Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
తదేవమాకర్ణ్య జలేశభాషితం మహామనాస్తద్విగణయ్య దుర్మదః
హరేర్విదిత్వా గతిమఙ్గ నారదాద్రసాతలం నిర్వివిశే త్వరాన్వితః

అది విని "నీవు చాలా మంచివాడివి" అని. మదము బాగా పెరిగినవాడై, నారద మహర్షి కనపడితే ఎక్కడున్నాడో అడిగి త్వరగా వెళ్ళాడు 

దదర్శ తత్రాభిజితం ధరాధరం ప్రోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా
ముష్ణన్తమక్ష్ణా స్వరుచోऽరుణశ్రియా జహాస చాహో వనగోచరో మృగః

స్వామి తన కోరల ముందుభాగము మీద భూమిని పైకి లేపి ఉన్నాడు. సుర్ర్య చంద్రుల కాంతిని అధిగమించిన స్వామి తేజస్సు చూచి "అడవి మృగమా?" అని అన్నాడు

ఆహైనమేహ్యజ్ఞ మహీం విముఞ్చ నో రసౌకసాం విశ్వసృజేయమర్పితా
న స్వస్తి యాస్యస్యనయా మమేక్షతః సురాధమాసాదితసూకరాకృతే

భూమిని విడిచి పెట్టి రా. ఈ భూమి మాది, మాకు బ్రహ్మ ఇచ్చాడు. నేను చూస్తుండగా ఈ భూమిని తీసుకుని క్షేమముగా వెళ్ళలేవు. సూకరాకారాన్ని పొందినవాడా భూమిని వదులు

త్వం నః సపత్నైరభవాయ కిం భృతో యో మాయయా హన్త్యసురాన్పరోక్షజిత్
త్వాం యోగమాయాబలమల్పపౌరుషం సంస్థాప్య మూఢ ప్రమృజే సుహృచ్ఛుచః

మా శత్రువులతో (దేవతలతో) కలిసి నీవు మేము లేకుండా చేయాలనే ఏర్పడ్డావా. చాటుగా గెలిచే వాడవైన నీవు బలముతో గెలువవు. నీది అల్పపౌరుషం. ఇలాంటి నిన్ను సంహరించి నా మిత్రుల దు@ఖాన్ని శాంతింపచేస్తాను

త్వయి సంస్థితే గదయా శీర్ణశీర్షణ్యస్మద్భుజచ్యుతయా యే చ తుభ్యమ్
బలిం హరన్త్యృషయో యే చ దేవాః స్వయం సర్వే న భవిష్యన్త్యమూలాః

ఇలా నేను నా గదతో నీ శిరస్సును భేధించి సంహరిస్తే, ఇంతకాలం నిన్ను పూజించే దేవతలు ఋషులు కూడా మూలము లేకుండా పోతారు. 

స తుద్యమానోऽరిదురుక్తతోమరైర్దంష్ట్రాగ్రగాం గాముపలక్ష్య భీతామ్
తోదం మృషన్నిరగాదమ్బుమధ్యాద్గ్రాహాహతః సకరేణుర్యథేభః

మాట్లాడుతున్న రాక్షసుడి దుష్టాపాలు విని, భయపడుతున్న భూమిని సముద్రమునుండి పైకి తీసుకుని వచ్చాడు. మొసలి అరుపుని విని ఏనుగు బయటకు వచ్చినట్లు భయపడుతున్న భూమిని పైకి తీసుకుని వచ్చాడు. 

తం నిఃసరన్తం సలిలాదనుద్రుతో హిరణ్యకేశో ద్విరదం యథా ఝషః
కరాలదంష్ట్రోऽశనినిస్వనోऽబ్రవీద్గతహ్రియాం కిం త్వసతాం విగర్హితమ్

ఇలా బయటకు వచ్చిన స్వామి వెంట హిరణ్యాక్షుడు కూడా వచ్చాడు. సిగ్గులేని దుర్మార్గులకు నిందించకూడదని ఏమి ఉండదు. మంచి చేడు అని రెండు ఉండవు. 

స గాముదస్తాత్సలిలస్య గోచరే విన్యస్య తస్యామదధాత్స్వసత్త్వమ్
అభిష్టుతో విశ్వసృజా ప్రసూనైరాపూర్యమాణో విబుధైః పశ్యతోऽరేః

దమ్ష్ట్రల మీద భూమిని నీటి మీద నిలిపాడు. దానికి ఆధారముగా తన యోగమాయను ఉంచాడు. అలా చేసిన స్వామి మీద ఆ రాక్షసుడు చూస్తుండగానే పుష్పవృష్టి కురిపించారు. ప్రజాపతులు స్తోత్రం చేసారు. 

పరానుషక్తం తపనీయోపకల్పం మహాగదం కాఞ్చనచిత్రదంశమ్
మర్మాణ్యభీక్ష్ణం ప్రతుదన్తం దురుక్తైః ప్రచణ్డమన్యుః ప్రహసంస్తం బభాషే

ఎదుటివారిని నిందించడం ఆక్రమించడమే పనిగా ఉన్నా, బంగారు తొడుగు ఉన్న గదను పట్టుకుని, దుష్టాలాపాలు పలుకుతున్న వాడితో స్వామి

శ్రీభగవానువాచ
సత్యం వయం భో వనగోచరా మృగా యుష్మద్విధాన్మృగయే గ్రామసింహాన్
న మృత్యుపాశైః ప్రతిముక్తస్య వీరా వికత్థనం తవ గృహ్ణన్త్యభద్ర

మేము వనములో ఉండే మృగాలమే (పరమాత్మకు వనం అని పేరు ఉంది. వన్యతే అంటే అందరిచేతా యాచించబడే వాడు.), నీవు గ్రామములో ఉండేవాడివి. మేము అరణ్య సిమ్హం ఐతే నీవు గ్రామ సిమ్హం. అమంగళకారీ, నిజంగా గెలిచేవాడు ఇలాంటి గర్వముతో కూడిన మాటలాడడు. 

ఏతే వయం న్యాసహరా రసౌకసాం గతహ్రియో గదయా ద్రావితాస్తే
తిష్ఠామహేऽథాపి కథఞ్చిదాజౌ స్థేయం క్వ యామో బలినోత్పాద్య వైరమ్

రసాతలములో ఉండే మీలాంటి వారి సొమ్ముని హరించి సిగ్గువిడిచి పారిపోతున్నాము. పారిపోతుంటే ఎదురుగా వచ్చావు. అందుకు నీ ఎదుట నిలబడి యుద్ధం చేస్తాను. బలవంతులతో విరోధం పెట్టుకుంటే తప్పదు కదా

త్వం పద్రథానాం కిల యూథపాధిపో ఘటస్వ నోऽస్వస్తయ ఆశ్వనూహః
సంస్థాప్య చాస్మాన్ప్రమృజాశ్రు స్వకానాం యః స్వాం ప్రతిజ్ఞాం నాతిపిపర్త్యసభ్యః

సకల్ రాక్షస సైన్యానికి అధిపతివట కదా. ఆలస్యం చేయకు. ఆలోచించకు. నాకు హానిని చేయడానికి ప్రయత్నించు. నీ వారి కన్నీటిని తుడిచివేయి. తాను చేసిన ప్రతిజ్ఞ్యను నీచులే పరిపాలించరు. 

మైత్రేయ ఉవాచ
సోऽధిక్షిప్తో భగవతా ప్రలబ్ధశ్చ రుషా భృశమ్
ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానోऽహిరాడివ

సృజన్నమర్షితః శ్వాసాన్మన్యుప్రచలితేన్ద్రియః
ఆసాద్య తరసా దైత్యో గదయా న్యహనద్ధరిమ్

భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి
అవఞ్చయత్తిరశ్చీనో యోగారూఢ ఇవాన్తకమ్

తాండవం చేస్తున్న సర్పములాగా బాగా నిట్టురుస్తూ గదతో స్వామిని కొట్టబోయాడు. అప్పుడు స్వామి కొంచెం పక్కకు తప్పుకున్నాడు, యోగాన్ని అవలంబించిన వాడు మృత్యువును తప్పించుకున్నట్లు.

పునర్గదాం స్వామాదాయ భ్రామయన్తమభీక్ష్ణశః
అభ్యధావద్ధరిః క్రుద్ధః సంరమ్భాద్దష్టదచ్ఛదమ్
తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః
ఆజఘ్నే స తు తాం సౌమ్య గదయా కోవిదోऽహనత్
కోపముతో పళ్ళు కొరుకుతూ పరిగెత్తుకు వచ్చాడు. వాడి మీదకు హరి కూడా పరిగెత్తుకు వచ్చాడు. కుడి కనుబొమ్మమీద స్వామి కొట్టబోగా, హిరణ్యాక్షుడు తన గదతో వారిచాడు


ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ
జిగీషయా సుసంరబ్ధావన్యోన్యమభిజఘ్నతుః

ఒకరినొకరు గెలవాలని రెండు గదలతో యుద్ధం చేసారు

తయోః స్పృధోస్తిగ్మగదాహతాఙ్గయోః క్షతాస్రవఘ్రాణవివృద్ధమన్య్వోః
విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయా వ్యభాదిలాయామివ శుష్మిణోర్మృధః

బాగా మదించిన వృషభములు గెలవాలని యుద్ధము చేస్తే ఎలా ఉత్పాతాలు ఏర్పడతాయో, అలాంటి దృశ్యం కనపడింది. ఇ

దైత్యస్య యజ్ఞావయవస్య మాయా గృహీతవారాహతనోర్మహాత్మనః
కౌరవ్య మహ్యాం ద్విషతోర్విమర్దనం దిదృక్షురాగాదృషిభిర్వృతః స్వరాట్

లా వారిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే చూద్దామని బ్రహ్మగారు వచ్చారు. 

ఆసన్నశౌణ్డీరమపేతసాధ్వసం కృతప్రతీకారమహార్యవిక్రమమ్
విలక్ష్య దైత్యం భగవాన్సహస్రణీర్జగాద నారాయణమాదిసూకరమ్

పరాక్రమం బాగా ఉండి భయమూ వణుకూ లేక ప్రతీకారం చేయాలని ఉన్న రాక్షసున్ని చూచి, వరాహస్వామితో బ్రహ్మ ఇలా అన్నడు

బ్రహ్మోవాచ
ఏష తే దేవ దేవానామఙ్ఘ్రిమూలముపేయుషామ్
విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసామ్

నీ పాదములను ఆశ్రయించి సేవించే దేవతలకూ బ్రాహ్మణులకూ గోవులకూ నిరపరాధులైన సకల ప్రాణులకూ 

ఆగస్కృద్భయకృద్దుష్కృదస్మద్రాద్ధవరోऽసురః
అన్వేషన్నప్రతిరథో లోకానటతి కణ్టకః

భయాన్ని, హానిని కలిగిస్తున్నాడు. మొత్తం లోకాలు తిరుగుతూ తనకు సాటి వచ్చేవాడిని వెతుకుతూ బాధపెడుతున్నాడు

మైనం మాయావినం దృప్తం నిరఙ్కుశమసత్తమమ్
ఆక్రీడ బాలవద్దేవ యథాశీవిషముత్థితమ్

వీడు మహా మాయావి మహాబలవంతుడు దుర్మార్గుడు. దయచేసి ఇలాంటి పాములాంటి వాడితో ఆడుకోకు. 

న యావదేష వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః
స్వాం దేవ మాయామాస్థాయ తావజ్జహ్యఘమచ్యుత

వీడు పెరగక ముందే నీవు సంహరించు అసురవేళ రాకముందే వాడిని సంహరించు. లేదా తన సమయాన్ని పొంది వీడు పెరుగుతాడు. 

ఏషా ఘోరతమా సన్ధ్యా లోకచ్ఛమ్బట్కరీ ప్రభో
ఉపసర్పతి సర్వాత్మన్సురాణాం జయమావహ

రాబోయేది పరమభయంకరమైన సంధ్యాసమయము. అది రాకముందే దేవతలకు జయం కలిగించు

అధునైషోऽభిజిన్నామ యోగో మౌహూర్తికో హ్యగాత్
శివాయ నస్త్వం సుహృదామాశు నిస్తర దుస్తరమ్

ఇది అభిజిత్ ముహూర్తం. ఇది దేవతలకు సంబంధించినది. నీవు మా అందరికీ మంగళం కలగడానికి ఈ దుర్మార్గున్ని చంపి మమ్ము దుఃఖం నుంచి దాటించు.

దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయమాసాదితః స్వయమ్
విక్రమ్యైనం మృధే హత్వా లోకానాధేహి శర్మణి

ఇతర అవతారాల్లో మేము నిన్ను ప్రార్థిస్తే నీవు అవతారాలు స్వీకరించావు. స్వీకరించి, వారిని వెతుక్కుంటూ వారి దగ్గరకు వెళ్ళి వధించావు. కానీ ఈ అవతారములో వాడే మృత్యువును వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పటిలాగ ఆడుకోకుండా యుద్ధములో విజృంభించి లోకాలకు సుఃఖమును కూర్చు. సకల లోకాలకు మంగళం కలిగించు.

Popular Posts