Followers

Saturday 17 August 2013

బ్రహ్మచారి దానం పుచ్చుకోవచ్చా?


బ్రహ్మచారి దానం పుచ్చుకోకూడదు. అంతేకాక దానం యిచ్చినవారికి దోషం వస్తుంది. బ్రహ్మచారి నియమాలలో ముఖ్యమయినది విద్యాభ్యాసము. అందుచేతనే వేదంలో కూడా "భిక్షాచర్యంచర" " ఆచార్యాధీనోభవ" అని వున్నది. ఇది అందరూ ఆచరించవలసిన నియమమే. బ్రహ్మచారిగా వున్నకాలం అంతా గురువు ఆధీనంలో వుండాలి అంటే స్వతంత్రుడు కాడు అనేగా అర్ధం. స్వతంత్రుడు కానివాడు. గోదానమో, భూదానమో పుచ్చుకుంటే దానిని ఏమి చేయాలి? తానే గురువు మీద ఆధారభూతుడు అయినప్పుడు తాను బంధాలు పెంచుకోవడం తప్పుకదా! అందువలన బ్రహ్మచర్యంలో వుండగా దానం పుచ్చుకోకూడదు. బ్రహ్మచారికి దానం యివ్వకూడదు. గురువు ఒకవేల అంగీకరిస్తే పై నియమాలలో మార్పు సంతరించుకుంటుంది. గురువు అజ్ఞలేకుండా ఏవిధమయిన దాన ధర్మాలు పుచ్చుకోకూడదు.

Popular Posts