Followers

Tuesday 17 December 2013

మణి ద్వీప వర్ణన ,(పార్ట్ 3)


మణి ద్వీప వర్ణన ,(పార్ట్ 3)
om sree gurubhyo namaha ,
om sree ganeshaaya namaha 
om sree maatre namaha

అమ్మవారి మణి ద్వీపములో నున్నట్టి గాజు ప్రాకారము ,లో సంతాన వాటిక , దానికి స్వామి గ్రీష్ముడు అతని పత్నులు శుక శ్రీ , శుచిశ్రీ లు , అది , దేవతలు ,సిద్ధ పురుషులు ,తిరుగాడే స్థలము అని మనము చెప్పుకున్నాము , ఇక్కడి నీడలో, సంతప్తులగు,దుక్ఖము తో ఉన్నట్టి ప్రాణులు సేద తీరుతుంటారు .

ఆ పైన ఇత్తడి ప్రాకారము లో ,మలయగిరి వృక్ష వాటిక ఉంది . ఇక్కడ వర్ష్ ఋతువు ,తమ 12 శక్తులగు భార్యలతో నివసిస్తుo తాడు ,కొత్త పల్లవులతో తీగ లతలతో చక్కని వృక్ష సంపదలతో ఉండే ఈ వనము లో , దేవి కి యఘ్య -యాగాదుల కర్మలు చేసేటి వారు , దేవతలు , మరియు పుణ్యాల ను, దేవ తార్పాణ చేసేవారు , సత్కర్మలును కేవలము ధర్మమూ అన్న బుద్ధి ఆచరించేవారు , ఇక్కడ నివసిస్తారు . అని చెప్పుకున్నాము .

ఇప్పుడు పంచ లోహాలతో నిర్మితమైనట్టి ప్రాకారము ను గూర్చి చెప్పుకుంటున్నాము . ఇది ఏడు యోజనాల పర్యo తము ఉన్నది . దీనికి మధ్యగా మందార వృక్షాల వాటిక ఉన్నది .ఈ వనము , రకరకాల పువ్వులు ,రకరకాల చెట్లు , కమ్మని సువాసనలతో ,సుందరమైన వృక్ష సంపదలతో మిక్కిలి శోభను తెచ్చి పెట్టింది . పరమ పవిత్రుడు అగునట్టి , శరద్ ఋతువు దీనికి అధిష్టుడు . ఇతనికి ఇద్దరు భారాలు ఇషు లక్ష్మి,ఉర్జ లక్ష్మి . తమ అనుచరులు మరియు సిద్ధ పురుషులు తో ఇక్కడ వీరి నివాసము . ఏ డవ ప్రాకారము , వెండి ప్రాకారము . ఒక విశాలమైన శిఖరము , ఈ ప్రాకారానికి, ఉన్నట్టి శోభను మరింతగా పెo చుతున్నది . దీనికి మధ్యా భాగము లో పారిజాత వనా లు ఉన్నయి . రక రకాల పూవులు ,గుత్తులు గుత్తులుగా పూఛి , వింత శోభాలను చేకూర్చుతున్నది . వీటి సువాసన్ పది యోజనాల వరకు వ్యాపించి ఉన్నది . ఈ పుష్పాల తో దేవి అర్చనలు జరుగుతుంటాయి . ఇక్కడ దేవి గణాలుకు అమ్మవారికి యాఘ్య యాగాడులగు క్రతువులు జరుగుతుంటాయి , ఈ ప్రాకారమునకు స్వామి ,హేమంత ఋతువు . ఈయన , తమ చేతుల్లో ఆయుధాలు ధరుంచి నిల్చుంటాడు . ఈయన గణాలు సహితము , తమ చేతుల్లో ఆయుధాలు ధరించి నిల్చుంటారు .ఇక్కడ ,రాగ రాగిణుల
నాదము వినబడుతుంటుంది . మధుర రాగాలాపన జరుగుతుంటుంది . ఇయన శక్తులు ”సహశ్రీ ,సహస్య శ్రీ . భగవతి కృ చ్చ ., ఉపాసన జారుతుంది . వ్రతాన్ని ఆచరిస్తూ ఉండే ఉపాసకులు సిద్ధ పురుషులు కనపడుతుంటారు .

వెండి ప్రాకారము అయిన తరువాత ఎనమిదవ ప్రాకారము ,సౌవర్ణ శాల అని అంటారు .దీని పొడవు ఏడు యొజనాలు . ఇక్కడ కదంబ వనము ఉంది కదంబ పుష్పాల చే ఈ ప్రాకారము శోభాయమానముగా ఉన్నది . ఈ ప్రాకారము బoగారము తో చేయబడింది . పుష్పాలు పల్లవాలు దీని శోభను పెంచుతున్నాయి . ఇక్కడి అధిదేవతా గ్రీష్మ ఋతువు . ఈయన తమ పత్నుల,తప; శ్రీ మరియు తపస్యా శ్రీ ల తో కలిసి ఉంటూ తమ పనులు చేస్తుంటాడు .
om sree maatre namaha

Popular Posts