Followers

Friday 13 September 2013

దీర్ఘకాలంగా భాదిస్తున్న దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి.....

*

 ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది.

* రెండు టీ స్పూన్‌ల నువ్వుల నూనెలో ఒక కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తాగితే నెలసరి క్రమబద్ధం అవుతుంది.

* కొన్ని తులసి ఆకులని దంచి రసం తీయాలి. ముఖం మీద గాని, చేతుల మీద గాని ఏర్పడ్డ తెల్ల మచ్చలపై ఈ రసాన్ని రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు మెల్లి మెల్లిగా తగ్గుముఖం పడతాయి.

* మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు వేయాలి. నాలుగు మిరియాలను పొడిగా చేసి ఇందులో కలపాలి. అన్నీ కలిపి 15 నిమిషాలపాటు మరగబెట్టి దింపేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల పొడి దగ్గు తగ్గడమే కాకుండా ఛాతీలో పట్టినటుగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది.

* కప్పు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి దింపి చల్లార్చాలి. ఇందులో కోడిగుడ్డులోని తెల్ల సొన కలుపుకుని తాగాలి. దీర్ఘకాలంగా బాధిస్తున్న దగ్గు తగ్గుతుంది.

Popular Posts