Followers

Monday 23 September 2013

పొడిబారిన జుట్టుకు..

కొందరికి తలస్నానం చేసిన తర్వాత రోజే జుట్టంతా నూనె పెట్టినట్లుగా అవుతుంది. మరికొందరికేమో పొడిబారుతుంది. ఇంచుమించు గడ్డిలా తయారవుతుందన్నమాట. ఎలా అయినా సమస్యే కదా! అందుకే ఆయిలీ హెయిర్, డ్రై హెయిర్‌కలవారు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు.. 

ఆయిలీ.. - షాంపు ఎంత తీసుకుంటామో అంతే మోతాదులో పుదీనారసం కలిపి మాడకు పట్టించాలి. ఐదు నిమిషాల తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల కేవలం జుట్టు జిడ్డోడకుండా ఉండడమే కాదు, చుండ్రు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
- గ్లాసు నీళ్లల్లో, వెనిగర్, చిటికెడు ఉప్పు వేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో జుట్టును కడిగేయాలి.

డ్రై.. -కప్పు కొబ్బరిపాలల్లో, రెండు స్పూన్ల శనగపిండి, ఒక స్పూను శీకకాయపొడి కలిపి మాడకు పట్టించాలి. 10నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
- నీలగిరి ఆకును బాగా నూరి తలకు పెట్టాలి. ఇది జుట్టు పొడిబారనీకుండా చేస్తుంది. అంతేకాదు జుట్టుకు మంచి పోషణనందిస్తుంది.
- మందారాకును బాగా నూరి అందులో అలో జెల్, ఆలివ్‌ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి రాయాలి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. 

Popular Posts