Followers

Tuesday 14 January 2014

నవవిధ భక్తిమార్గాలు

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నవి నవవిధ భక్తిమార్గాలు. 


ఐతే నారదమహర్షి పదకొండు విధాలుగా భక్తిమార్గాలును తెలిపారు. అవేమిటంటే......
"గుణమాహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సఖ్యాసక్తి, వాత్సల్యాసక్తి, కాంతా సక్త్యాత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తి, పరమ విరహాసక్తి రూపా ఏకధా ప్యేకాదశధా భవతి"
౧. గుణమహాత్మ్యాసక్తి: 
భగవంతుని దివ్యగుణ కధలను వినుటయందు ప్రీతి(ఆసక్తి). ఈ రీతిలో తరించినవారు... (శౌనుకుడు, శాండిల్యుడు, పరీక్షీత్ మహారాజు...)
౨. రూపాసక్తి: 
భగవంతును దివ్యరూపమును దర్శించుటయందు ప్రీతి. ఈ రీతిలో తరించినవారు... (మిధిలానగరవాసులు, వ్రజ వనితలు, దండకారుణ్యగతులైన మహర్షులు...)
౩. పూజాసక్తి: 
భగవంతున్ని పూజించుటయందు ప్రీతి. (పృధు చక్రవర్తి, అంబరీషుడు......)
౪. స్మరణాసక్తి: 
భగవంతున్ని స్మరించుటయందు ప్రీతి. (ప్రహ్లాదుడు, ధ్రువుడు........)
౫. దాస్యాసక్తి: 
భగవంతునికి కైంకర్యం చేయుటయందు ప్రీతి. (హనుమంతుడు, అక్రూరుడు, విదురుడు.......)
౬. సఖ్యాసక్తి: 
భగవంతునియందు స్నేహభావముతో మెలుగుటయందు ప్రీతి. (అర్జునుడు, ఉద్ధవుడు, సంజయుడు, సుధాముడు........)
౭. వాత్సల్యాసక్తి: 
భగవంతునియందు వాత్సల్యంతో వుండుటయందు ప్రీతి. (అధితికశ్యపులు, శతరూపామనువులు, కౌశల్యధశరదులు, యశోధనందులు, దేవకీవసుదేవులు...)
౮. కాంతా సక్త్యాత్మనివేదనాసక్తి: 
భగవంతున్ని నాయకునిగా తనని నాయికగా భావించుకొని ఆరాధించటయందు ప్రీతి. (రుక్మిణీ తదితర శ్రీకృష్ణుని పట్టమహీషులెనమండుగురు.)
౯. ఆత్మనివేదనాసక్తి: 
భగవంతునికి సర్వము సమర్పించుట యందు ప్రీతి. (బలి, శిబి  చక్రవర్తులు)
౧౦. తన్మయతాసక్తి: 
భగవంతునియందు తన్మయత్వంతో లీనమగు ధ్యానమందు వుండుటకు ప్రీతి. (శుకయోగి, సనకాది జ్ఞాన యోగులు.....)
౧౧. పరమ విరహాసక్తి:  
ఎప్పుడా భగవంతునితో కూడియుందునా అనెడి అత్యంత ప్రేమతో తదేక చింతతో యుండుటయందు ప్రీతి. (ఉద్ధవుడు, వ్రజ ప్రజలు...)

Popular Posts