Followers

Tuesday 17 December 2013

విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు



విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు:-  ఆరు విధములైన విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను.  


  1.    మం\\ " ఓం  ఐం  హ్రీం  శ్రీం క్లీం సౌః   క్లీం  హ్రీం ఐం  బ్లూం స్త్రీం  నీలకరే  సరస్వతీ, ద్రాం ద్రీం క్లీం బ్లూంసః  ఐం హ్రీం  శ్రీం సౌః  హ్రీం స్వాహా " 
 ఈ మంత్రమును రాగిరేకుపై వ్రాసి ప్రతిష్ఠ గావించి షోడశోపచార పూజలుచేసి ఈ మంత్రమును ఏకా గ్రచిత్తుడై లక్షపర్యాయములు జపించి, వసకొమ్ములు, పిప్పలి, మోదుగ,సమిధిలతోటి పదివేల పర్యాయములు హోమము గానించి ఆరాగి రేకును తావీజునందు బెట్టి ధరించిన, పరమ మూర్ఖుడై యున్నను గొప్ప విద్యా వంతుదు కాగలడు విద్యను కలిగించి పాండిత్య ప్రకర్షమొనర్చుటయం దీ మంత్రము అమోఘమైనది.

 2    మం\\    మేథాం విద్యాం  బల  ప్రజ్ఞాంసంపదం పుత్రాపౌత్రికామ్ 
                     దేహిమే  శారదాదేవీ , స్మరామి ముఖ సంస్ధితామ్ ||
         ఈ శ్లోకమును ప్రతి నిత్యము 21 మార్లు పఠింపుచున్న దేవి బుద్ధి జాడ్యమును హరించి,విద్యా వినయ సంపదలనొసంగ గలదు.      


3.  మం\\   ఓం  " హీం హ్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః   సరస్వత్స్యై స్వాహా "
       ఈ మంత్రమును వ్రతదీక్ష బూని 12 లక్షలు జపించిన సిద్ధింప గలదు. ఈ మంత్ర సిద్ధిని పొందిన నరుడు  కేవలం వినినంత మాత్రమున, చదివినంత మాత్రమున సర్వ విద్యలను అవగతము గావించు కొనగలడు. అన్ని భాషలు అతని ఆధినములై యుంటవి. విఙ్ఞాన ధురీణులైన మేధావులకు కలుగు సందేహములను గూడా ఈసిద్ధి నందినవాడు తేలికగా పరిష్కరింప గల సమర్ధుడు కాగలడు.
       ఈ మహాసరస్వతీ మంత్రసిద్ధినందిన వ్యక్తి. ఏ శిశువుకైనను జన్మించిన మూడు దినముల లోపల ఆవు నెయ్యి, తేనె కలిపి బంగారు పుల్లతో ఈ మంత్రమును ఆ శిశువు  నాలుకపై  వ్రాసి అభి మంత్రించిన ఆ శిశువు   13 సం\\లు వచ్చుసరికి గురువును మించిన విద్య పాండిత్యము గలవాడగును.  దీని మహిమ అనన్య సమాన్యమై యున్నది. దీనికి చింతామణి సరస్వతి మంత్ర మని గాడా పేరున్నది. విద్య పాండిత్యములతో బాటు తరగని ధనసంపదను సభాపూజ్యత కీర్తి ప్రతిష్ఠలు కూడా ఈ మంత్ర ప్రభావము వలన చేకూరగలవు.  

4.  మం\\  వాణీల పూర్ణనిశాక రోజ్జ్వలముఖీం కర్పూరకుంద ప్రభాం 
                చంద్రార్థాంకితమ స్తకాం నిజక రైస్సంచి భ్రతీమాదరాత్  
                 వర్ణాకుక్ష గుణం సుధాద్యకలశం విద్యాంచత్యుగస్తనీం 
                 దివ్యైరాభరణ్తే  ద్విభూషితతనుం  సింహాధిరూ ఢాంభజే ||
                ఈ శ్లోకమును ప్రతి నిత్యము క్రమము తప్పకుండా ప్రాతఃకాలంలో 18 మార్లు పఠింపుచున్న విద్యాభ్యాసము నందు గలగు శంకలు తొలగి, స్ఫూర్తి  ఙ్ఞాపకశక్తి, మేధాశక్తి అభివృద్ధి యగుటయే కాక విద్యాజయము నందగలరు.  

 5. మం\\ " ఓం హ్సీం విశ్వోత్తీర్ణ  స్వరూపాయ చిన్మయానంద రూపిణీ తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ  హ్సీం ఓం నమః "
                భక్తి ప్రపత్తులు గల్గి ఈ మంత్రమును శుచిగల ప్రదేశములో ఒక లక్ష పర్యాయములు జపించుట వలన మందబుద్ధి గలవారికి బుద్ధి వికాసమై, కఠినమైన విద్యాలుగూడా కరతలామలకము కాగలవు, పండితుడై సభలందు గౌరవము నందగలడు. 

6. మం\\ " ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహా "
         ఈ మంత్రమును ఏకాంత ప్రదేశంలో కూర్చుని బ్రహ్మ చర్య దీక్షతో 11 రోజులు 11 వేలు జపించిన యెడల అపార మేధా శక్తి, బుద్ది సూక్ష్మత గ్రాహ్యత ప్రతిభ లభించి అన్ని విద్యలందు అఖండ విజయాన్ని పొందగలరు. 

Popular Posts