Followers

Thursday 20 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైయొకటవ అధ్యాయం



అనారోగ్యముగా ఉండేవారు ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అన్ని జబ్బులూ పోతాయి.

శ్రీశుక ఉవాచ
ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణలక్షణతో వ్యాఖ్యాతః

భూమండలం గురించి నీకు చెప్పాను.

ఏతేన హి దివో మణ్డలమానం తద్విద ఉపదిశన్తి యథా ద్విదలయోర్నిష్పావాదీనాం తే
అన్తరేణాన్తరిక్షం తదుభయసన్ధితమ్

భూమండలం గురించి తెలిస్తే ఆకాశ మండలం కూడా సులభముగా తెలుసుతుంది. ఒక పప్పును రెండు భాగాలుగా చేస్తే ఒక భాగం కొలత తెలిస్తే రెండవ భాగం కొలత చెప్పకర్లేదు.

యన్మధ్యగతో భగవాంస్తపతాం పతిస్తపన ఆతపేన త్రిలోకీం ప్రతపత్యవభాసయత్యాత్మ
భాసా స ఏష ఉదగయనదక్షిణాయనవైషువతసంజ్ఞాభిర్మాన్ద్యశైఘ్ర్య
సమానాభిర్గతిభిరారోహణావరోహణసమానస్థానేషు యథాసవనమభిపద్యమానో మకరాదిషు
రాశిష్వహోరాత్రాణి దీర్ఘహ్రస్వసమానాని విధత్తే

రెండు పప్పు భాగాల మధ్యలో సూర్యుడు ఉన్నాడు. ద్యౌ అంటే పై పప్పు, భూమి కింద పప్పు. వీటి మధ్య సూర్యుడున్నాడు. ఈయన తన ఎండతో మూడు లోకాలను తపింపచేస్తాడు. తన కాంతితో మూడు లోకాలనూ ప్రకాశింపచేస్తాడు. సూర్యుడు ఉత్తరాయణ (మకర సంక్రమణం) దక్షిణాయన(కర్కాటక సంక్రమణం) విషువ (మేష తుల సంక్రమణం). సూర్య భగవానుని గమనం బట్టే కాలాన్ని నిర్ణ్యైస్తున్నాము. భూమధ్య భాగానికి దక్షిణ భాగాన్నికి సూర్యుడు వస్తే దక్షిణాయణం. మన కిటీలోంచి వెలుతురు ఏ దిక్కులోంచి వస్తే ఆ ఆయనం. కర్కాటకం వస్తే దక్షిణాయనం. కర్కాటకం నుంచీ మకరం వరకూ దక్షిణ, మకరములోకి రాగానే ఉత్తరాయణం. సగ భాగానికి వచ్చేది ఆయనం. నాలుగవ భాగానికి వచ్చేది విశువ. ఉత్తరాయణ కాలములో సూర్యుడు మెల్లగా నడుస్తాడు. దక్షిణాయనములో వేగముగా నడుస్తాడు. మేష తులా సంక్రమణములో (విశువ) సమానముగా ఉంటాడు. ఒక సమయములో ఎత్తులో ఒక సమయములో కిందిభాగములో ఉంటాడు.

(శ్లో|| తులాయ జాయతే శీతం, వృశ్చికేషు ప్రవర్ధతే

ధనురే ధనురాకారే, మకరే కుండలాకృతిం

కుంభం శీతం -శీతం వా, మీనే శీతవారణం||

అంటే తులరాశిలో సూర్యుడు సంచరించినప్పుడు చలి పుడుతుంది. వృశ్చికరాశిలో సూర్యుడు సంచరించినప్పుడు చలి పెరుగుతుంది. ధనుస్సులో చలికి మానవుడు విల్లు వంగినట్లుగా అర్ధచంద్రాకారంలా అయిపోతాడు. మకరంలో చలికి తట్టుకోలేక గొంగళిపురుగులా కంబళి కప్పుకు పడుకుంటాడు. కుంభరాశిలో చలి ఉందా లేదా అన్నట్లుండి, సూర్యుడు మీనరాశిలో సంచరించినప్పుడు చలి వారితమవుతుంది.)

యదా మేషతులయోర్వర్తతే తదాహోరాత్రాణి సమానాని భవన్తి యదా వృషభాదిషు పఞ్చసు చ
రాశిషు
చరతి తదాహాన్యేవ వర్ధన్తే హ్రసతి చ మాసి మాస్యేకైకా ఘటికా రాత్రిషు

మేషములో తులలో ఉన్నప్పుడు పగలూ రాత్రీ సమానముగా ఉంటాయి. వృషభం నుంచీ ఐదు రాశులలో పగలు పెరుగుతాయి. ఒక్కొక్క నెలకూ ఒక్కొక్క ఘడియ రాత్రులలో తరుగుతుంది. వృశ్చికం నుంచి ఐదు రాశులలో దీనికి విపర్యయముగా ఉంటుంది. దక్షిణాయనములో పగల్లూ ఉత్తరాయణములో రాత్రులూ తగ్గుతాయి.

యదా వృశ్చికాదిషు పఞ్చసు వర్తతే తదాహోరాత్రాణి విపర్యయాణి భవన్తి

యావద్దక్షిణాయనమహాని వర్ధన్తే యావదుదగయనం రాత్రయః

ఏవం నవ కోటయ ఏకపఞ్చాశల్లక్షాణి యోజనానాం మానసోత్తరగిరిపరివర్తనస్యోపదిశన్తి
తస్మిన్నైన్ద్రీం పురీం పూర్వస్మాన్మేరోర్దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ
పశ్చాద్వారుణీం నిమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయమధ్యాహ్నాస్తమయ
నిశీథానీతి భూతానాం ప్రవృత్తినివృత్తినిమిత్తాని సమయవిశేషేణ మేరోశ్చతుర్దిశమ్

సూర్యభగవానుడు ఒక పూటలో తొమ్మిది కోట్ల యాభై యొక్క కోట్ల యోజనాలు తిరుగుతాడు. మానస ఉత్తర గిరి చుట్టూ తిరుగుతాడు. అక్కడ ఇంద్రుని పురముంటుంది. మేరువు కంటే తూర్పు దిక్కులో ఉంటుంది. దాని పేరు దేవధాని. తూర్పు దిక్కున యమ నగరం సమ్యమని, పశ్చిమాన నిమ్నోచని అని వరుణ నగరం, ఉత్తరములో చంద్రుని నగరం విభావరి. ఈ ప్రాంతాలలో సూర్యుడు సంచరిస్తున్నపుడు సూర్యోదయమని అస్తమయమనీ అంటున్నాము. ఉదయము కాగానే ప్రాణులన్నీ ప్రవృత్తిలోకి దిగుతాయి. అస్తమయం కాగానే నివృత్తి.  మేరువు యొక్క నాలుగు దిక్కులలో సూర్యభగవానుని సంచారాన్ని బట్టే ప్రాణుల ప్రవృత్తి నివృత్తులు ఆధారపడి ఉన్నాయి.

తత్రత్యానాం దివసమధ్యఙ్గత ఏవ సదాదిత్యస్తపతి సవ్యేనాచలం దక్షిణేన కరోతి

ఆయన ఏ భాగానికి వస్తే దాని వెనక భాగం దిక్కు మారుతుంది.

యత్రోదేతి తస్య హ సమానసూత్రనిపాతే నిమ్లోచతి యత్ర క్వచన స్యన్దేనాభితపతి తస్య హైష
సమాన
సూత్రనిపాతే ప్రస్వాపయతి తత్ర గతం న పశ్యన్తి యే తం సమనుపశ్యేరన్

సూర్యుడు ఏ ప్రాంతములో ఉదయిస్తున్నాడో ఆ ప్రాంతములో దారము పట్టి కొలిస్తే ఆ ప్రాంతానికి వ్యతిరేక దిశలో అస్తమిస్తాడు. మనకు ఋతువులు మారినప్పుడు అప్పుడప్పుడు పక్కకి జరుగుతాడు. ఎంత భాగములో ఏ దిక్కులో ఉదయించాడో అంత భాగం ఆ వ్యతిరేక దిక్కులో అస్తమిస్తాడు. మహానుభావులు ఎక్కడ అస్తమిస్తాడో ఎవరూ చూడలేరు.

యదా చైన్ద్ర్యాః పుర్యాః ప్రచలతే పఞ్చదశఘటికాభిర్యామ్యాం సపాదకోటిద్వయం యోజనానాం
సార్ధద్వాదశలక్షాణి సాధికాని చోపయాతి

సూర్యభగవానుడు తూర్పు దిక్కు ఇంద్రుని నగరానికి వెళ్ళినప్పుడు పదిహేను ఘడియల్లో రెండుకోట్ల ఇరవైఐదు లక్షల యోజనాలు ప్రయాణిస్తాడు. అందులో సగం పన్నెండు లక్షల యాభై వేలు యోజనాలు. రెండూ కలిపితే దక్షిణ భాగములో ఉన్నప్పుడు సూర్యుడు దాటిన దూరము

ఏవం తతో వారుణీం సౌమ్యామైన్ద్రీం చ పునస్తథాన్యే చ గ్రహాః సోమాదయో నక్షత్రైః సహ జ్యోతిశ్
చక్రే సమభ్యుద్యన్తి సహ వా నిమ్లోచన్తి

రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై వేల యోజనాలు ఒక్కో దిక్కూ ఉన్నప్పుడు ఆయన సంచరిస్తాడు. అది పదిహేను ఘడియలు. నాలుగు దిక్కులు అంటే అరవై ఘడియలు. తొమ్మిది కోట్ల యాభై లక్షల యోజనాలను అరవై ఘడియల్లో సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడు ఏ ఏ దిక్కులలో సంచరించి ఉదయించి అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆయా సమయములలో మిగతా గ్రహాలు ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి.

ఏవం ముహూర్తేన చతుస్త్రింశల్లక్షయోజనాన్యష్టశతాధికాని సౌరో రథస్త్రయీమయోऽసౌ చతసృషు
పరివర్తతే పురీషు

ఒక ముహూర్త కాలములో (ముప్పై ముహూర్తాలకు ఒక రోజు; ఒక ముహూర్తం రెండు ఘడియలు) ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ఒక ముహూర్త కాలములో సూర్యుని రథం సంచరిస్తుంది. సూర్యుని రథం వేద మయం. రెండుకోట్ల ముప్పై ఏడు లక్షల యోజనాలు పదిహేను ఘడియలలో తిరుగుతాడు.

యస్యైకం చక్రం ద్వాదశారం షణ్నేమి త్రిణాభి సంవత్సరాత్మకం సమామనన్తి తస్యాక్షో
మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే కృతేతరభాగో యత్ర ప్రోతం రవిరథచక్రం తైలయన్త్ర
చక్రవద్భ్రమన్మానసోత్తరగిరౌ పరిభ్రమతి

సూర్యుని రథ చక్రానికి పన్నెండు ఆకులుంటాయి. ఆరు నేములు (అంచులు ఉంటాయి), మూడు ఇరుసులు ఉంటాయి. రథ చక్రాన్ని బట్టే సంవత్సరాన్ని గురించి చెబుతాము. దాని అక్ష  భాగం (ఇరుసు) మేరు పైభాగములో ఉంటుంది. కుమ్మరి కుండ చేస్తే ఎలా తిరుగుతుందో సూర్యుని రథ చక్రం అలా తిరుగుతుంది. సూర్యుని రథ చక్రం తిరిగేసరికి ఒక సంవత్సరం అవుతుంది. తైలయన్త్ర - ఒక గానుగలాగ చక్రం తిరుగుతుంది. కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు, గుండ్రముగా తిరుగుతాడు గానీ ముందుకు వెళ్ళడు. ఆయన ఎంత తిరిగినా మేరు పర్వతం మానసోత్తరం చుట్టుకొలత దాటి వెళ్ళడు

తస్మిన్నక్షే కృతమూలో ద్వితీయోऽక్షస్తుర్యమానేన సమ్మితస్తైలయన్త్రాక్షవద్ధ్రువే కృతోపరి
భాగః

ఆ ఇరుసు యొక్క పైభాగం ధ్రువమండల, కింది భాగం మేరు పర్వతం, దాని అవతల భాగం మానసోత్తరం.

రథనీడస్తు షట్త్రింశల్లక్షయోజనాయతస్తత్తురీయభాగవిశాలస్తావాన్రవిరథయుగో యత్ర
హయాశ్ఛన్దోనామానః సప్తారుణయోజితా వహన్తి దేవమాదిత్యమ్

ఆ రథం యొక్క చాయ ముప్పై ఆరు లక్షల యోజనాలు ఉంటుంది. అందులో నాలుగవ భాగం వైశాల్యం. ఆ నొగలు వద్ద వేద స్వరూపాలైన గుఱ్ఱాలు ఉంటాయి. అరుణుడనే సారధితో కలిసి ఉన్న సూర్యభగవానుని మోస్తుంటారు. సూర్యుని రథ నీడ ముప్పై ఆరు లక్షణాల యోజనాలు కలిగి ఉంటుంది.అందులో నాలుగ భాగం వైశాల్యం నొగలు. ఏడు గుర్రాలు అరుణునిచేత పూంచబడి సూర్యభగవానుని మోయుచున్నాయి 

పురస్తాత్సవితురరుణః పశ్చాచ్చ నియుక్తః సౌత్యే కర్మణి కిలాస్తే

సూర్యభగవానుని ముందూ వెనకా కూడా పూంచబడి సూర్యభగవానుని సారధ్యములో . సూర్యుడు ముందర ఉన్నప్పుడు అరుణుడు సూర్యుని ముందర ఉంటాడు, వెళుతున్నప్పుడు వెనక ఉంటాడు 

తథా వాలిఖిల్యా ఋషయోऽఙ్గుష్ఠపర్వమాత్రాః షష్టిసహస్రాణి పురతః సూర్యం సూక్తవాకాయ
నియుక్తాః
సంస్తువన్తి

సూర్యుని ముందర అరవై వేల మంది వాలఖిల్యులు బొటన వ్రేలి ప్రమాణములో ఉంటారు అరుణ సూక్తాన్ని చేస్తూ ఉంటారు. 

తథాన్యే చ ఋషయో గన్ధర్వాప్సరసో నాగా గ్రామణ్యో యాతుధా

గంధర్వులూ అప్సరసలూ నాగులూ ఋషి గణం దేవతా గణం ఇలా ఒక్కో గణం గంధర్వులూ అప్సరసలూ నాగులూ ఋషి గణం దేవతా గణం ఇలా ఒక్కో గణం 

నా దేవా ఇత్యేకైకశో గణాః సప్త
చతుర్దశ మాసి మాసి భగవన్తం సూర్యమాత్మానం నానానామానం పృథఙ్నానానామానః పృథక్
కర్మభిర్ద్వన్ద్వశ ఉపాసతే

తొమ్మిది కోట్ల యాభై యొక్క లక్షల యోజనాల దూరములో క్షణ కాలములో రెండు వేల యోజనాల రెండు కోసుల దూరాన్ని తిరుగుతాడు 

Popular Posts