Followers

Sunday 4 August 2013

రామాయణము-పాత్రలు-ముఖ్యాంశాలు

శ్రీరామ
రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడే అయినప్పటికీ దైవశక్తిని వినియోగించకుండా మానవ శక్తితోనే దుష్ట శిక్షణ చేయడమే కాకుండా ఒక సాధారణ మానవుడుగా జీవించాడు. అరణ్యవాసం, భార్యావియోగం వంటి కష్టాలన్నీ అనుభవించాడు. రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ, అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం. ఈ సత్కార్యాలవల్ల సాధారణ ప్రజలు ఆయన బాటలోనే నడిచి సుఖ జీవనం సాగించే అవకాశం కలిగింది. అందుకే ఏ యుగానికైనా ఆయనే ఆదర్శ పురుషుడు.

రామాయణం అనగా?
రామ + అయనం = రాముని కథ.

దశరధ మహారాజుతో కలసి వేటకు వెళ్ళిన మంత్రి?
సుమంత్రుడు.

దశరధ మహారాజు యొక్క బాణానికి బలైనవాడు?
శ్రవణకుమారుడు.

రామ అను పేరు ఎందుకు పెట్టారు?
నారాయణ మంత్రానికి రెండవ అక్షరమైన "రా" ప్రాణము. అలాగే నమశ్శివాయ మంత్రానికి రెండవ అక్షరమైన "మ" ప్రాణము. అందుకే ఆ రెండు మంత్రాలలోని రెండు అక్షరాలను కలిపి, రెండు శక్తులను ఏక శక్తిగా చేసి "రామ" అనే పేరు పెట్టారు.

దశరధుడు శంబరాసురుడితో పోరాడుతూ మూర్చబోగా అతనిని రక్షించినవారు?
అతని భార్య కైక.

రాముడికి విలువిద్య నేర్పిన గురువు?
వశిష్ఠుడు.

ఏ రాక్షసులను సంహరించేందుకు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తనతో తీసుకెళ్ళాడు?
మారీచ సుబాహులు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని హతమార్చాడు. మానవాస్త్రంతో మారీచుని ఏడు సముద్రాల అవతల పడేట్లు ఎగరగొట్టాడు. (ఈ మారీచుడే తరువాత రావణాసురిని ఆజ్ఞ మేరకు బంగరు జింక రూపందాల్చి రావణుడు సీతను అపహరించేందుకు కారకుడయ్యాడు.)

అహల్య ఎవరు?
గౌతముడి భార్య. (శాపవశాత్తూ ఆమె రాయిగా మారడంతో రాముని పాద స్పర్శతో శాపవిమోచనం పొందింది.ఈ ఘట్టం రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణార్ధం వెళ్ళినప్పుడు జరిగింది.)

లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవరిని వివాహం చేసుకున్నారు?
జనకమహారాజు తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తి, ఊర్మిళ, మాండవిలను వివాహం చేసుకున్నారు.

పరశురాముని అసలు పేరు?
భార్గవరాముడు.

కైక దశరధుడి నుండి రెండు వరాలు ఏ సందర్భంలో పొందింది?
దశరధుడు శంబరాసురుడితో యుద్ధం చేస్తూ అతని ధాటికి తాళలేక మూర్చబోగా కైక అతడిని రెండుసార్లు రక్షించింది. ఆ సందర్భంగా దశరధుడు ఆమెను రెండు వరాలు కోరుకోమనగా సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని ఆమె అంది.

రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యలన్న కైక కోరికలోని ఉద్దేశం?
భరతుడి క్షేమం కోసం. రాముడు భరతుడిపై తిరుగుబాటు చేయవచ్చునేమోన్న అనుమానంతో రాజకీయాన్ని ప్రదర్శించింది.

వనవాసానికి బయల్దేరిన రాముడికి శృంగిబేరపురంలో ఎవరు ఆతిధ్యమిచ్చారు?
దశరధుడి మిత్రుడైన గుహుడు.

సీతా సమేత రామ లక్ష్మణులు వనవాసానికి బయల్దేరాక భరతుడు, కైక తదితరులు వారిని కలిసిన ప్రదేశం?
చిత్రకూటం.

రాముడు దండకారుణ్య ప్రాంతంలో ఎన్నేళ్ళు ఉన్నాడు?
పది సంవత్సరాలు.

గోదావరీ తీరాన పంచవటి ఆరామం అతి యోగ్యమైన స్థలమని శ్రీరాముడికి చెప్పినవారు?
అగస్త్య మహర్షి.

పర్ణశాల నిర్మించుకున్న ప్రాంతం?
పంచవటి.

బంగరు లేడి రూపంలో పర్ణశాలకు వచ్చినది ఎవరు?
గతంలో విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా ఆ యాగ ధ్వంసానికి పూనుకుని శ్రీరాముడి శరాఘాతానికి దూరంగా విసిరివేయబడిన మారీచుడు.

జటాయువు (పక్షిరాజు) ఎవరు?
దశరధుడి మిత్రుడు.

రావణుడు తనను ఆకాశమార్గంలో ఎత్తుకుపోతుండగా సీత తన నగలమూటను ఏ ప్రాంతంలో జారవిడిచింది?
ఋశ్యమూకంలో.

సీత నగల మూటను అందుకుని భద్రపరచినవాడు?
ఆంజనేయుడు.

ఋష్యమూకంలో కాలుపెడితే తల వెయ్యి వక్కలవుతుందని వాలికి శాపమిచ్చిన వారెవరు?
మాతంగముని.

సుగ్రీవుని భార్య పేరు?
రమాదేవి.

రంభను బలాత్కరించబోయిన రావణునికి మరే స్త్రీనైనా బలాత్కరిస్తే అతని తల వేయి వక్కలవుతుందని శాపమిచ్చిన వారెవరు?
నలకూబరుడు.

రాముడు, హనుమంతుడు మొట్టమొదటిసారి కలుసుకున్న ప్రదేశం?
ఋశ్యమూక పర్వతం.

రాముడు హనుమంతుని దేని ఆధారంగా గుర్తించాడు?
హనుమంతుని కంఠమునందున్న కాంచన హారాన్ని చూసి.(కాంచన హారం రాముడికితప్ప మరెవరికీ కనిపించదని బ్రహ్మ హనుమంతునికి చెప్పి ఉండడంతో అప్పటివరకు తన ఏలిక కోసం ఎదురుచూస్తున్న హనుమంతుడి ఆశ ఫలించింది).

అంగదుడు ఎవరి కుమారుడు?
వాలి కుమారుడు.

సీత తన ఆనవాలుగా రామునికిమ్మని ఏ ఆభరణాన్ని హనుమంతుడికిచ్చింది?
చూడామణి.

వాలి సుగ్రీవుల గదా యుద్ధం జరిగిన ప్రదేశం?
కిష్కింధ కొండ ప్రాంతం.

లంకాధిదేవత ఎవరు?
లంకిణి.

లంకిణికి బుద్ధిచెప్పినవాడు?
హనుమంతుడు.

త్రిజట ఎవరు?
విభీషణ పుత్రి.

సీత తన ఆనవాలుగా రామునికిమ్మని ఏ ఆభరణాన్ని హనుమంతుడికిచ్చింది?
చూడామణి.

రావణుని చిన్న కుమారుడు?
అక్షకుమారుడు.

అక్షకుమారుడిని నేలకేసికొట్టి చంపినవాడు?
హనుమంతుడు.

రావణుని పెద్ద కుమారుడు?
ఇంద్రజిత్తు (మేఘనాధుడు).

ఇంద్రజిత్తును చంపినవాడు?
లక్ష్మణుడు.

రావణుడి తల్లి?
కైకసి.

రావణుడి భార్య?
మండోదరి.

Popular Posts