Followers

Tuesday 20 August 2013

వడదెబ్బ తగిలితే...


1.వడదెబ్బ తగిలినప్పుడు దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. 

2.శరీరాన్ని వెంటనే చల్లబరచాలి. అందుకోసం శరీరంపై నీళ్లు పడేలా చేస్తూ ఫ్యాన్‌తో చల్లటిగాలి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ప్రక్రియను ఇవాపరేటివ్ కూలింగ్ అంటారు. 

3.శరీరాన్ని తడిగుడ్డతో కప్పి ఉంచాలి. దీనిని కూలింగ్ బ్లాంకెట్ అంటారు. 

4.జ్వరం వచ్చినప్పుడు మనం ఉపయోగించే పారసిటమాల్ మందులు వడదెబ్బ వల్ల కలిగే జ్వరాన్ని తగ్గించవని గుర్తుంచుకోండి. 

5.శరీరం కోల్పోయిన లవణాలను, ద్రవాలను అందించడానికి ఐవీ ఫ్లుయిడ్స్ ఇవ్వాలి. 

6.అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది.

Popular Posts