Followers

Friday 13 September 2013

ఆయుర్వేదం ప్రకారం కఫంలో తేడావల్ల మధుమేహం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులున్నాయి.

ఆయుర్వేదం గుర్తించిన అనారోగ్య కారకాలలో మొదటిది వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులు వంటి తదితర వ్యాధులు. వంశపారంపర్యంగా కాకుండా ఆరోగ్యపుటలవాట్లలో తేడావల్ల తలెత్తే వ్యాధులు ఉన్నాయి. నేటి ఆధునిక జీవితంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. 


ఆయుర్వేదం ప్రకారం కఫంలో తేడావల్ల మధుమేహం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులున్నాయి. మొదటగా ఆహారపుటలవాట్లు మార్చాలంటుందీ శాస్త్రం.

చక్కెర, పిండి పదార్థాలను ఆపి, ముడి బియ్యం, గోధుమ, ఓట్‌ల వంటి పదార్థాలను తినమంటుంది. మధుమేహం వచ్చిందని తెలియగానే చక్కెరలు, బియ్యం, బంగాళాదుంపలు, బెల్లం, చెరకు, తియ్యని పండ్లు వంటివన్నీ తీసుకోవడం తగ్గించాలి.

బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి, మరుసటి రోజు తేనెతో కలిపి రెండు మూడు దఫాలుగా తినాలి. జామ, జామ విత్తన పొడి తీసుకోవచ్చు. తాజా ఆకు కూరలు, పెసలు, సోయాను ఆహారంలో తీసుకోవచ్చు.

మెంతిపొడి రెండు స్పూన్లను పాలలో వేసుకుని తాగాలి. 15 నుంచి 20 తాజా మామిడాకులు ఒక గ్లాసు నీటిలో మరిగించి, ఆ రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగాలి. శరీరానికి పొటాషియం, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్సులు ఎక్కువగా చేరేలా ఆహారపదార్థాలు తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతి రోజూ ముదిరిన కరివేపాకు ఆకులు పదింటిని తినాలి. ఇలా మూడు నెలలపాటు పాటిస్తే... వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం, కాలేయ గ్రంథుల క్రియలు నియంత్రించబడతాయి. కాకర రసం లేదా నిమ్మ రసం తాగినా మేలు కలుగుతుంది.

Popular Posts