Followers

Wednesday 30 October 2013

ఆంజనేయుడు ఎందుకు ఆరాధ్యుడు?


తెలుగువారికి, ఆంజనేయుడికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన కేవలం శ్రీరామ బంటేకాదు. చాలా మందికి ఇలవేలుపు. ఆయన దరిజేరితే భూత, ప్రేత, పిశాచ, శాకిని, ఢాకినీ వంటి దుష్టశక్తులు జనావాసాల దరిదాపులకు కూడా రావని ఊరిపొలిమేరల్లో ఆంజనేయుడి గుడిని నిలపడం ఆనవాయితీ! ఆంజనేయుడి పేరునే తమ పేరుగా చేసుకున్న హనుమాన్‌ జంక్షన్‌, హన్మకొండ, హనుమద్వాక, హనుమాన్‌ టికెడి, కీీసర లాంటి ఎన్నో ఊళ్ళు వెలిశాయి. అంజయ్య, హనుమంతరావు. హనుమచ్ఛాస్త్రి వంటి పేర్లు ప్రజల పేర్లుగా విస్తృతంగా చెలామణిలో ఉన్నాయి. పత్రిపూజలో శివుడు, గణపతి ప్రసిద్ధులు కాగా ఆకుపూజనొకదాన్ని సృష్టించుకుని ఆంజనేయుడు తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. సింధురధారణ కూడా ఆయనకే చెందిన విలక్షణ లక్షణం. శ్రీమన్నారాయణుడు దశ విధాకృతులతో కనబడినట్టే ఆంజనేయుడు కూడా దాసాంజనేయుడు, భక్తాంజనేయుడు, వీరాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, యోగాంజనేయుడు, కార్యసిద్ధి ఆంజనే యుడు, పంచముఖ ఆంజనేయుడు అని నానారకాలుగా కనబడ తాడు. బజ్రంగబళిగా విఖ్యాతుడైన ఆంజనేయుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపించిన వాడు. అందుకే అనేక గ్రామాలలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే ఆంజనేయుడు కనబడతాడు. ఆయనకు జనావళి లో గల ప్రాచుర్యానికి, ప్రాభవానికి ఇంత కన్నా నిదర్శనమింకేం కావాలి

హనుమంతుడు మతిమంతుడు, బుద్ధిమం తుడు, మహాబలవంతుడు అని ప్రశస్తి. తెలివిగలవాడే అమిత బలవంతుడని, వజ్రసంకల్పం వున్నవాడే వజ్రాంగబలుడు కాగలడని అక్షరాలా నిరూపించిన వాడు ఆంజనేయుడు. సూర్యునితో పాటే దిక్కులన్నీ కలియ తిరిగి వేదాల సారాన్ని పుక్కిటపట్టిన వాడు ఈ ఆంజనేయుడు. సూర్యుని అను గ్రహాన్ని సంపాదించుకునేవాడు ఆయన కూతురు సువర్చ లను వివాహం చేసుకున్నవాడు ఆంజనేయుడని పురాణాలు చెబుతున్నాయి. విద్యాపరంగా ఆకాశమే హద్దుగా ఎదిగిన వాడు అంతకంతకు ఒదిగి ఉంటాడని ఆనాడే నిరూపించిన వాడు ఆంజనేయుడు. తాను స్వయంగా అమిత బలశాలి అయిన వజ్రాంగబలుడైనా వానర సేనకు నాయకు డిగా కాక ఒక ముఖ్యుడిగానే వుండి రామాయణ కథను నడిపించిన వాడు శ్రీరాముడికి ఘన విజయం సొంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వాడు ఆంజనేయుడు. తాను శ్రీరాముని తాతగారైన సూర్యుడి వద్ద పాఠాలు నేర్చుకున్నా ఏనాడు గర్వభావం చూపలేదు. పైగా తాను సేవించే శ్రీరాముడికి, తన రాజైన సుగ్రీవుడికి అణిగిమణిగి వుండి సేవలు చేసినవాడు ఆపదలు చుట్టు ముట్టినప్పుడు చేయగలిగిన సహాయాన్ని శరీరం దాచుకోకుండా అందించిన వాడు ఆంజనేయుడు. ఆయన పవమా నసుతుడు. గాలి దేవుడిలాగే లోకాలన్నీ కలయ తిరగడం, జీవకోటికి ప్రాణవాయువులా నిలిచి కాపాడడం ఆయనకు జన్మతః అబ్బిన లక్షణాలు. తన నేలినవాడిని గుండెల్లో దాచు కోవడ మే కాదు తనను నమ్ముకున్న వారి గుండెల్లోనూ కొలువుండ గల మంచితనం, మానవత్వం, సహృ దయం కలిగినవాడు ఆంజనేయుడు. అందుకే మన దేశంలో రాముడు, కృష్ణుడులాగే ఊరూరా ఆలయాలు కలిగి ప్రధాన దైవతంగా పూజలందుకుంటున్నవాడు ఆంజనేయుడు. ''పది కొంపలు ను లేని పల్లెనైనను రామభజన మందిరముండి వరలుగాక'' అని పెద్దలు చెప్పారు. ఎక్కడ రాముడు వుంటాడో అక్కడ ఆంజనేయుడు వుంటాడు. ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పలు రాలుస్తూ శిరసుపై చేతులు జోడించి తన్మయం చెందే ఆంజనేయుడు కనబడతాడు. అందుకే ''యత్రయత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారు తింనమత రాక్షసాంతకం'' అని అబాల గోపాలం పూజలందుకుంటున్నాడు. ఈ రోజున నాస్తికవాదులు, ఆస్తికవాదులు, హేతు వాదులు ఉమ్మడిగా అంగీకరించే పని గౌరవం అనే మాట ను ఆరోజునే అక్షరాలా నిరూపించిన వాడు తాను చేపట్టిన పనికి వన్నె తెచ్చినవాడు హనుమంతుడు. శ్రీరాముడికి బంటైనా తక్కువ స్థాయి వ్యక్తిగా కాక దేవతలతో సమానంగా సమాజ గౌరవం పొందిన వాడు, సామూహిక పూజలందుకుం టున్నవాడు ఆంజనేయుడు. ముందే చెప్పినట్టుగా ఆంజనేయుడు మతిమం తుడు, బలవంతుడు దీన్నిబట్టి చూస్తే ఇంగ్లీషు వాడు చెబుతున్న ''సౌండ్‌ మైండ్‌ ఇన్‌ సౌండ్‌ బాడి'' అనే మాటకు హనుమంతుడు ప్రత్యక్ష నిదర్శనంగా కనబడతాడు. ఆంజనే యుడు పేరిట ఊరూరా వ్యాయామ శాలలు ఏర్పాటవడం మనం చూస్తు న్నదే. శరీరానికి బలం చేకూరిస్తేమెదడు మొద్దుబారిపోతుందని మెదడు చురు కుగా వుండాలంటే శరీరం నాజుకుగా వుండాలని అపోహపడేవారికి శాస్త్రీయ విజ్ఞానం లేదు అని స్పష్టంగా చెప్ప డానికే ఆనాడే ఆంజనేయుడు ఈ విధంగా అవతరిం చాడా? అనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారానికి మెదడుకే తప్ప మనం పెంచే కండరాలకు, మెదడుకు సంబంధం లేదని రామా యణ కాలంలోనే ఆంజనే యుడు నిరూపించాడు. భుజబలం, బుద్ధిబలం రెండూ ఏకకాలంలో పదునుగా పనిచేస్తేనే రాణింపు సమగ్రంగా వుంటుందని చేపట్టిన పని ఎంత క్లిష్టమైన దైనా, బహుకష్ట సాధ్య మైనదైనా అవలీలగా సాధించేందుకు వీలవు తుందని ఆంజనేయుడు తన చర్యల ద్వారా పదేపదే నిరూపించాడు. వంద యోజ నాల సముద్రాన్ని పిల్ల కాలువలా దాటి సంకల్ప బలం యొక్క శక్తి ఎంతటిదో చూపించాడు. ఎక్కడో దూరాన వున్న సంజీవని పర్వతాన్ని గంటల వ్యవధిలో తీసుకువచ్చి మూర్ఛబోయిన లక్ష్మణుడిని తేరుకుని స్థిమితపడేలా చేయగలిగాడు. కొండలనుకొట్టి సముద్రంపై శ్రీరామసేతువు నిర్మించగలిగాడు. సూర్యవంశస్థులైన శ్రీరాముని, సుగ్రీవుని దగ్గరుండి స్నేహితు లుగా మార్చాడు. లంకను దహించి రాక్షస లోకంలో గుబులురేపాడు. ఇంతటి మహత్తర సాహస కార్యాలు ఆంజనేయుడు చేయగలి గాడంటే అందుకు మనసు, శరీరం సర్వ సమా నంగా వినియోగించడం వల్లే సాధ్యమైంది. కార్యశూరుడెవడైనా మహ త్తర కార్యాలు సాధించాలంటే భగీరథ ప్రయత్నం చేయాలని గతంలో చెప్పు కునేవారు. ఆంజనేయుడి రాకతో ఆ కథ మరుగున పడి నిజమైన కార్యదక్షుడు ఇలాగే వ్యవహరి స్తాడని సగర్వంగ వేలెత్తి చూపగల స్థితిని తెచ్చిన వాడు ఆంజనేయుడు. అందుకే ఆయన రామా యణ మహామాలకు మణిరత్నంగా భాసించాడు రాముడంతటివాడే ఏమిచ్చినా ఆంజనేయుడి రుణం తీరదని మనసా వాటేసుకుని తన సోదరుడితో సమానంగా మన్నించాడు, సర్వదా ఆదరించాడు. లోకంలో సుప్రసిద్ధమైన దీక్షలు ఎన్నో వున్నా హనుమద్దీక్షకు విశేష ప్రాముఖ్యం వుంది. ఆ దీక్షధారులు అనుసరించే నియమ, నిబంధనలు అత్యంత క్లిష్టంగా వుంటాయి. కానీ ఫలితం తక్షణం కనిపిస్తుంది. అందుకే అంతా హనుమద్దీక్షను త్రికరణ శుద్ధిగా నమ్ముతారు, ఆచరిస్తారు. శైవం, శాక్తేయం తెచ్చిన విబూదిధారణకు, వైష్ణవం తెచ్చినతిరు చూర్ణధారణకు ధీటుగా హనుమం తుడు అందించిన సింధూరధారణ బహుజనా దరణ పాత్రమైంది. హనుమద్భక్తుడు ఫలానా వాడని గుర్తించేందుడు ఈ సింధూరం కొండ గుర్తుగా మారింది. దేవుడితో సమానంగా జీవుడు రాణించగలడని, ఆలయాలకెక్కి పూజలందుకో గలడని నిరూపించిన ఆంజనేయుడికి కష్టాలు, కన్నీళ్లు, హృదయ విదాకర సందర్భాలు బాగా తెలుసు. కంటిలో చెమ్మ, గుండెలో ఆర్ద్రత వున్న వాడే అసలు సిసలైన మానవుడని మానవతా వాదులు చెప్పే విశేష లక్షణానికి పరాకాష్ట హనుమంతుడు. అసామాన్యుడి విజృంభించిన అతి సామాన్యుడిగా మిగిలిపోయినవాడు, సామా న్యుల కొరకే తాను సాధించిన మాన్యతను ధార బోసినవాడు ఆంజనేయుడు. అందుకే ఆయన సర్వదా, సర్వధా ఆరాధ్యుడు, ఆదర్శ పురుషుడు.

Popular Posts