Followers

Friday 9 August 2013

తెలుపు జుట్టు నివారించడానికి చిట్కాలు

ఎండు ఉసిరి ఒక కప్పు , రెండు కప్పుల పెరుగు తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి . మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి . ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా  చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది 

ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి . ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల హన్నా పొడి , గుడ్డు సోన , నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తరువాత తల స్నానం చేయాలి .

సరిపడా హెన్నా , గుడ్డు సోన , అర చెక్క నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ ఇన్ స్టంట్ కాఫీ పొడి వేసీ బాగా కలపాలి . ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45  నిమిషాలా తరువాత కడిగేయాలి .

Popular Posts