Followers

Sunday 25 August 2013

ప్రశాంతతకు పూజగది అలంకరణ

ప్రశాంతతకు పూజగది అలంకరణసాధారనంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం మన భారతీయుల ఇల్లలో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి భారతీయుడు తమ ఇంట్లో ప్రత్యేకంగా పూజ కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడడం చాలా ఇళ్లలో ఆనవాయితీ. దీని వల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. పూజ గదిని శుభ్రంగా కొద్దిగా శ్రద్ధ పెడితే మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. పూజగదికి అనుకూలమైన దిక్కు ఈశాన్యం. 

1. పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్‌ కలర్‌ షెడ్‌ లు ఉండే విధంగా ఎంచుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూగ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు టైలు ఎల్లో (పసుపు) పింక్‌ (లేత గులాబి) లైట్‌ బ్లూ కలర్స్‌గా బాగా ఉంటాయి.

 2. పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈమండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌ లో మార్బల్‌, ఇత్తడితో పాటు గ్రైనేట్‌ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంకరించాలి. 

3. మండాపాల ఎంపిక తర్వాత చేయాల్సిన పని దానికి తగ్గ విగ్రహాల ఎంపిక. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. చక్కతో చేసిన విగ్రహాలైతే నయం. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు.

 4. పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్‌ తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవ్చు.

 5. గోడలకు స్టయిల్‌గా ఉండే గాజుతో తయారు చేసిన షెల్ఫ్‌ ను ఏర్పాటు చేసుకుని దానిపై కూడా దేవుని విగ్రహాలతో పాటు, దేవుని ఫోటోలు ఉంచుకోవచ్చు

. 6. పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీపస్తంభాలు మార్కెట్లో వివిధ షేప్‌లలో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజగదికి మరింత అందం చేకూరుతుంది. 

7. వెండితో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజసా మగ్రిని ఉంచుకోవచ్చు. 

8. పూజ గదిలో పూలు లేవంటే చాలా కొరతగానే కాదు పూర్తిస్థాయిలో పూజలేనట్లే... కాబట్టి కాలాన్నిబట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు దొరుకుతాయి. రోజుకోరకం పూలను వాడుకోవచ్చు.

Popular Posts