Followers

Friday 16 August 2013

పరుగు--ఆహారము , Food for running exercise



పరుగుకి సరితూగే వ్యాయామం మరొకటి లేదు. రోజూ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే రన్నర్లు ఆహారంలో కింది వాటిని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి .
 బాదం: వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. రోజూ పిడికెడు చొప్పున వారంలో అయిదు రోజులపాటు బాదం తినాలి. 
ఆరెంజ్‌: పరుగుతీసేవారు రోజూ ఒక కమలా లేదా 200మి.లీ. రసం తాగడం మరిచిపోకూడదు. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. అంతేకాదు దీన్లోని ఇనుము నిల్వలవల్ల అలసట, నీరసం దూరమవుతాయి. 

చిలగడ దుంపలు: పరుగెత్తేటపుడు చెమటతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు కూడా శరీరంనుంచి బయటకుపోతాయి. చిలగడ దుంపల్లో ఈ ఖనిజలవణాల నిల్వలు అధికస్థాయిలో ఉంటాయి. వారంలో మూడురోజులు ఈ దుంపల్ని తీసుకోవాలి.

 చేపలు: మిగతా వ్యాయామాలు చేసేవారితో పోల్చితే రన్నర్లకి(రోజూ 60-90 గ్రాములు) రెట్టింపు ప్రొటీన్లు అవసరమవుతాయి. వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవడంద్వారా వీరు తమకు అవసరమయ్యే ప్రొటీన్లను పొందొచ్చు. చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి కూడా. శాఖాహారులు మీల్ మేకర్ వంటి సోయాపోటీన్‌ ఉన్న పదార్ధాలు , అటువంటి ఆహారము తీసుకుంటే సరిపోతుంది . పప్పులు , చిక్కుడు గింజలు తో కూడిన ఆహారము తినాలి .

Popular Posts