Followers

Saturday 28 September 2013

హోమియో వైద్యం పుట్టుక


జర్మనీ దేశానికి చెందిన హనీమన్‌ వైద్యంలో పట్టా పుచ్చుకుని కొన్నాళ్ళ సాధన తర్వాత వివిధ భాషల్లో ప్రావీణ్యం పొందాడు. దానితో సైన్స్‌ వైద్య గ్రంథాలను వివిధ భాషల్లోకి అనువదిస్తూ అనువాదకుడిగా కూడా పని చేసాడు. అలా ఓసారి అనువాదం చేస్తుండగా మలేరియాకి సింకోనా బెరడు మంచి మందు అని చదివాడు. సింకోనా లక్షణాలే ఉన్న మరేవీ కూడా మలేరియాకి పనిచేయకపోవడంతో సింకోనాను తన శరీరంపైనే ప్రయోగించుకుంటూ పరిశోధన సాగించాడు. ఆ పరిశోధనలో తనలో మలేరియా లక్షణాలు రావడం గమనించి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సింకోనా తింటే చలిజ్వరం లక్షణాలు కనిపిస్తాయని తెలుసుకున్నాడు. అప్పుడు చలిజ్వరంతో బాధ పడే రోగికి అతి చిన్న మోతాదులో సింకోనా ఇస్తే రోగ లక్షణాలు ఉపశమించి, క్రమేపీ రోగం నయమవుతుందని కనుక్కొన్నాడు. ఒక మందు ఆరోగ్యవంతులలో ఎక్కువ మోతాదులో ఎలాంటి లక్షణాలను కలిగిస్తుందో అదే మందు తక్కువ మోతాదులో ఆ లక్షణాలను నయం చేయగలదని చెప్పాడు. ఈ సిద్ధాతంతోనే హౌమియోపతీని రూపకల్పన చేవాడు హనీమన్‌. ఆ తర్వాత ఎన్నో పరిశోధనలు చేసి 1810లో ఆర్గాన్‌ ఆఫ్‌ మెడిసిస్‌ అనే గ్రంధాన్ని ప్రచురించాడు. అలాగే 64 ఔషద లక్షణాలను విశ్లేషిస్తూ 1821లో మెటీరియా మెడికాపురా అనే గ్రంధం రాశాడు. హౌమియో వైద్య పితామహుడు హనీమన్‌ జన్మదినాన్నే ఏప్రిల్‌ 10 అంటే ఈ రోజున ప్రపంచ హౌమియో దినోత్సవంగా జరుపుతారు. 

Popular Posts