Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం తొమ్మిదవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
త ఏవముత్సన్నభయా ఉరుక్రమే కృతావనామాః ప్రయయుస్త్రివిష్టపమ్
సహస్రశీర్షాపి తతో గరుత్మతా మధోర్వనం భృత్యదిదృక్షయా గతః

పరమాత్మ చేత భయము తొలగించబడిన దేవతలు పరమాత్మకు నమస్కరించి స్వర్గానికి వారు వెళ్ళిపోయారు. భగవానుడు కూడా గరుడున్ని అధిరోహించి మధువనానికి వెళ్ళాడు భక్తున్ని చూడాలన్న కోరికతో.

స వై ధియా యోగవిపాకతీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభమ్
తిరోహితం సహసైవోపలక్ష్య బహిఃస్థితం తదవస్థం దదర్శ

ధృవుడు తదేక ధ్యానములో ఉన్నాడు. మనసులో ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నడో అక్కడ అంతర్థానమయ్యాడు. తన హృదయములో ఉన్న స్వామిని ఎదురుగానే చూసాడు

తద్దర్శనేనాగతసాధ్వసః క్షితావవన్దతాఙ్గం వినమయ్య దణ్డవత్
దృగ్భ్యాం ప్రపశ్యన్ప్రపిబన్నివార్భకశ్చుమ్బన్నివాస్యేన భుజైరివాశ్లిషన్

చూడగానే తొట్రుపడి ఒక కర్ర పడినట్లు ఆయన ముందు పడి నమస్కరించాడు. కళ్ళుబాగా తెరిచి స్వామిని తాగేస్తున్నట్లు చూచాడు. నోటితో ముద్దుపెట్టుకున్నట్లుగా భుజములతో కౌగిలించుకున్నట్లుగా

స తం వివక్షన్తమతద్విదం హరిర్జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః
కృతాఞ్జలిం బ్రహ్మమయేన కమ్బునా పస్పర్శ బాలం కృపయా కపోలే

స్వామి ఎదురుగా ఉన్నాడు. ఎదో చెప్పాలి. స్తోత్రం చేయాలి. కానీ ఏమి తెలియని వాడు. అందరి హృదయాలలో ఉండే స్వామికి ఆ విషయం అర్థమైంది. వేద స్వరూపమైన శంఖముతో స్పృశింపచేసాడు. దక్షిణ కపోల భాగములో శంఖము స్పృశింపచేస్తే

స వై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాతపరాత్మనిర్ణయః
తం భక్తిభావోऽభ్యగృణాదసత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితిః

దానితో సకల వేద పరిజ్ఞ్యానం వచ్చింది. తవాన్ని పూర్తిగా తెలుసుకుని భక్తి భావముతో స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ధౄవమైన స్థానం కలవాడు గొప కీర్తి కలిగిన పరమాత్మను స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు


ధృవ కృత భగవద్ స్తుతి
ధ్రువ ఉవాచ
యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్

నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం

ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి

నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో

పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు

నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్

పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం

యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్

శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః

ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.

తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః

నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.

తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః

మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.

కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై

ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.

త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే

స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

పరమాత్మ . ప్రకృతి అవ్యక్తం , పంచభూతాలలోనూ ఉంటాడు. అయినా వాటిలోని దోషాలు అంటని వాడు. కానీ జీవుడు అహంకార మమకార వశమై తనకంటని దోషాలు కూడా అంటినట్లు కష్టముల పాలవుతున్నవాడు జీవుడు. ప్రకృతికి దోషాలు అంటుతాయి. కానీ పరమాత్మకు ఈ రెంటి దోషాలూ అంటవు.
నిత్యముక్త - నిత్య ముక్తులంటే దేనిలో ఉంటాడో దాని దోషం అంటని వాడు.
పరిశుద్ధ- ఎలాంటి దోషములూ లేని వాడు. ఎలాంటి దోషాలూ లేకుండా ఎలా ఉంటాడు? కర్మవశులము కాకపోతే. పరమాత్మ కర్మవశుడు కాడు. అందుకు విశుద్ధ
విబుద్ధ - అసంకుచిత జ్ఞ్యానం కలవాడు కాడు. అనుకున్నదాన్ని అనుకున్నట్లు చేయలేకపోవడం, అలా చేయకుండా తనను తాను వారించలేకపోవడం సంకుచిత జ్ఞ్యానం. కానీ పరమాత్మ అలా కాదు.
ఈ లక్షణాలే వైకుంఠములో ఉన్నవారికి కూడా ఉంటాయి. కానీ నీవు ఆత్మవి. అన్నిటిలో ప్రవేశించి శాసితావు. ముక్తులకు అన్నీ ఉంటాయి గానీ సృష్టి స్థితి లయములు చేయలేడు. పరమాత్మ ప్రతీ దానిలో ప్రవేశించి శాసిస్తాడు.
కూటస్థుడు - వికార రహితుడు. పరమాత్మకు స్వరూప స్వభావ వికారాలు ఉండవు. జీవునికి సరూప మారదు కానీ, స్వభావము మారదు. ప్రకృతిలో స్వరూపములో వికారం ఉంటుంది గానీ స్వభావములో వికారం ఉండదు.

ఈయన ఆదిపురుషుడు - మొదటి వాడైన పురుషుడు. ఇక్కడ ఆది అంటే కారణం. అంటే సృష్టి స్థితి లయ కారకుడు. పురుషుడంటే పురములలో ఉండే వాడు. ఇక్కడ పురము అంటే శరీరం. ఆత్మకు శరీరం ఇచ్చి, ఆత్మలోనూ, శరీరములోనూ ఉండేవాడు. పరమాత్మే కారణమూ కార్యమూ

ఈయన భగవానుడు. ఆరు గుణములు కలవాడు. సత్వం రజస్సు తమస్సూ, ఆ వికారాలు ఉన్న మూడు లోకాలు, ఆ వికారలు ఉన్న ప్రకృతికీ పరమాత్మ అధిపతి

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా - ఏ కష్టమూ లేఖుండా ఇవన్నీ ఆయన సంకల్పములో విషయముగా భాసించిన దాన్నే ఈయన చేస్తాడు. అది కొడా అఖండితయా. మన సంకల్పం ఖండితం. మరచిపోతూ ఉంటాము , ఒక వేళ గుర్తు ఉన్నా చేయలేము. కానీ ఆయనది అఖండితమైన సంకల్పం కలవాడు. అందరూ అందరినీ మరచిపోతారేమో గానీ, పరమాత్మ ఎప్పుడూ ఎవ్వరినీ మరువడు.

స్వదృష్ట్యా -ద్రష్టా: ఈయన స్వయం ద్రష్ట. సర్వకాల సర్వ దేశ సర్వావస్థలలో సర్వ విధములైన జగత్తుకు సుఖ ప్రాప్తీ దుఃఖ నివృత్తినీ చేసేవాడు, కావలసిన దాన్ని ఇచ్చి అవసరములేని దాన్ని ఇవ్వకుండా ఉండగలిగే వాడు. రక్షణ వ్యాపార దక్ష గలవాడు.

యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్దమాత్రమవికారమహం ప్రపద్యే

ఏ పరమాత్మ యందు ఈ లోకములో మనం అనుకునే పరస్పరవిరుద్ధమైన ఆలోచనలూ, వాటి వలన కలిగే వికారాలు, వాటి వలన కలిగే స్థితి స్వరూపాలన్నీ ఏ పరమాత్మ వలన తమకు తాముగా ఆవిర్భవిస్తాయో. భగవంతుడు కానిది ఏదీ లేదు అనే జ్ఞ్యానం నిన్ను చూస్తేనే కలుగుతుంది. పరమాత్మలో జ్ఞ్య్నాన శక్తాది గుణాలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒకే సారి ఉన్నాయా? లేక క్రమముగా వచ్చాయా? అంటే పరమాత్మకు జ్ఞ్యానము ముందు వచ్చి బలం తరువాత వచ్చిందా? ఏ పని చేస్తున్నప్పుడు ఆయన ఆ ఒక్క పనే చేస్తున్నాడనిపిస్తుంది. అలాంటి స్వభావం మనది గానీ ఆయనది కాదు. ఒకదానికి ఒకటి విరుద్ధముగా ఉన్నవి కూడా ఆయనలో సమానముగా ఉంటాయి. ఇవన్నీ ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లు కనపడతాయి గానీ ఆయనలోనే అన్ని గుణాలూ (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు) చూడటానికి వరుసగా ఉన్నట్లు అనిపించినా, అవి అన్నీ సమానముగానే వస్తాయి. ఇదే ఆనుపూర్వ్యాత్
ఇవి ఉన్నవాడే బ్రహ్మ.

విశ్వభవమేకమనన్తమాద్యమ్- ఈయన ప్రపంచానికి కారణం.
ఆనన్దమాత్రమవికారమహం - ఇదే సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ. ఆనందం వలన కలిగేది జ్ఞ్యానం. అవికారం అంటే సత్యం. సత్యం ఎప్పటికీ మారదు. అనంతం అంటే దేశ కాల వస్తు అపరిచ్చిన్నం. పరమాత్మ అనంతుడు : అన్ని కాలలలో రూపాలలో దేశాలలో ఉంటాడు.

ఇలాంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోऽస్మాన్

అన్ని కోరికలనూ నిజం చేసేవాడు పరమాత్మ. పురుషార్థమూర్తేః - పురుషార్ధమంటే జీవుల చేత కోరబడేది. ధర్మార్థకామ మోక్షాలు కాదు పురుషార్థాలంటే , పరమాత్మే పురుషార్థం. అయినా నిన్ను తప్పించి వేరే కోరికలు అడుగుతున్నావారిని కూడా నీవు కాపాడుతున్నావు. తమకు ఏది కావాలో తెలియని దీనులు వారు. అప్పుడే ఈనిన ఆవు తన దూడను పరిపాలించినట్లుగా, అప్పుడే ప్రసవించిన ఆవు తన నాలికతో దూడ యొక్క దోషాలను పోగొడుతుందో మా అందరి దోషాలను రుచిగా స్వీకరించి మమ్మల్ని కాపాడుతున్నావు

దయ తలచాలన్న దైన్యత్వం ఉన్నవాడివి. వారందరినీ నీవు కాపాడుతున్నావు.

అందరిలాగా ధృవుడికి పరమాత్మ ప్రత్యక్షం మాత్రమే కాలేదు. పరమాత్మ తత్వం కూడా ప్రత్యక్షమయ్యింది. పరమాత్మ దీనికోసమె తన స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసి కూడా పాంచజన్యం స్పృశింపచేసి తన తత్వాన్ని సాక్షాత్కరింపచేసాడు.

మైత్రేయ ఉవాచ
అథాభిష్టుత ఏవం వై సత్సఙ్కల్పేన ధీమతా
భృత్యానురక్తో భగవాన్ప్రతినన్ద్యేదమబ్రవీత్

సత్యసంకల్పుడైన ధృవునితో తన సేవకులయందు అమితమైన ప్రేమ ఉన్న వాడైన పరమాత్మ అభినందించి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
వేదాహం తే వ్యవసితం హృది రాజన్యబాలక
తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత

నీవేమికోరి తపస్సు చేసావో నాకు తెలుసు. నీ హృదయములో ఏమనుకున్నావో నాకు తెలుసు. నీవు చక్కని వ్రతమాచరించావు కాబట్టి నీకది ఇస్తున్నాను

నాన్యైరధిష్ఠితం భద్ర యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి
యత్ర గ్రహర్క్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితమ్

నీకు ధృవ స్థానాన్ని ఇస్తున్నాను. ఇతరులెవ్వరు పొందని స్థానం. ప్రపంచం మొత్తములో అదే ప్రకాశశీలమైంది. ఆ ధృవస్థానములోనే అన్ని గ్రహములూ నక్షత్రములూ తారలు అన్నీ అక్కడే ఉంటాయి.

మేఢ్యాం గోచక్రవత్స్థాస్ను పరస్తాత్కల్పవాసినామ్
ధర్మోऽగ్నిః కశ్యపః శుక్రో మునయో యే వనౌకసః
చరన్తి దక్షిణీకృత్య భ్రమన్తో యత్సతారకాః

గానుగ స్తంభం చుట్టూ ఎద్దు తిరగడానికి అందులో కర్ర ఆధారం. ఈ సకల ప్రపంచానికీ , లోకములకూ ఆ ధృవ స్థానం మేఢ్య స్థానం. కల్పకాలములో ఉండే వారికంటే అవతల ఉంటుంది. ప్రళయకాలములో కూడా అది నశించదు. బ్రహ్మకు ఒక పూట కాగానే మూడు లోకాలు పోయినా ఇది మాత్రం పోదు. మునులందరూ నక్షత్రాలతో కలిసి నీ ధృవస్థానానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు

ప్రస్థితే తు వనం పిత్రా దత్త్వా గాం ధర్మసంశ్రయః
షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితావ్యాహతేన్ద్రియః

నీకు రాజ్యాన్నిచ్చి మీ త్రండ్రి  అరణ్యానికి వెళ్ళినప్పుడు అన్నిభోగాలూ అనుభవిస్తూ (ఇంద్రియములకు అడ్డులేకుండా)36000 సంవత్సరాలు పరిపాలిస్తావు.

త్వద్భ్రాతర్యుత్తమే నష్టే మృగయాయాం తు తన్మనాః
అన్వేషన్తీ వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి

తరువాత కొంతకాలానికి నీ సోదరుడు వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన అతని తల్లి దావాగ్నిలో ప్రవేశిస్తుంది.

ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞైః పుష్కలదక్షిణైః
భుక్త్వా చేహాశిషః సత్యా అన్తే మాం సంస్మరిష్యసి

నీవు నన్ను మంచి దక్షిణలతో కూడిన అనేక యజ్ఞ్యములతో ఆరాధించి, అన్ని భోగాలను అనుభవించి, చివరికి నన్ను గుర్తు చేసుకుంటావు.

తతో గన్తాసి మత్స్థానం సర్వలోకనమస్కృతమ్
ఉపరిష్టాదృషిభ్యస్త్వం యతో నావర్తతే గతః

అప్పుడు అందరిచేతా నమస్కరించబడే ధృవస్థానానికి వెళ్ళి, కొంతకాలం ఉండి, నన్ను జ్ఞ్యాపకం చేసుకుని నా లోకానికి వస్తావు

మైత్రేయ ఉవాచ
ఇత్యర్చితః స భగవానతిదిశ్యాత్మనః పదమ్
బాలస్య పశ్యతో ధామ స్వమగాద్గరుడధ్వజః

ఇలా మాట ఇచ్చి పిల్లవాడు చూస్తుండగా గరుడ వాహనుడై తనలోకానికి తాను వెళ్ళాడు

సోऽపి సఙ్కల్పజం విష్ణోః పాదసేవోపసాదితమ్
ప్రాప్య సఙ్కల్పనిర్వాణం నాతిప్రీతోऽభ్యగాత్పురమ్

ధృవుడు కూడా శ్రీమన్నారాయణుని పాద సేవన వలన తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నవాడై (లేదా పరమాత్మ సంకల్పాన్ని పొందినవాడై)  కూడా ఎక్కువగా సంతోషించలేకపోయాడు. అలా ఎక్కువగా సంతోషించకనే తన నగరానికి వెళ్ళాడు

విదుర ఉవాచ
సుదుర్లభం యత్పరమం పదం హరేర్మాయావినస్తచ్చరణార్చనార్జితమ్
లబ్ధ్వాప్యసిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మానమమన్యతార్థవిత్

మహామహులు కూడా ప్రత్యక్షం కాని స్వామిని ఆరు నెలలలో ప్రత్యక్షం చేసుకుని కూడా ఎందుకు ఎక్కువగా సంతోషించలేకపోయాడు
ఒక్క జన్మలోనే పరమాత్మ యొక్క పాద పూజ చేత, ఎంత గొప్పవరూ పొందలేని పరమాత్మ సనందిహి అయిన పరమపదన్ని పొంది కూడా, అనుకున్నదాన్ని పొందలేనివాడిలాగ

మైత్రేయ ఉవాచ
మాతుః సపత్న్యా వాగ్బాణైర్హృది విద్ధస్తు తాన్స్మరన్
నైచ్ఛన్ముక్తిపతేర్ముక్తిం తస్మాత్తాపముపేయివాన్

ఎదురుగా పరమాత్మ ప్రత్యక్షమైనా ధృవుని మనసులో పినతల్లి ఆడిన మాటలే వినపడ్డాయి. వాటినే తలచుకుంటూ పరమాత్మ నుండి ముక్తిని కోరలేకపోయాడు. అందుకు ముక్తినాధుడైన స్వామినుండి మోక్షము కోరలేదు. ఆ సంగతి తెలుసుకుని తరువాత బాధపడ్డాడు.

ధ్రువ ఉవాచ
సమాధినా నైకభవేన యత్పదం విదుః సనన్దాదయ ఊర్ధ్వరేతసః
మాసైరహం షడ్భిరముష్య పాదయోశ్ఛాయాముపేత్యాపగతః పృథఙ్మతిః

సనందాదులు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఏ మహానుభావుడిని తెలుసుకుంటారో అలాంటి పరమాత్మను నేను ఆరు నెలలలో పొందాను. ఎదురుగా పరమాత్మను ఉంచుకుని కూడా నేను భేధ భావాన్ని పొందాను.

అహో బత మమానాత్మ్యం మన్దభాగ్యస్య పశ్యత
భవచ్ఛిదః పాదమూలం గత్వా యాచే యదన్తవత్

ఆహా! శరీరం మీద నాకు ఎంత ప్రేమ ఉంది! సంసారాన్ని తొలగించే పరమాత్మ పాదములు వదిలి అంతము గల పదవిని కోరాను.

మతిర్విదూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిః
యో నారదవచస్తథ్యం నాగ్రాహిషమసత్తమః

ఇప్పుడు నాకర్థమయ్యింది. దేవతలు నా బుద్ధిని పాడు చేసారు. దేవతలు పాడు చేయడమంటే, మన ఇంద్రియాలన్నీ దేవతలే. (ఉదా: మనసు చంద్రుడు). మనం గర్వించడానికి ఏదీ లేదు. నేను చూస్తున్నా అంటే సూర్యుడు, వింటున్నా అంటే దిక్కులూ, నాలుకా అంటే వరుణుడు, నాసికా అంటే అశ్వనీ దేవతలు. ఇది వరకు జన్మలో చేసినదానికి పొందవలసిన ఫలితాన్ని పొందాలో, పొందవలసిన ఫలితానికి మనం ఎలా ఫలితాన్ని పొందాలో ఆవిధముగా ఇంద్రియాధిష్ఠాన దేవతలు పని చేయిస్తారు. మనం పూర్వజన్మలో చేసిన పనికనుగుణముగానే ఇప్పుడు మన బుద్ధి కూడా ఉంటుంది. నారదుడు ముందే చెప్పాడు. పరమాత్మ ప్రసన్నమైనా నీవు పొందాలంకున్నది పొందగలవా, అని చెప్పాడు. నారదుని మాట నిజమే. అప్పుడు నేను గుర్తించలేదే. 

దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్
తప్యే ద్వితీయేऽప్యసతి భ్రాతృభ్రాతృవ్యహృద్రుజా

తపసు చేసానని చెప్పుకుంటున్నాను గానీ, దైవ మాయచేత ఆరు నెలలు నిదుర పోయాను. నిదురపోయినవాడిలాగ భేధ దృష్టి కనపడింది. బాధలన్నీ రావడానికి మూలం, రెండవది ఉన్నది అనుకోవడం వలనే. పరమాత్మకన్నా వేరేదేదీ లేకున్నా నేను బాధపడుతున్నాను. 
భ్రాతృభ్రాతృవ్యహృద్రుజా - సోదరులూ, సోదరులపిల్లలు, వీరినే జ్ఞ్యాతులూ అంటారు. అంటే సోదరులలా ఉన్న శతురువుల వలన హృదయానికి రోగం వచ్చింది. ఈ హృదయ రోగమే శత్రువు. దీని వలన తంపింపబడుతున్నాను. 
మనోవ్యాధి అనే శత్రువుచేత భేధ బుద్ధి కలిగి నేను బాధపడుతున్నాను. 
జ్ఞ్యాతీ అనేది శత్రువుకు పర్యాయపదం. 

మయైతత్ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి
ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనమ్
భవచ్ఛిదమయాచేऽహం భవం భాగ్యవివర్జితః

వ్యర్థమైన దానిని అడిగాను. ప్రాణము పోయిన వాటికి వైద్యం చేసినట్లుగా పనికి రాని వరాన్ని అడిగాను. తపస్సు చేసి ప్రసన్నం చేసుకోడానికి శక్తిలేని వాడిని, సంసారాన్ని పోగొట్టే వాడైన పరమాత్మను సంసారం అడిగాను. అదృష్టం లేని నేను ఇది కోరాను

స్వారాజ్యం యచ్ఛతో మౌఢ్యాన్మానో మే భిక్షితో బత
ఈశ్వరాత్క్షీణపుణ్యేన ఫలీకారానివాధనః

స్వారాజ్యం ఇస్తానన్న పరమాత్మను బిక్షమెత్తుకోవడానికి పాత్రని అడిగాను. డబ్బులే చూడని రైతు దగ్గరకు కోటీశ్వరుడు వెళ్ళి "ఏమి కావాలో అడిగితే" తారు ధాన్యాన్ని అడిగినట్లు పరమేశ్వరున్ని నేను ఇది అడిగాను

మైత్రేయ ఉవాచ
న వై ముకున్దస్య పదారవిన్దయో రజోజుషస్తాత భవాదృశా జనాః
వాఞ్ఛన్తి తద్దాస్యమృతేऽర్థమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనఃసమృద్ధయః

ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన పరమాత్మ దాస్యం లభిస్తుంది. 
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు 

ఆకర్ణ్యాత్మజమాయాన్తం సమ్పరేత్య యథాగతమ్
రాజా న శ్రద్దధే భద్రమభద్రస్య కుతో మమ

ధృవుడు నగరపొలిమేరలు చేరగానే ఆ వార్త విన్న రాజు నమ్మలేదు. అదృష్టహీనుడైన నాకు ఇంత మంగళకరమైన వార్తా? 

శ్రద్ధాయ వాక్యం దేవర్షేర్హర్షవేగేన ధర్షితః
వార్తాహర్తురతిప్రీతో హారం ప్రాదాన్మహాధనమ్

కానీ నారదుని మాట గుర్తుకు వచ్చి అతి ప్రీతి పొంది వార్తాహరునికి తన హారాన్నీ కొంత ధనాన్ని బహుమానముగా ఇచ్చి 

సదశ్వం రథమారుహ్య కార్తస్వరపరిష్కృతమ్
బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ పర్యస్తోऽమాత్యబన్ధుభిః
శఙ్ఖదున్దుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః
నిశ్చక్రామ పురాత్తూర్ణమాత్మజాభీక్షణోత్సుకః

(కార్తస్వరం అంటే బంగారం. కృతః స్వరః యస్మిన్. దేనితో అందరూ బాగా శ్రుతి చేయబడతారో) 
బంగారు రథాన్నీ చక్కని గుర్రాలను పూంచి కులవృద్ధులతో బ్రాహ్మణులతో బంధువులతో శంఖ దుంధుబి నాదముతో బ్రహ్మఘోష (స్వస్తి వాచనం) మురళీ గానాలతో కుమారున్ని చూడాలన్న ఉత్సుకతతో బయటకి వెళ్ళాడు

సునీతిః సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే
ఆరుహ్య శిబికాం సార్ధముత్తమేనాభిజగ్మతుః

అతనితో బాటు ఇద్దరి భార్యలూ అలంకరించుకుని పల్లకీ ఎక్కి ఉత్తమునితో కలిసి అంతా వెళ్ళారు 

తం దృష్ట్వోపవనాభ్యాశ ఆయాన్తం తరసా రథాత్
అవరుహ్య నృపస్తూర్ణమాసాద్య ప్రేమవిహ్వలః

పురద్వారం దగ్గరగా ఉన్న ధృవున్ని చూచి రథం దిగి అతని దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు

పరిరేభేऽఙ్గజం దోర్భ్యాం దీర్ఘోత్కణ్ఠమనాః శ్వసన్
విష్వక్సేనాఙ్ఘ్రిసంస్పర్శ హతాశేషాఘబన్ధనమ్

పరమాత్మ దివ్యమంగళ విగ్రహ స్పర్శ పొందినా, అన్ని పాపములూ పోయిన ధృవుడు. తన శరీరము నుంచి పుట్టినవాడు పరమాత్మనే తాకి పాపాలు పోగొట్టుకున్నాడు. గట్టిగా గౌగిలుంచుకున్నాడు

అథాజిఘ్రన్ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభిః
స్నాపయామాస తనయం జాతోద్దామమనోరథః

చల్లని కన్నీటితో (ఆనంద బాష్పాలు చల్లగా ఉంటాయి) అభిషేకం చేసాడు. ఇంత కాలానికి ఇంత గొప్ప కోరిక తీరింది ఉత్తానపాదునికి. 

అభివన్ద్య పితుః పాదావాశీర్భిశ్చాభిమన్త్రితః
ననామ మాతరౌ శీర్ష్ణా సత్కృతః సజ్జనాగ్రణీః

పిల్లవాడు కూడా తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇద్దరు తల్లులకూ సజ్జనుడైన ధృవుడు నమస్కారం చేసాడు. సురుచి ధౄవున్నీ లేపీ కన్నీటితో బొంగురుపోయిన గొంతుతో

సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకమ్
పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గదయా గిరా

యస్య ప్రసన్నో భగవాన్గుణైర్మైత్ర్యాదిభిర్హరిః
తస్మై నమన్తి భూతాని నిమ్నమాప ఇవ స్వయమ్

ఎలా ఐతే నీరు తనకు తానుగా పల్లం వైపు వెళుతుందో పరమాత్మే ప్రసన్నుడైన వాడిని సకల ప్రాణులూ నమస్కరిస్తాయి. మైత్రీ సంతోషం స్నేహం వంటి గుణములతో పరమాత్మ ప్రసన్నత పొందిన వారికి అన్ని ప్రాణులూ నమస్కరిస్తాయి

ఉత్తమశ్చ ధ్రువశ్చోభావన్యోన్యం ప్రేమవిహ్వలౌ
అఙ్గసఙ్గాదుత్పులకావస్రౌఘం ముహురూహతుః

ఉత్తముడికి కూడా ధౄవుని మీద ప్రేమ కలిగి పరస్పరం కౌగిలించుకుని ఆనందబాష్పాలు కార్చాడు

సునీతిరస్య జననీ ప్రాణేభ్యోऽపి ప్రియం సుతమ్
ఉపగుహ్య జహావాధిం తదఙ్గస్పర్శనిర్వృతా

సురుచికి నమస్కరించి తరువాత, ఉత్తమున్ని ఆలింగనం చేసుకున్నాక సునీతికి నమస్కరించాడు
రాముడు కూడా వనవాసం తరువాత మొదట కైకకు నమస్కరించి, భరతున్ని ఆలింగనం చేసుకుని చివరకు కౌసల్యకు ప్రణామం చేసాడు. 
ప్రాణముకన్నా మిన్నగా ఉన్న కుమారున్ని ఆలింగనం చేసుకుని పుత్ర స్పర్శ వలన మనసు యొక్క తాపాన్ని వదిలిపెట్టింది

పయః స్తనాభ్యాం సుస్రావ నేత్రజైః సలిలైః శివైః
తదాభిషిచ్యమానాభ్యాం వీర వీరసువో ముహుః

ఆ తల్లి ధృవునికి క్షీరాభిషేకం (స్తనము నుండి పాలు రాగా), కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాగా నీటితోటి అభిషేకం చేసింది.  వేడిగా ఉన్న స్తన్యాన్ని చల్లబరచడానికి వచ్చినట్లుగా ఆ ఆనందబాష్పాలతో ధృవునికి అభిషేకం జరిగింది

తాం శశంసుర్జనా రాజ్ఞీం దిష్ట్యా తే పుత్ర ఆర్తిహా
ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మణ్డలం భువః

అమ్మా, ఇంతకాలం నీవిన్ని బాధలు పడ్డావు కానీ నీవు అదృష్టవంతురాలివి. నీ కష్టాలను తీర్చే కొడుకు పుట్టావు. ఇంతకాలం వెళ్ళినవాడు మళ్ళీ దొరికాడు. భూమండలం మొత్తం పరిపాలించగల కుమారుడు

అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ప్రణతార్తిహా
యదనుధ్యాయినో ధీరా మృత్యుం జిగ్యుః సుదుర్జయమ్

పూర్వ జన్మలో భగవానుని నీవు బాగా ఆరాధించి ఉంటావు. మనకు వచ్చే ఏ అధికారమైనా కీర్తి అయినా పూర్వ జన్మ సుకృతమే. ఏ పరమాత్మను ఆరాధించడం వలన గెలశక్యము కాని మృత్యువుని సులభముగా గెలుస్తామో ఆయనని ఆరాధించి ఉంటావు

లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః
ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానోऽవిశత్పురమ్

ఇలా ధృవుడు తల్లీ తండ్రుల అభినందనములు అయిన తరువాత పురప్రజలందరూ లాలించారూ, అభినందించారు. ధృవున్నీ, తమ్ముడు ఉత్తమున్ని రథము మీద అధిష్ఠింపచేసుకుని నగరములోకి ప్రవేశించాడు

తత్ర తత్రోపసఙ్క్లృప్తైర్లసన్మకరతోరణైః
సవృన్దైః కదలీస్తమ్భైః పూగపోతైశ్చ తద్విధైః

నగరానికి ధృవుడు వస్తున్న వార్త తెలిసిన ప్రజలంతా నగరాన్ని అలంకరించారు. తోరణాలు, వాటి మధ్య ముత్యాల దారం. 

చూతపల్లవవాసఃస్రఙ్ ముక్తాదామవిలమ్బిభిః
ఉపస్కృతం ప్రతిద్వారమపాం కుమ్భైః సదీపకైః

ద్వారానికి రెండు పక్కలా పూర్ణ కుంభాలు పెట్టారు. కుంభముల మీద ప్రమిదలలో దీపం పెట్టారు

ప్రాకారైర్గోపురాగారైః శాతకుమ్భపరిచ్ఛదైః
సర్వతోऽలఙ్కృతం శ్రీమద్ విమానశిఖరద్యుభిః

బంగారు పూత పూసిన ప్రాకార గోపురాలతో అలంకరించబడిన ఇల్లు. నాలుగు కూడలుల దారిలో చందనం జల్లారు. 

మృష్టచత్వరరథ్యాట్ట మార్గం చన్దనచర్చితమ్
లాజాక్షతైః పుష్పఫలైస్తణ్డులైర్బలిభిర్యుతమ్

పేలాలు పుష్పములూ అక్షతలూ పూజా ద్రవ్యములతో ధృవుని మీద జల్లారు

ధ్రువాయ పథి దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః
సిద్ధార్థాక్షతదధ్యమ్బు దూర్వాపుష్పఫలాని చ

పీడ పోవడానికి ఆవాలు (సిద్ధార్ధ) జల్లారు
పెరుగు జల్లారు. 

ఉపజహ్రుః ప్రయుఞ్జానా వాత్సల్యాదాశిషః సతీః
శృణ్వంస్తద్వల్గుగీతాని ప్రావిశద్భవనం పితుః

ప్రజల యొక్క మధుర గానములు వింటూ ధృవుడు నగరములోకి ప్రవేశించాడు

మహామణివ్రాతమయే స తస్మిన్భవనోత్తమే
లాలితో నితరాం పిత్రా న్యవసద్దివి దేవవత్

పయఃఫేననిభాః శయ్యా దాన్తా రుక్మపరిచ్ఛదాః
ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరాః

పాల నురుగులాంటి పడకలు. ఏనుగు దంతములతో చేసిన మంచాలు, బంగారు రేకులు తొడిగారు.
కొన్ని ఆసనాలు వెండితో (రౌక్మ). 

యత్ర స్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ
మణిప్రదీపా ఆభాన్తి లలనారత్నసంయుతాః

మరకత మాణిక్యాలు ఉన్న స్పటిక రాళ్ళతో గోడలు. మణులతో శోభిస్తున్నాయి ఆ గదులు. బంగారముతో ఒక యువతిని చేసి, తన చేతిలో మణిని పెట్టి, ఆ మణి వలన వచ్చిన వెలుతురుతో గదంతా వెలుగుతూ ఉంది. మొత్తం గదంతా వెలుగుతూ ఉంది. 

ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమైః
కూజద్విహఙ్గమిథునైర్గాయన్మత్తమధువ్రతైః

అనేకమైన ఉద్యానములూ, కోకిలలూ చక్రవాకములూ నెముళ్ళూ హంసలూ రకరకాల పక్షులూ, ఫలములతో ఉన్న ఉద్యానాలను కుమారునికి చూపుకుంటూ లోపలకి తీసుకుని వెళ్ళాడు.

వాప్యో వైదూర్యసోపానాః పద్మోత్పలకుముద్వతీః
హంసకారణ్డవకులైర్జుష్టాశ్చక్రాహ్వసారసైః

ఇది వరకు ధృవుడు విన్న తన రాజ్యములో సంపదను చూచి ఆశ్చర్యపోయాడు. 

ఉత్తానపాదో రాజర్షిః ప్రభావం తనయస్య తమ్
శ్రుత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరమ్

అతనికి యవ్వనము రావడం చూచి, ప్రజలందరూ ధృవున్ని కోరడం చూచి అతన్ని రాజు చేసాడు

వీక్ష్యోఢవయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతమ్
అనురక్తప్రజం రాజా ధ్రువం చక్రే భువః పతిమ్

పిల్లవాడు పెద్దవాడయ్యడని గ్రహించినట్లే, తనకూ వార్థక్యం వచ్చిందని ఆలోచించిన మీద తెలుసుకొని, 

ఆత్మానం చ ప్రవయసమాకలయ్య విశామ్పతిః
వనం విరక్తః ప్రాతిష్ఠద్విమృశన్నాత్మనో గతిమ్

తాను ఎక్కడికి వెళ్ళాడో ఆ లోకం గురించి తెలుసుకొని వనానికి వెళ్ళాడు.

Popular Posts