Followers

Wednesday 9 October 2013

నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు

 Picture

నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
-మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం.
- కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది.
- నిమ్మలో దొరికినంత 'సి' విటమిన్ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు.
- ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
- పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది.
-నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.

Popular Posts