Followers

Thursday 20 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం


రాజోవాచ
యదేతద్భగవత ఆదిత్యస్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనామభిముఖం
ప్రచలితం చాప్రదక్షిణం భగవతోపవర్ణితమముష్య వయం కథమనుమిమీమహీతి

ఈ సూర్యభగవానుడు మేరువునూ ద్రువ మండలాన్నీ ప్రదక్షిణం చేస్తున్నాడనీ, మేరువుకూ ద్రువునకూ ప్రదక్షిణమవుతున్నప్పుడు ఈ భాగములో ఉన్న రాశులకు అప్రదక్షిణమవుతున్నది. దీన్ని ఎలా తెలుసుకోవాలి.ప్రదక్షిణ అప్రదక్షిణల యొక్క వివరాన్ని ఎలా గుర్తించాలి. సూర్యభగవానుడు  ప్రదక్షిణముగా తిరిగితే రాశులన్నీ అప్రదక్షిణముగా ఎలా తిరుగుతాయి

స హోవాచ
యథా కులాలచక్రేణ భ్రమతా సహ భ్రమతాం తదాశ్రయాణాం పిపీలికాదీనాం గతిరన్యైవ
ప్రదేశాన్తరేష్వప్యుపలభ్యమానత్వాదేవం నక్షత్రరాశిభిరుపలక్షితేన కాలచక్రేణ ధ్రువం మేరుం చ
ప్రదక్షిణేన పరిధావతా సహ పరిధావమానానాం తదాశ్రయాణాం సూర్యాదీనాం గ్రహాణాం గతిరన్యైవ
నక్షత్రాన్తరే రాశ్యన్తరే చోపలభ్యమానత్వాత్

కుమ్మర్ చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద ఉన్న చీమలు అదే దిశలో తిరగాలన్న నియమమేమీ లేదు. అలాగే ఇది కూడా. కాల చక్రాన్ని గుర్తించడానికి మనకు రాశులు నక్షత్రాలూ ప్రమాణికం. సూర్యుడు తిరిగేది మాత్రం మేరువు చుట్టూ ధ్రువుని చుట్టూ. మనకి కనపడేవి మాత్రం రాశులూ నక్షత్రాలే కాబట్టి వాటినాధారముగా చేసుకుని కాలగణం చేస్తాం. ఎదురుగా ఉన్నవి నక్షత్రాలూ రాశులూ. సూర్యుడు ఒక సారి అశ్వనిలో ఉంటాడు,  తరువాత భరణిలో ఉంటాడు. ఆయన మారడు. సూర్యుడూ నక్షత్రాలూ తిరుగుతూ ఉండగా అవి ఎక్కడ కలిస్తే అవి కాల మానం. అశ్వనీ భరణీ సూర్యునితో కలిస్తే అది మేషరాశి. కృత్తిక రెండవ పాదముతో కలిస్తే అది మిథున రాశి. 

స ఏష భగవానాదిపురుష ఏవ సాక్షాన్నారాయణో లోకానాం స్వస్తయ ఆత్మానం త్రయీమయం
కర్మ విశుద్ధినిమిత్తం కవిభిరపి చ వేదేన విజిజ్ఞాస్యమానో ద్వాదశధా విభజ్య షట్సు వసన్తాదిష్వృతుషు యథోప
జోషమృతుగుణాన్విదధాతి

ఈ సూర్యభగవానుడే సాక్షాత్ నారాయణుడు. సకల లోక కళ్యానం కొరకు తనను వేద పురుషునిగా కర్మ విశుద్ధి కొరకు ఆయన ఉన్నాడు.పసి పిల్లలను ప్రాతః కాలములో సూర్యభగవానుని ఎదుట ఒక ఘడియపాటు ఎదురుగా పెట్టమని చెబుతారు. పండితులూ జ్ఞ్యానుల చేత వేదముతో కూడా సూర్యభగవానుని స్వరూపం తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

తమేతమిహ పురుషాస్త్రయ్యా విద్యయా వర్ణాశ్రమాచారానుపథా ఉచ్చావచైః
కర్మభిరామ్నాతైర్యోగ
వితానైశ్చ శ్రద్ధయా యజన్తోऽఞ్జసా శ్రేయః సమధిగచ్ఛన్తి

అనుభవించే విధానానికనుగుణముగా ఋతువులను విభాగం చేసారు. ఇక్కడుండే ఋషులందరూ వేద విద్యతో సూర్యభగవానుని వర్ణాశ్రమ ధర్మాలకనుగుణముగా  హెచ్చు తగ్గుల పనులతో యోగముతో శ్రద్ధగా ఆరాధిస్తున్నారు. మనకు ప్రత్యక్షముగా కనపడుతున్న సూర్యభగవానుని మన వర్ణాశ్రమాలకనుగుణముగా ఆరాధిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది. విహిత కర్మలే సూర్యభగవానునికి అరాధన  

అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావాపృథివ్యోరన్తరేణ నభోవలయస్య కాలచక్రగతో ద్వాదశ
మాసాన్భుఙ్క్తే రాశిసంజ్ఞాన్సంవత్సరావయవాన్మాసః పక్షద్వయం దివా నక్తం చేతి సపాదర్క్ష
ద్వయముపదిశన్తి యావతా షష్ఠమంశం భుఞ్జీత స వై ఋతురిత్యుపదిశ్యతే సంవత్సరావయవః

అన్ని లోకాలకూ ఆయనే ఆత్మ. ఆకాశం భూమి మధ్య ఈయన కాల చక్రములో ఉండి సూర్యభగవానుడే పన్నెండు మాసాలను అనుభవిస్తున్నాడు. రాశులూ సంవత్సరానికి అవయవాలు. మాసాలు రాశుల సంజ్యలు. మాసాలు రెండు పక్షాలు.శుక్ల పక్షమంటే తెలుపు (పగలు) కృష్ణ పక్షమంటే నలుపు. ఒక్కో రాశి రెండు నక్షత్రాలూ ఒక పాదం. ఆరవ భాగం అనుభవిస్తే ఋతువు. ఇరవై నాలుగవ భాగమనుభవిస్తే పక్షం. ఇవన్నీ సంవత్సరానికి అవయవములు 

అథ చ యావతార్ధేన నభోవీథ్యాం ప్రచరతి తం కాలమయనమాచక్షతే

సూర్యుడు ఆకాశములో సగభాగం దాటితే అయనం. అందులో ఆరవ భాగం ఋతువు, పన్నెండవ భాగం మాసం, ఇరవై నాలుగవ భాగం పక్షం. సూర్య రథం ఏ భాగాన్ని అతిక్రమిస్తోందో అదే కాలం 

అథ చ యావన్నభోమణ్డలం సహ ద్యావాపృథివ్యోర్మణ్డలాభ్యాం కార్త్స్న్యేన స హ భుఞ్జీత తం
కాలం సంవత్సరం పరివత్సరమిడావత్సరమనువత్సరం వత్సరమితి భానోర్మాన్ద్యశైఘ్ర్యసమ
గతిభిః సమామనన్తి

భూమ్యాకాశాల మధ్య ఉండే రాశి చక్రమంతా తిరిగితే సంవత్సరం. సూర్యుని గమనముతో కలిసి తిరిగే నక్షత్రం రాశి మొదలైన వాటితో కలిసి సంవత్సరం పేర్లు మారతాయి. సూర్యుడు బాగా వేగముగా ఉంటే సంవత్సరం,కొంచెం తగ్గితే పరివత్సరం, ఇంకొంచెం తగ్గితే  ఇలావత్సరం, మరికాస్త తగ్గితే విద్వత్సరం, మధ్యభాగములో ఉంటే వత్సరం. సూర్యుడు చాలల వేగముగా ఉన్నపుడు నక్షత్రాలను తొందరగా దాటుతాడు. నక్షత్ర మానములో నెలకు ఇరవై ఏడు రోజులే అవుతాయి.మరి ఇరవై ఏడు రోజుల నెలకూ ముప్పై రోజుల నెలకూ తేడా ఏమిటి? సూర్యుడు వేగముగా ఉన్నప్పుడు ఇరవై ఏడుకు వస్తాడు, ఇది నక్షత్ర మానం. మెల్లగ వేళితే ముప్పైకి వస్తుంది, ఇది రాశి మానం. మరికాస్త వేగముగా వెళితే ఇరవై తొమ్మిది రోజుల నెల ఉంటుంది, ఈ ముప్పై ఇరవై తొమ్మిదీ ముప్పై ఒకటిని కలుపుకోవడం బట్టే తిథులను గణిస్తాము. ఒకే రోజు రెండు తిథులూ, ఒకే తిథి రెండు రోజులూ వస్తాయి. జ్యోతిష్య శాస్త్రములో తితులను సూర్య రథ చక్ర నేమి ఏ తిథి నక్షత్రం దగ్గరకు వచ్చిందో లెక్క కట్టి చెబితే ఆ సమయములో తిథి నక్షత్రం చెప్పగలము. రథ నేమీ నక్షత్ర నేమి తిథి నేమి రాశి నేమి కరణ యోగముల నేమి ఒకే దగ్గరకు వస్తాయో అది వర్జ్యం. రాశికి మొదటి భాగం నక్షత్రానికి మధ్యభాగం తిథికి మూడవ భాగం కరణ యోగాలకు నాలగవ భాగం, వీటిని లెక్కించి దాన్ని కలుపుకొని అది ఎన్ని విఘడియలో లెక్కపెట్టి ఆ భాగాన్ని వర్జ్యం అంటారు. నక్షత్ర భుక్తి తిథి బుక్తి  రాశి బుక్తి కలిపి దాన్ని కలిపి తొమ్మిదవ భాగముతో భాగించి వచ్చిన దాన్ని మూడుతో హెచ్చవేసి రెండు తీసేస్తే వచ్చింది వర్జ్యం
 కాలములో ఏ చిన్న దాన్ని గుర్తించినా సూర్యునితోనే. అమృత ఘడియలను దాటి విషఘడియలకు పోతుంటే దుర్ముహూర్తం 
రాహు కాలం అనేది రాశిని బట్టి గుర్తించాలి. అది సౌరమానాన్ని బట్టి ఉంటుంది. చంద్రమానం పాటించేవారు వర్జ్యాన్ని చూస్తారు 

ఏవం చన్ద్రమా అర్కగభస్తిభ్య ఉపరిష్టాల్లక్షయోజనత ఉపలభ్యమానోऽర్కస్య సంవత్సర
భుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్షభుక్తిమగ్రచారీ ద్రుతతరగమనో
భుఙ్క్తే

సూయ్రభగవానుని కిరణాల కంటే లక్ష యోజనాల పైన ఉన్నాడు చంద్రుడు. సూర్యుడు ఒక సంవత్సరములో తిరిగే భాగాన్ని చంద్రుడు ఒక పక్షములో తిరుగుతాడు. సూర్యుడు ఒక నెలలో తిరిగే దాన్ని చంద్రుడు ఒక రోజులో తిరుగుతాడు. సూర్యుని కన్నా ముందర ఉంటాడు. చాలా వేగముగా వెళతాడు 

అథ చాపూర్యమాణాభిశ్చ కలాభిరమరాణాం క్షీయమాణాభిశ్చ కలాభిః పిత్ణామహోరాత్రాణి
పూర్వ
పక్షాపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవనివహప్రాణో జీవశ్చైకమేకం నక్షత్రం త్రింశతా
ముహూర్తైర్భుఙ్క్తే

నిండుగా ఉన్న కళలతో దేవతలకూ క్షీణించే కళలతో పితృదేవతలకూ భోజనం పెడతాడు.  శుక్ల పక్షం దేవతలకూ కృష్ణ పక్షం పితృదేవతలకూ. పగలూ రాత్రి శుక్ల కృష్ణ పక్షమని ఉంటుంది. సకల జీవులకూ ఈయన ప్రాణం. చంద్రుడు ఒక్కో నక్షత్రాన్ని ముప్పై ముహూర్తాలని ఒక్క రోజులో తిరుగుతాడు, పదహారు కళలతో ఉంటాడు

య ఏష షోడశకలః పురుషో భగవాన్మనోమయోऽన్నమయోऽమృతమయో
దేవపితృమనుష్యభూతపశు
పక్షిసరీసృపవీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్సర్వమయ ఇతి వర్ణయన్తి

అందరికీ భోజనం పెట్టి బతికించేవాడు, మనుష్యులకు అన్నం, దేవతలకు అమృతం, మనః స్వరూపముతో పితృదేవతలకు. చంద్రుడు మనో మయుడు కాబట్టి, మనో మయ రూపములో పితృదేవతలకు ఆరాధిస్తున్నాడు కాబట్టి దాన్ని శ్రాద్ధం అంటాం.  శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసేది. ఏకాగ్రముగా ఉండే మనసుతో చేస్తే అది శ్రాద్ధం. అలా చేస్తే మనో రూపములో ఉన్న చంద్రుడు తీసుకుంటాడు. అందరి ప్రాణాలనూ తృప్తి పరుస్తాడు. 

తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనతో నక్షత్రాణి మేరుం దక్షిణేనైవ కాలాయన ఈశ్వరయోజితాని
సహాభిజితాష్టావింశతిః

చంద్రునికి ఇంకా పైన నక్షత్రాలుంటాయి.నక్షత్రాలన్ని మేరువుకు దక్షిణ దిక్కులో సంచరిస్తూ ఉంటాయి. పరమాత్మే అక్కడ నక్షత్రాలను ఉంచాడు. అభిజిత్ తో కలిసి ఇరవై ఎనిమిది నక్షత్రాలు. నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాలలో ఉండేవాడు శుక్రుడు. సూర్యునికి ముందర సంచరిస్తే పులస్ శుక్ర దోషం.
అపుడు సూర్యుని కంటే ముందు ఉంటాడు. అప్పుడు సూర్య ప్రభావం కంటే శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. శుక్రుడు రాక్షసుల గురువు. పశ్చాత్ శుక్ర దోషమంటే సూర్యుని కంటే వెనక ఉంటాడు. సూర్యునితో సమానముగా శుక్రుడు ఉంటే అది మూఢం. సూర్యకాంతిలో శుక్రుడు కనపడడు, అది మూఢం.  సూర్యునికి శుక్రుడు వెనకభాగములో ఉన్నప్పుడే వివాహం చేయాలి. సర్వదా శుక్రుడు లోకాలకు అనుకూలుడు. వర్షాలను కురిపించేవాడు శుక్రుడు. వర్షాధిపతి శుక్రుడు. అందుకే విరాట పర్వం పారాయణతో వర్షాలు పడతాయి. విరాట పర్వములో గోగ్రహణం ఉంది. గోవులకు శుక్రుడు అధిపతి. అందుకే విరాట పర్వములో గోవులను కాపాడిన పాండవులకు మేలు జరిగింది. వృష్టికున్న విఘ్నాన్ని పోగొడతాడు శుక్రుడు. కానీ శుక్రుడు సూర్యునికి వెనక ఉండాలి. 

తత ఉపరిష్టాదుశనా ద్విలక్షయోజనత ఉపలభ్యతే పురతః పశ్చాత్సహైవ వార్కస్య శైఘ్ర్య
మాన్ద్యసామ్యాభిర్గతిభిరర్కవచ్చరతి లోకానాం నిత్యదానుకూల ఏవ ప్రాయేణ వర్షయంశ్చారేణానుమీయతే స
వృష్టివిష్టమ్భగ్రహోపశమనః

శుక్రుని కంటే రెండు లక్షల యోజనాల దూరములో చంద్రుని కుమారుడు బుధుడు ఉంటాడు. బుధుడు శుభమును కలిగిస్తాడు. సూర్యునికంటే చాలా దూరములో ఉంటే ఉత్పాతములు కలుగుతాయి. సూర్యునికి బుధుడు దగ్గరగా ఉండాలి. మబ్బులు ఎక్కువగా ఉండి కూడా వర్షం పడలేదంటే బుధుడు వ్యతిరేకముగా (సూర్యునికి దూరముగా) ఉన్నాడు. అంతకన్నా దూరముగా అంగారకుడు ఉంటాడు. సూర్యుడు ఏడాదిలో తిర్గేది ఈయన వక్రగతి లేకుంటే ఒక్కో రాశిని నలభై ఐదు రోజులలో తిరుగుతాడు. ఈయన ఋణ కారకుడు. సరి అయిన స్థానములో లేని అంగారకుడు అప్పు చేయిస్తాడు. 

ఉశనసా బుధో వ్యాఖ్యాతస్తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనతో బుధః సోమసుత ఉపలభ్యమానః
ప్రాయేణ శుభకృద్యదార్కాద్వ్యతిరిచ్యేత తదాతివాతాభ్రప్రాయానావృష్ట్యాదిభయమాశంసతే

హనుమంతుడు అంగారకునికి శాంతి కారకుడు. కుజ దోషమున్నప్పుడు అందుకే సుందరకాండ పారాయణ చేయాలి. 

అత ఊర్ధ్వమఙ్గారకోऽపి యోజనలక్షద్వితయ ఉపలభ్యమానస్త్రిభిస్త్రిభిః పక్షైరేకైకశో
రాశీన్ద్వాదశానుభుఙ్క్తే యది న వక్రేణాభివర్తతే ప్రాయేణాశుభగ్రహోऽఘశంసః

తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనాన్తరగతా భగవాన్బృహస్పతిరేకైకస్మిన్రాశౌ పరివత్సరం
పరివత్సరం చరతి యది న వక్రః స్యాత్ప్రాయేణానుకూలో బ్రాహ్మణకులస్య

ఈయన మీద రెండు లక్షల యోజనాలలో బృహస్పతి. పరివత్సరం పాటు తిరుగుతాడు (సూర్యుని మాంద్యము - పరివత్సరం, 366 రోజులు) . వంకరగా వెళ్ళకుంటే ఈయన బ్రాహ్మణులకు అనుకూలం

తత ఉపరిష్టాద్యోజనలక్షద్వయాత్ప్రతీయమానః శనైశ్చర ఏకైకస్మిన్రాశౌ
త్రింశన్మాసాన్విలమ్బమానః సర్వానేవానుపర్యేతి తావద్భిరనువత్సరైః ప్రాయేణ హి సర్వేషామశాన్తికరః

ఈయనకన్న పైన శని. ఈయన ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలుంటాడు. చాలా మెల్లగా వెళతాడు. ఈయన అశాంతిని కలిగిస్తాడు

తత ఉత్తరస్మాదృషయ ఏకాదశలక్షయోజనాన్తర ఉపలభ్యన్తే య ఏవ లోకానాం
శమనుభావయన్తో
భగవతో విష్ణోర్యత్పరమం పదం ప్రదక్షిణం ప్రక్రమన్తి

దీని తరువత ఇంకా పైన ఋషుల లోకముంటుంది. సకల లోకాల మంగళాన్ని ఆశిస్తూ ద్రువమండలం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు

Popular Posts