

ప్రాచీన జ్ఞ్యానం కలవారు  ఈకల్పములో పధ్నాలుగు మంది మనువులు ఉంటారు అని చెబుతారు

Popular Posts