Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదునాల్గవ అధ్యాయం


సూత ఉవాచ
సమ్ప్రస్థితే ద్వారకాయాంజిష్ణౌ బన్ధుదిదృక్షయా
జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్
వ్యతీతాః కతిచిన్మాసాస్తదా నాయాత్తతోऽర్జునః
దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురూద్వహః

అర్జనుడు ద్వారకకు వెళ్ళాడు బంధువులని చూడటానికి (బన్ధుదిదృక్షయా). 
అనీ దుశ్శకునములు కలిగాయి. 

కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్తుధర్మిణః
పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనామ్

కాలగతి మారింది. మానవుల మనసులో పాపబుధ్ధి కలుగుతోంది. కృఒధం లోభం అసత్యం పెరిగింది. 

జిహ్మప్రాయం వ్యవహృతం శాఠ్యమిశ్రం చ సౌహృదమ్
పితృమాతృసుహృద్భ్రాతృదమ్పతీనాం చ కల్కనమ్

ప్రతీ వ్యవహారం కపటంతోనే (జిహ్మ) నడుస్తోంది. ప్రతీ స్నేహం మోసంతో కూడి ఉన్నది. 
తల్లితండ్రులతోటి మిత్రులు సోదరులతోటి కలహించేవారు ఎక్కువ అయ్యారు. 

నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణామ్
లోభాద్యధర్మప్రకృతిం దృష్ట్వోవాచానుజం నృపః

ఈ నిమిత్తాలు చూచి భీమునితో ధర్మరాజు 

యుధిష్ఠిర ఉవాచ
సమ్ప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బన్ధుదిదృక్షయాజ్
ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్

బంధువులను చూడాలనే కోరికతో అర్జనుడు ద్వారకకు పంపబడ్డాడు కదా. కృష్ణపరమాత్మ ఏమి చేస్తున్నాడో తెలియబడిందనే అనుకుంటున్నాను. 

గతాః సప్తాధునా మాసా భీమసేన తవానుజః
నాయాతి కస్య వా హేతోర్నాహం వేదేదమఞ్జసా

ఏడు నెలలు అయిన ఇంకా వారు రాలేదు. నేనీ విషయాన్ని తెలియలేకపోతున్నాను

అపి దేవర్షిణాదిష్టః స కాలోऽయముపస్థితః
యదాత్మనోऽఙ్గమాక్రీడం భగవానుత్సిసృక్షతి

నారదుడు కాలం వచ్చింది అన్నాడు. కృష్ణపరమాత్మ అవతారం చాలించాక మీరూ వెళ్ళండి అని చెప్పాడు. ఆ కాలం వచ్చిందా?
లీలకోసం క్రీడ కోసం ఈ భూలోకానికి తీసుకొచ్చిన శరీరం వదిలిపెట్టాలనుకుంటున్నాడా

యస్మాన్నః సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః
ఆసన్సపత్నవిజయో లోకాశ్చ యదనుగ్రహాత్

మనం అంటూ ఉన్నాం అంటే అది ఆయన వల్ల. (సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః) 
శతృవిజయం కూడా ఆయన కటాక్షమే (ఆసన్సపత్నవిజయో ). 

పశ్యోత్పాతాన్నరవ్యాఘ్ర దివ్యాన్భౌమాన్సదైహికాన్
దారుణాన్శంసతోऽదూరాద్భయం నో బుద్ధిమోహనమ్

ఎందుకు భయపడుతున్నానంటే ఆకాశంలో భూమిమీద శరీరం మీద ఉత్పాతాలు కనపడుతున్నాయి 
ఇవన్నీ కలిపి త్వరలోనే (అదూరాత్)

ఊర్వక్షిబాహవో మహ్యం స్ఫురన్త్యఙ్గ పునః పునః
వేపథుశ్చాపి హృదయే ఆరాద్దాస్యన్తి విప్రియమ్

(ఎడమ) తొడ భుజము కన్నులు మాటిమాటికీ అదురుతున్నాయి. అనుకోకుండా హృదయంలో దడ పుడుతోంది. 

శివైషోద్యన్తమాదిత్యమభిరౌత్యనలాననా
మామఙ్గ సారమేయోऽయమభిరేభత్యభీరువత్

శివ ఏష ఉద్యన్తం ఆదిత్యమభిరౌతి - ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నక్కలు అరుస్తున్నాయి 
కుక్క కూడా నాకెదురుగా ఉండి అశ్లీలంగా ప్రవర్తిస్తోంది. 

శస్తాః కుర్వన్తి మాం సవ్యం దక్షిణం పశవోऽపరే
వాహాంశ్చ పురుషవ్యాఘ్ర లక్షయే రుదతో మమ

పాల గరుడ పక్షులు దర్శనమిస్తే పని జరుగుతుంది. మిగిలిన పక్షులు ఎడమనుంచి కుడికి వెళ్ళాలి (తీర్చి కట్టుట) కుడి నుంచి ఎడమకు వెళ్ళడం మంచి శకునం కాదు (కట్టి తీర్చుట), 
పశువులు పక్షులు నన్ను ఎడమకు చేసి కుడికి వెళ్తున్నాయి.
ఏనుగులు అశ్వములు ఏడుస్తున్నాయి.

మృత్యుదూతః కపోతోऽయములూకః కమ్పయన్మనః
ప్రత్యులూకశ్చ కుహ్వానైర్విశ్వం వై శూన్యమిచ్ఛతః

పావురం గుడ్లగూబ - ఈ రెండూ మృత్యు దూతలు. (వాటిని పొద్దున్నే చూస్తే వంద పాపాలు చేస్తారని ఉక్తి). అవి వినపడుతున్నాయి. నిద్రపోకుండా అవి అరుస్తున్నాయి. అంటే ప్రపంచం త్వరలో శూన్యం కాబోతోంది

ధూమ్రా దిశః పరిధయః కమ్పతే భూః సహాద్రిభిః
నిర్ఘాతశ్చ మహాంస్తాత సాకం చ స్తనయిత్నుభిః

సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టు పరివేశం (వరదగూడు )అకారణంగా వస్తున్నాయి. 
భూమి పర్వతాలతో సహా కదులుతోంది మేఘంలేకుండా ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి

వాయుర్వాతి ఖరస్పర్శో రజసా విసృజంస్తమః
అసృగ్వర్షన్తి జలదా బీభత్సమివ సర్వతః

ఖరకు గాలి వీస్తోంది. అందరి కళ్ళల్లో దుమ్ము పడుతోంది. మేఘాలు నెత్తురువానను కురిపిస్తున్నాయి

సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్దం మిథో దివి
ససఙ్కులైర్భూతగణైర్జ్వలితే ఇవ రోదసీ

సూర్యుడు కాంతి హీనుడయ్యాడు. ఆకాశంలో గ్రహ యుధ్ధాలవుతున్నాయి. (సూర్యుని పరిధిలో బుధుడు తప్ప ఏ గ్రహం ఉన్నా అది అస్తవ్యస్తమే)
అన్ని భూతములు ఆకాశంలో కొట్లాడుతున్నట్లుగా ఉంది

నద్యో నదాశ్చ క్షుభితాః సరాంసి చ మనాంసి చ
న జ్వలత్యగ్నిరాజ్యేన కాలోऽయం కిం విధాస్యతి

నదులు నదములు క్షోభిస్తున్నాయి. సరసులు మన్సులు కల్లోలం అవుతున్నాయి
నెయ్యిపోస్తున్నా అగ్ని మండటంలేదు. ఈ కాలం ఏమి చేయడానికి వచ్చిందో

న పిబన్తి స్తనం వత్సా న దుహ్యన్తి చ మాతరః
రుదన్త్యశ్రుముఖా గావో న హృష్యన్త్యృషభా వ్రజే

దూడలు పాలు తాగడంలేదు తల్లులు పాలు ఇవ్వడం లేదు
ఆవులు కన్నీరుపెట్టుకుంటున్నాయి, దూడలుమందలో తిరగడంలేదు

దైవతాని రుదన్తీవ స్విద్యన్తి హ్యుచ్చలన్తి చ
ఇమే జనపదా గ్రామాః పురోద్యానాకరాశ్రమాః
భ్రష్టశ్రియో నిరానన్దాః కిమఘం దర్శయన్తి నః

విగ్రహాలనుండి కూడ చెమట వస్తోంది. కంటిమీద నీరు వస్తోంది. 
ఆరామాలు ఉద్యానాలు అన్ని వినోదాలు కలిగించే ప్రదేశాలు శోభావిహీనాలు అయ్యాయి. 
సంపద పోయింది ఆనందంలేకుండా అయింది. ఏదో మహా ఉత్పాతాన్నే చూపేట్లు ఉంది.

మన్య ఏతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదైః
అనన్యపురుషశ్రీభిర్హీనా భూర్హతసౌభగా

పొరబాటున భూమికి భగవంతుని పాద వియోగం కలిగిందా? 

ఇతి చిన్తయతస్తస్య దృష్టారిష్టేన చేతసా
రాజ్ఞః ప్రత్యాగమద్బ్రహ్మన్యదుపుర్యాః కపిధ్వజః

ఇలా ఉండగా అర్జనుడు వచ్చాడు. 

తం పాదయోర్నిపతితమయథాపూర్వమాతురమ్
అధోవదనమబ్బిన్దూన్సృజన్తం నయనాబ్జయోః

ఇంతటి బాధతో ఉన్న అర్జనున్ని ధర్మరాజు ఇంతవరకూ చూడలేదు. తల కిందకు వచి కంటి నీరు కారుస్తూ ఉన్నాడు. 

విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయమనుజం నృపః
పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదేరితమ్

నారదుడు చెప్పిన దాన్ని తలచుకుంటూ అర్జనున్ని అడిగాడు 

యుధిష్ఠిర ఉవాచ
కచ్చిదానర్తపుర్యాం నః స్వజనాః సుఖమాసతే
మధుభోజదశార్హార్హ సాత్వతాన్ధకవృష్ణయః

ద్వారకలో ఉన్నవారందరు బాగున్నార

శూరో మాతామహః కచ్చిత్స్వస్త్యాస్తే వాథ మారిషః
మాతులః సానుజః కచ్చిత్కుశల్యానకదున్దుభిః

మా మేనమామ (వసుదేవుడు) క్షేమంగా ఉన్నారా. 

సప్త స్వసారస్తత్పత్న్యో మాతులాన్యః సహాత్మజాః
ఆసతే సస్నుషాః క్షేమందేవకీప్రముఖాః స్వయమ్

మేనమామ గారి భార్యలందరూ బాగున్నారా 

కచ్చిద్రాజాహుకో జీవత్యసత్పుత్రోऽస్య చానుజః
హృదీకః ససుతోऽక్రూరో జయన్తగదసారణాః

ఆహుకుడు బాగున్నాడా (ఉగ్రసేనుడి అన్న). దుష్టపుత్రుడు ఉన్నవాడి తమ్ముడు బాగున్నాడా (ఉగ్రసేనుడు )
మన బంధువులందరూ బాగున్నారా. 

ఆసతే కుశలం కచ్చిద్యే చ శత్రుజిదాదయః
కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్సాత్వతాం ప్రభుః

బలరాముడు బాగున్నాడా. భగవానుడైన కృష్ణుడు బాగున్నాడా 

ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః
గమ్భీరరయోऽనిరుద్ధో వర్ధతే భగవానుత
సుషేణశ్చారుదేష్ణశ్చ సామ్బో జామ్బవతీసుతః
అన్యే చ కార్ష్ణిప్రవరాః సపుత్రా ఋషభాదయః

కృష్ణ సంతానమంతా బాగున్నారా 

తథైవానుచరాః శౌరేః శ్రుతదేవోద్ధవాదయః
సునన్దనన్దశీర్షణ్యా యే చాన్యే సాత్వతర్షభాః
అపి స్వస్త్యాసతే సర్వే రామకృష్ణభుజాశ్రయాః
అపి స్మరన్తి కుశలమస్మాకం బద్ధసౌహృదాః

కృష్ణుని మిత్రవర్గం బాగున్నారా 
బాగున్న వారు మనని గుర్తుచేసుకుంటున్నారా

భగవానపి గోవిన్దో బ్రహ్మణ్యో భక్తవత్సలః
కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః

బ్రాహ్మణ ప్రియ్డు అయిన భగవంతుడు బాగున్నాడా. సుధర్మ సభలో ఆయన క్షేమంగా ఉన్నాడా

మఙ్గలాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ
ఆస్తే యదుకులామ్భోధావాద్యోऽనన్తసఖః పుమాన్

ఆయన వచ్చింది లోకాలకి మంగళం కలగడానికి. లోకానికి కవల్సినవి ఇచ్చి వాటిని కాపాడటానికి
ఈయన యాదవ కుల సముద్రంలో చంద్రుడిలా అనంతునితో అవతరించాడు.

యద్బాహుదణ్డగుప్తాయాం స్వపుర్యాం యదవోऽర్చితాః
క్రీడన్తి పరమానన్దం మహాపౌరుషికా ఇవ

మహా వీరుల్లాగ యాదవులందరూ వారి వారి ఇళ్ళల్లో నిర్భయంగా ఉన్నారు

యత్పాదశుశ్రూషణముఖ్యకర్మణా సత్యాదయో ద్వ్యష్టసహస్రయోషితః
నిర్జిత్య సఙ్ఖ్యే త్రిదశాంస్తదాశిషో హరన్తి వజ్రాయుధవల్లభోచితాః

ఏ మహానుభావుని పాదములని ఆశ్రయించడం వల్ల మహారాజులు సార్వభౌమాధికారాని పొందారో, సత్య్భామాది భార్యలు ఇంద్రలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారో 

యద్బాహుదణ్డాభ్యుదయానుజీవినో యదుప్రవీరా హ్యకుతోభయా ముహుః
అధిక్రమన్త్యఙ్ఘ్రిభిరాహృతాం బలాత్సభాం సుధర్మాం సురసత్తమోచితామ్

ఎవరి బాహు బలాన్ని ఆశ్రయించిన్ యాదవులంతా ఎక్కడినుంచీ బయం లేకుండా ఉన్నారు
ఇంద్రుడి సభలో దేవతలు అధిరోహించడానికి అనువైన సుధర్మ అనే సభామండపాన్ని కాళ్ళతో హస్తములతో స్పృశిస్తూ ఆసీనులై సభని నిర్వహిస్తున్నారు. ఆ సుధర్మ కృష్ణునివల్లే వచ్చింది

కచ్చిత్తేऽనామయం తాత భ్రష్టతేజా విభాసి మే
అలబ్ధమానోऽవజ్ఞాతః కిం వా తాత చిరోషితః

నువ్వు బాగున్నావా. నీ ముఖం కాంతి విహీనమయింది. 
చిన్నబోయి వచ్చావంటే అతి పరిచయం వల్ల వారు నిన్ను సరిగా చూచుకోలేదా 

కచ్చిన్నాభిహతోऽభావైః శబ్దాదిభిరమఙ్గలైః
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్

కావలసిన విషయములని అందుకోలేదా. చెప్పకూడని అనుకోకూడని విషయాలయందు మనసు పెట్టావా. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తిన్నప్పుడు, చూడకూడని దాన్ని చూచినపుడు మనసు చిన్నబోతుంది. మనప్రమేయం లేకుండా ఇలాంటి విషయం మనకి అనుభవింపచేసాడంటే దానికి మనం చేసిన ఏ పాపం కారణమో అని అర్థం. అధర్మం ఆచరించే దగ్గర గాని, అధర్మం ఎక్కువగా ఉన్నపుడు గాని మన పుట్టుక ఉంటే మనం పాపం చేసిన వాళ్ళమే. ఇలాంటివి విన్నప్పుడో చూచినప్పుడో తిన్నప్పుడో పరమాత్మ నామాలని తలుచుకోవాలి 
ఎమైనా ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? వారి మనసులో ఆశ కల్పించి నీవు ఇవ్వలేదా?

కచ్చిత్త్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియమ్
శరణోపసృతం సత్త్వం నాత్యాక్షీః శరణప్రదః

అభయాన్ని ఇవ్వవలసిన నీవు - బ్రాహ్మణులకు బాలురకు గోవుని వృధ్ధున్ని రోగిష్టిని స్త్రీలను. వీరు శరణు కోరితే ఇవ్వలేదా 

కచ్చిత్త్వం నాగమోऽగమ్యాం గమ్యాం వాసత్కృతాం స్త్రియమ్
పరాజితో వాథ భవాన్నోత్తమైర్నాసమైః పథి

పొందకూడని స్త్రీని వదిలిపెట్టావా. పొందవలసిన స్త్రీని వదిలిపెట్టావా
పొరబాటున దారిలో వస్తుంటే నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా 

అపి స్విత్పర్యభుఙ్క్థాస్త్వం సమ్భోజ్యాన్వృద్ధబాలకాన్
జుగుప్సితం కర్మ కిఞ్చిత్కృతవాన్న యదక్షమమ్

తినవలసిన వృధ్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా. ఆకలిగొన్న వారు ఉండగా వరిని వదిలి నీవు తిన్నావా. ద్వారంలో అథితి ఉండగా ఆపోశనం, నీరు తాగితే అది మద్యంతో సమానం. 
పది మందీ అసహ్యించుకునే పని నీవు చేయదగని పనినీ చేసావా

కచ్చిత్ప్రేష్ఠతమేనాథ హృదయేనాత్మబన్ధునా
శూన్యోऽస్మి రహితో నిత్యం మన్యసే తేऽన్యథా న రుక్

నీకు బాగా ఇష్టమైన (ప్రేష్ఠతముడు ) వారితో ఎడబాటు పొందావా. ఇలాంటిదేదో లేకుంటే నీకు ఇల్లంటి బాధ కలగదు 

Popular Posts