Followers

Saturday 21 September 2013

ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?


ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు 

ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , 

ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని 

పెద్దలు చెబుతున్నారు. 

అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, 

ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని 

పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో 

పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య 

నిపుణులు సూచిస్తున్నారు. 

 ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, 

జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక 

నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 

3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా 

ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా 

శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి 

పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల 

చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 

శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, 

మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు 

పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం 

మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన 

ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట 

వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం 

శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం 

చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట 

వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం 

శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ 

దోషం సాన్తిచ్చును

Popular Posts