Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదవ అధ్యాయం


శౌనక ఉవాచ
హత్వా స్వరిక్థస్పృధ ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః
సహానుజైః ప్రత్యవరుద్ధభోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్తతః

ధర్మ పరిపాలించడంలో శ్రేష్టుడైన ధర్మరాజు ఆతతాయులైన వారిని సంహరించి తమ్ములతో కలిసి రాజ్యానుభవాన్ని భోగానుభవాని తిరస్కరించినవాడు (ప్రత్యవరుద్ధభోజనః ) రాజుగా ఎలా పరిపాలించాడు

సూత ఉవాచ
వంశం కురోర్వంశదవాగ్నినిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః
నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవ హ

వెదురు బొంగుల వనంలో పుట్టిన అగ్ని (వంశ దవాగ్ని నిర్హృతం )లాగ కాలబడిన కురువంశాన్ని నిర్వంశం కాకుండా కాపాడి మొలకెత్తింపచేసి (సంరోహయిత్వా )  సంసారాన్ని ఉత్పన్నం చేసే హరి (భవభావనో హరిః)
యుధిస్టిరున్ని రాజ్యంలో నియమించి సంతోషించాడు

నిశమ్య భీష్మోక్తమథాచ్యుతోక్తం ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః
శశాస గామిన్ద్ర ఇవాజితాశ్రయః పరిధ్యుపాన్తామనుజానువర్తితః

బీష్ముని మాటని కృష్ణుని మాటని విని కలిగిన జ్ఞ్యానంతో విభ్రమాలు తొలగి (ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః)
ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినట్లుగా కృష్ణున్ని ఆశ్రయించి తమ్ములు అనుసరించి ఉండగా పరిపాలించాడు.

కామం వవర్ష పర్జన్యః సర్వకామదుఘా మహీ
సిషిచుః స్మ వ్రజాన్గావః పయసోధస్వతీర్ముదా

ధర్మరాజు ధర్మగా పరిపాలించడనడానికి గుర్తుగా కోరినప్పుడల్లా వర్షం కురిసేది. నెలకు మూడువానలే కాకుండా కావలసినప్పుడు కూడా వర్షం వచ్చేది. భూమి కూడా కోరినదన్ని ఇస్తూ ఉన్నది (సర్వకామదుఘా మహీ). ఏ పంట కావాలంటే ఆ పంట.
ఆవులు కూడు పాలునిండిన పొదుగుతో తమ పాలతో ప్రజలందరినీ తడిపేవి. ఈ మూడు ధర్మబద్దంగా రాజు ఉంటే వస్తాయి

నద్యః సముద్రా గిరయః సవనస్పతివీరుధః
ఫలన్త్యోషధయః సర్వాః కామమన్వృతు తస్య వై

ఏ ఏ ఋతువులో ఏ ఏ పళ్ళు కాయలు పంటలు పండాలో ఆయా ఋతువులకు అనుగుణంగా ఉండేవి.

నాధయో వ్యాధయః క్లేశా దైవభూతాత్మహేతవః
అజాతశత్రావభవన్జన్తూనాం రాజ్ఞి కర్హిచిత్

మాన్సిక చింతలూ వ్యాధులు బాధలూ లేవు. (రాముడు బాధపడతాడని అయోధ్యవాసులు తమలో తాము పేచీ పెట్టుకోలేదు). ఆధ్యాత్మక ఆదిదైవిక ఆదిబూత తాపత్రయాలు లేవు
రాజు యందు ప్రజలకు ప్రీతి కలిగింది


ఉషిత్వా హాస్తినపురే మాసాన్కతిపయాన్హరిః
సుహృదాం చ విశోకాయ స్వసుశ్చ ప్రియకామ్యయా
ఆమన్త్ర్య చాభ్యనుజ్ఞాతః పరిష్వజ్యాభివాద్య తమ్
ఆరురోహ రథం కైశ్చిత్పరిష్వక్తోऽభివాదితః

తన చెల్లెలకు ప్రీతి కలిగించడానికి (స్వసుశ్చ ప్రియకామ్యయా), మిత్రుల ప్రీతి కొరకూ ఉన్న కృష్ణుడు ధర్మరాజాదుల అనుమతి పొంది, కొంతమందికి నమస్కారం చేసి (ధర్మరాజు భీముడు మొ), కొంతమందికి ఆశీర్వదించి కొంతమందిని ఆలింగనం చేసుకుని రధం ఎక్కాడు

సుభద్రా ద్రౌపదీ కున్తీ విరాటతనయా తథా
గాన్ధారీ ధృతరాష్ట్రశ్చ యుయుత్సుర్గౌతమో యమౌ
వృకోదరశ్చ ధౌమ్యశ్చ స్త్రియో మత్స్యసుతాదయః
న సేహిరే విముహ్యన్తో విరహం శార్ఙ్గధన్వనః

ఇన్నాళ్ళు ఉన్నా మాళ్ళి బయలుదేరుతుంటే (సుభద్ర దరుపతి కుంతి ఉత్తర గాంధారి దృతరాష్టుడు మొ వాళ్ళు) పరమాత్మ యొక్క విరహాన్ని భరించలేక

సత్సఙ్గాన్ముక్తదుఃసఙ్గో హాతుం నోత్సహతే బుధః
కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్య రోచనమ్

సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యం వల్ల వచ్చిన పాపం పోయి. భగవంతుని తనలో ఉంచుకుని, భగవంతుడు తనలో ఉన్నాడు అని తెలుస్కున్న వాడు సత్. వాడే ఉన్నవాడు. దుస్సంగాన్ని వదిలించే సత్సంగాన్ని జ్ఞ్యాని వదిలిపెట్టడు (నోత్సహతే బుధః). ఒక్కసారి విన్నంత మాత్రానే మళ్ళి అదే వినాలి అనిపించే భగవానుని కీర్తి

తస్మిన్న్యస్తధియః పార్థాః సహేరన్విరహం కథమ్
దర్శనస్పర్శసంలాప శయనాసనభోజనైః

ఎవరి కథను గానం చేస్తేనే వింటేనే ఇంకా వినాలని అనుకుంటామో అలాంటి మహనుభావుని విరహాన్ని ఎల సహిస్తారు. పక్కన కూర్చుండి, ముట్టుకుని, భుజుంచి...

సర్వే తేऽనిమిషైరక్షైస్తమను ద్రుతచేతసః
వీక్షన్తః స్నేహసమ్బద్ధా విచేలుస్తత్ర తత్ర హ

ఇన్ని రకాల అనుబంధాన్ని పెంచుకున్న స్వామి వెళ్తుంటే రెప్ప వెయ్యడం మర్చిపోయి అనిమిషులయ్యారు
వీరి మనసులు ఆయనయందే పరిగెడుతోంది. తమలో తామే పరితపిస్తూ ఉన్నారు

న్యరున్ధన్నుద్గలద్బాష్పమౌత్కణ్ఠ్యాద్దేవకీసుతే
నిర్యాత్యగారాన్నోऽభద్రమితి స్యాద్బాన్ధవస్త్రియః

రాబోతున్న నీళ్ళను నిగ్రహించుకుని, సాంప్రదాయం కాదని కులస్త్రీలు (రాజ స్త్రీలు)సాగనంపడానికిరాకూడదని బలవంతంగా ఇద్దరూ ఆపుకున్నారు

మృదఙ్గశఙ్ఖభేర్యశ్చ వీణాపణవగోముఖాః
ధున్ధుర్యానకఘణ్టాద్యా నేదుర్దున్దుభయస్తథా

మంగళ వాద్యాలు దుంధుబులు మోగాయి

ప్రాసాదశిఖరారూఢాః కురునార్యో దిదృక్షయా
వవృషుః కుసుమైః కృష్ణం ప్రేమవ్రీడాస్మితేక్షణాః
సితాతపత్రం జగ్రాహ ముక్తాదామవిభూషితమ్
రత్నదణ్డం గుడాకేశః ప్రియః ప్రియతమస్య హ

అర్జునుడు చత్రాన్ని పట్టుకున్నాడు. గుడాకేశ - నిద్రను తన వశంలో ఉంచుకున్నవాడు అర్జనుడు

ఉద్ధవః సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే
వికీర్యమాణః కుసుమై రేజే మధుపతిః పథి

ఉధ్ధవ సాత్యకులు రెండు పక్కలా నిల్బడారు చామరాలతో. రాజమార్గం లో పూలు జల్లుతుంటే హరి ప్రకాశంతో శొభిస్తున్నాడు

అశ్రూయన్తాశిషః సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః
నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః

బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు. తగిన మంగళాశాసనాలు తగని ఆశీర్వాదాలు (నానురూపానురూపాశ్చ ) విని పరమాత్మ ఆమోదించాడు. మనం చేసే ప్రతీ దాన్ని పరమత్మ ప్రేమతో స్వీకరిస్తాడు

అన్యోన్యమాసీత్సఞ్జల్ప ఉత్తమశ్లోకచేతసామ్
కౌరవేన్ద్రపురస్త్రీణాం సర్వశ్రుతిమనోహరః

కృష్ణుడు ఎక్కడా తన దివ్యత్వాన్ని మరుగుపరుచుకోడు.  అందుకే అక్కడ ఉన్న స్త్రెలు ఈ విధంగా అన్నారు

స వై కిలాయం పురుషః పురాతనో య ఏక ఆసీదవిశేష ఆత్మని
అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నిశి సుప్తశక్తిషు

ఈయన పురాణ పురుషుడు. ఎలాంటి విశెషాలు లేకుండా తనలో తానే ఒక్కడుగా పడుకుని ఉన్నాడు. ప్రకృతి అహంకారం మహత్ - సత్వ రజ తమ గుణాలు ఇవన్నీ ఉత్పన్నం కాకముందు వాటి శక్తులన్నీ నిద్రించి ఉన్నప్పుడు ఎవ్వడైతే ఉన్నాడో ఆయనే ఈ కృష్ణుడు.

స ఏవ భూయో నిజవీర్యచోదితాం స్వజీవమాయాం ప్రకృతిం సిసృక్షతీమ్
అనామరూపాత్మని రూపనామనీ విధిత్సమానోऽనుససార శాస్త్రకృత్

అలాంటి పరమాత్మే తన శక్తితోటి ప్రేరేపించబడి యోగమాయగా ఉన్న ప్రకృతిని సృష్టించాలని కోరిక గలగజేసి నామ రూపాలు లేని ప్రకృతికి, సృష్టిని కోరుతున్న, నామరూపలు లేని ప్రకృతికి నామరూపలు సృష్టించి శాస్త్రానుగుణంగా (బ్రహమను సృష్టించి వేదానుగుణంగా ప్రకృతిని సృష్టించాడు)

స వా అయం యత్పదమత్ర సూరయో జితేన్ద్రియా నిర్జితమాతరిశ్వనః
పశ్యన్తి భక్త్యుత్కలితామలాత్మనా నన్వేష సత్త్వం పరిమార్ష్టుమర్హతి

ఎవరి స్థానాన్ని (యత్పదమత్ర ) ఇంద్రియజయం కలిగి ప్రాణవాయువు నిర్జించి కలిగినవారు భక్తితో పరిశుద్దమైన మనసుకలిగినవారు ఏ లోకాన్ని చూడగలరో ఆయన ఈయనే(స్ వా) కదూ. ఈయన మా కష్టాన్ని తొలగించాలి

స వా అయం సఖ్యనుగీతసత్కథో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః
య ఏక ఈశో జగదాత్మలీలయా సృజత్యవత్యత్తి న తత్ర సజ్జతే

పరమరహస్యమైన వేదములో గానం చేసే కధలు ఈయనవే. ఇతను తన లీలతో సకల చరాచర జగత్తుని సృష్టించి రక్షించి సంహరిస్తున్నాడు కాని అసలు దానిలో ఈయన చిక్కుకోడు  (న తత్ర సజ్జతే)

యదా హ్యధర్మేణ తమోధియో నృపా జీవన్తి తత్రైష హి సత్త్వతః కిల
ధత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దధద్యుగే యుగే

జగత్తు మొత్తాన్ని సృష్టించి కాపాడి సంహరించేవాడు ఇక్కడెందుకు ఉన్నాడు? ఎలా అయితే తామసమైన బుధ్ధి కలిగిన రాజులు అధర్మంతో కలుషితం చేసారు అక్కడ ఈ పరమాత్మ శరీరాన్ని (భగం ) ధరిస్తాడు. సత్యం ఋతం దయ కీర్తి అనే నాలుగు తీసుకుని, ప్రపంచం నిలుచుటకు (భవాయ ) ప్రతీయుగంలో రూపం ధరించి వస్తాడు.

అహో అలం శ్లాఘ్యతమం యదోః కులమహో అలం పుణ్యతమం మధోర్వనమ్
యదేష పుంసామృషభః శ్రియః పతిః స్వజన్మనా చఙ్క్రమణేన చాఞ్చతి

ఇంతకాలానికి యదువంశం ధన్యమైంది, మధురా నగరం ధన్యమైంది. ఎందుకంటే ఈ శ్రియ: పతి, పురుషోత్తముడు తన పుట్టుకతో నడవడితో (చఙ్క్రమణేన ) యదువంశాన్ని మధురానగరాన్ని మన్నించడు పావనం చేసాడు (చాఞ్చతి)

అహో బత స్వర్యశసస్తిరస్కరీ కుశస్థలీ పుణ్యయశస్కరీ భువః
పశ్యన్తి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మ యత్ప్రజాః

వైకుంఠపు కీర్తిని చిన్నబోయినట్లుగా చేసిన నగరం కుశస్థలీ (ద్వారక). భూమికి కీర్తి పెంచేది.
పరమాత్మ దయతో ఆవిర్భవించిన పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తున్నారు పశ్యంతి నిత్యం (సదా పశ్యంతి సూరయ:).

నూనం వ్రతస్నానహుతాదినేశ్వరః సమర్చితో హ్యస్య గృహీతపాణిభిః
పిబన్తి యాః సఖ్యధరామృతం ముహుర్వ్రజస్త్రియః సమ్ముముహుర్యదాశయాః

రతములు స్నానములు పూజలు యజ్ఞ్యములు వాటితో వారు బాగా ఆరాధించి ఉంటారు . ఇది నిశ్చయం (నూనం ) చేతులతో గట్టిగా పట్టుకుని స్వామి అధరామృతాన్ని పానం చేసిన గోపికలు ఎన్ని పూజలు చేసారో.
దేవతలు మూర్చపోయేట్లు చేసారు వీరు (సమ్ముముహుర్యదాశయాః). ఇటువంటి పుణ్యాన్ని ఎవరూ చేసి ఉండరు

యా వీర్యశుల్కేన హృతాః స్వయంవరే ప్రమథ్య చైద్యప్రముఖాన్హి శుష్మిణః
ప్రద్యుమ్నసామ్బామ్బసుతాదయోऽపరా యాశ్చాహృతా భౌమవధే సహస్రశః
ఏతాః పరం స్త్రీత్వమపాస్తపేశలం నిరస్తశౌచం బత సాధు కుర్వతే
యాసాం గృహాత్పుష్కరలోచనః పతిర్న జాత్వపైత్యాహృతిభిర్హృది స్పృశన్

స్వయంగా చిన్న సందేశం పంపితే వచ్చితీసుకుని పోయాడు. కాని సకలలోకాలను పీడిస్తున్న నరకాసురున్ని చంపి అతను బంధించిన స్త్రీలను తీసుకుని వచ్చాడు. ఇందులో ఎవరు అదృష్టవంతులు? రుక్మిణి సందేశం పంపింది. ఈ పదహారువేలమంది కబురు కూడా పంపలేదు. వారెంత అదృష్టవంతులో. మాటిమాటికీ వారు కృష్ణుణ్ణే చూస్తారు.  యాసాం గృహాత్పుష్కరలోచనః పతి: - పుష్కరం అంటే పద్మం. పుండరీకాక్షుడు. ఆహృతిభిర్హృది స్పృశన్ - ఎప్పుడూ వారి హృదయంలోనే ఉండి వారి ఇంటినే అంటిపెట్టుకుని ఉంటాడు.

ఏవంవిధా గదన్తీనాం స గిరః పురయోషితామ్
నిరీక్షణేనాభినన్దన్సస్మితేన యయౌ హరిః

ఇలా మాట్లాడుతున్న వారి మాటలని వింటూ క్రీగంటి చూపుతో చూస్తు చిరునవ్వుతో అభినందిస్తూ బయలుదేరాడు

అజాతశత్రుః పృతనాం గోపీథాయ మధుద్విషః
పరేభ్యః శఙ్కితః స్నేహాత్ప్రాయుఙ్క్త చతురఙ్గిణీమ్

చతురంగ సైన్యాన్ని అతని వెంట ప్రేమతో పంపాడు ధర్మరాజు

అథ దూరాగతాన్శౌరిః కౌరవాన్విరహాతురాన్
సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ప్రాయాత్స్వనగరీం ప్రియైః

వారు చాల దూరం వెంట వచ్చారిని వెనక్కి పంపించి వారు పడుతున్న బాధని చిరునవ్వుతో తొలగించాడు.

కురుజాఙ్గలపాఞ్చాలాన్శూరసేనాన్సయామునాన్
బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్సారస్వతానథ

ఆయ దేశలను దాటుకుంటూ

మరుధన్వమతిక్రమ్య సౌవీరాభీరయోః పరాన్
ఆనర్తాన్భార్గవోపాగాచ్ఛ్రాన్తవాహో మనాగ్విభుః

ఆనర్తాన్ - ద్వారకానగరమున్న దేశంపేరు ఆనర్తదేశం. శూర్సేనుడు పరిపాలించే దేశం.
గుఱ్ఱాలు కూడా కాస్త అలిసి ఉన్నాయి

తత్ర తత్ర హ తత్రత్యైర్హరిః ప్రత్యుద్యతార్హణః
సాయం భేజే దిశం పశ్చాద్గవిష్ఠో గాం గతస్తదా

అక్కడి వరకూ వచ్చే మార్గ మధ్యంలో ఆయా దేశరాజులు మర్యాద చేసారు. ఇలా సాయంకాలానికి గవిష్టుడు (సూర్యుడు)  గాం (పశ్చిమ) దిక్కుకు వెళ్ళే సమయానికి చేరుకున్నాడు
కిరణములతోనే అందరిలో ఉంటాడు కాబట్టి - గోవిష్ఠ అని సూర్యునికి పేరు. వైకుంఠంలో ఉన్న పురుషుడే సూర్యుడిలో ఉన్నాడు. అదే పురుషుడు మన కంటిలో ఉన్నాడు. ఆయన్ను ఉపాసించడమే అంతరాదిత్య ఉపాసన. మన కంటిలోనే ఉన్నవాడే పరమాత్మ అనే భావన. ఉపనిషత్తుల్లో ఉన్న 32 విద్యల్లో ఈ అంతరాదిత్య ఉపాసన ఒకటి.
అలాగే శ్రోత్రంలో ఉన్న ఆకాశం వైకుంఠంలో ఉన్న ఆకాశం ఒకటే. అలా మనం కూర్చుని ఒక్కొక్క ఇంద్రియములో మనం ధ్యానం చేసి అందులో ఉన్న పరమాత్మని ధ్యానం చెయ్యడం ఒక విధానం. మన శరీరంలో ఉన్న అవయవాల్లోనే పరమాత్మ అధిష్టించి ఉన్నాడు అనే భావన చెయ్యాలి.

Popular Posts