Followers

Sunday 4 August 2013

భాగవతం-ముఖ్యాంశాలు

శ్రీకృష్ణ
శ్రీకృష్ణుని నిర్యాణమనంతరం కలి ప్రవేశించిన కాలమది. బదరికాశ్రమమంలో వ్యాకులచిత్తుడై ఉన్నాడు వ్యాస మహర్షి. నారాయణ మంత్రాలాపాన చేసుకుంటూ ఆశ్రమానికొచ్చిన నారద మహర్షి వ్యాసుడు వ్యధాభరితుడై ఉండటాన్ని గమనించి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ కృష్ణ భగవానుని లీలా వర్ణన గావించమని, భాగవత పఠనం, స్మరణం ముక్తి మార్గమనీ, దాన్ని రచిస్తే అది అతని మనో వ్యాకులతను పోగొట్టడమేగాక ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుందనీ ఉపదేశించడంతో వ్యాసుడు భాగవత రచనకు పూనుకున్నాడు. వ్యాసుడు దీనిని మొదట తన కుమారుడైన శుక యోగిచే చదివించాడు. శుకుడు దీన్ని గంగా తరంగిణీ మధ్యస్థాన నిలిచి, విరక్తమనస్కుడై ఉన్న పరీక్షిత్తు మహారాజు కోరగా చెప్పాడు.



భాగవతమంటే?
భగవంతుని కథే భాగవతం.

శుకుడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు?
భాగవతం ముక్తిప్రదాయిని గనుక అటువంటి ముక్తిని ఆశించి దాన్ని అభ్యసించాడు.

అభిమన్యుడు, ఉత్తరల కుమారుడెవరు?
విష్ణురాతుడు. తల్లి కడుపులో ఉన్నపుడే సర్వం విష్ణుమయం అన్న పరీక్షలో ఉత్తీర్ణుడైనందున అతడికి పరీక్షిత్తు అనే పేరు వచ్చింది. ఇతను హస్తినాపురాధిపతి.

పరీక్షిత్తుని కొడుకు?
జనమేజయుడు.

పరీక్షిత్తు ఏ మునిపై చచ్చిన పామును విసిరాడు?
శమీక మునిపై.

శమీక ముని కుమారుడు?
శృంగి.

పరీక్షిత్తు ఏ మునిపై చచ్చిన పామును విసిరాడు?
శమీక మునిపై.

శమీక ముని కుమారుడు?
శృంగి.

తపో దీక్షలో ఉన్న తన తండ్రిపై చచ్చిన పామును విసిరిన పరీక్షిత్తుని ఏడు దినాల్లో సర్పరాజైన తక్షకుడు కాటువేయుగాక అని శృంగి శపిస్తాడు. ఇది కలి ప్రభావం. కానీ తండ్రి తప్పుపట్టడంతో పశ్చాత్తాపంతో క్రుంగిపోతాడు. ఐతే శాపవిమోచన శక్తి అతనికి లేకపోవడంతో అది తెలిసిన పరీక్షిత్తు గంగ తీరాన ప్రాయోపవేశం చేయాలనుకుంటాడు. ప్రాయోపవేశ స్థలానికి వ్యాసుడు, అగస్త్యుడు, వశిష్టుడు, భృగుడు, భరద్వాజుడు, గౌతముడు మొదలగు మహర్షులు, బృహస్పతి, నారదుడు వంతి రాజర్షులూ వస్తారు. శుక మహర్షి వచ్చి పరీక్షిత్తు సిద్ధి పొందేందుకు భాగవత కథలను వినిపిస్తాడు.

భాగవత కథలలోని పాత్రల పరిచయాలు ఇతర వివరాలు :
ధృవుని తండ్రి?
ఉత్తానపాద మహారాజు

తల్లి?
సునీత.

ధృవుని భార్యలు?
భ్రమ మరియు ఇల.

హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల పుట్టుక?
కశ్యపుని భార్య దితికి వేళకానివేళ కామవాంచ కలిగింది. సంధ్యవేళ తగదు అని భర్త హెచ్చరించినా ఆమె వినలేదు. ఫలితంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు భయంకరాకారాలతో పుట్టారు. కారణం : పగలూ, రాత్రీ కాని సందివేళ లయకారుడైన శివుడు ప్రళయ రుద్రుడిలా జుట్టు విరబోసుకుని, బూడిద పూసుకుని, మూడు కళ్ళూ తెరుచుకుని ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ వేళప్పుడు సంగమిస్తే పుట్టే పిల్లలకు శుభం కాదు. ఆ సమయంలో దీపారాధన, దైవ ధ్యానం తప్ప ఏ పనీ చేయరాదు.

జయ విజయుల జన్మలు ఎన్ని? అవి ఏవి?
తొలి జన్మలో కశ్యపుడు-దితిలకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగానూ; మలి జన్మలో కైశికి-విశ్రవసులకు రావణ, కుంభకర్ణులగానూ; మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగానూ జన్మించారు.

హిరణ్యకశిపుని భార్య?
లీలావతి.

బలి చక్రవర్తి ఎవరు?
ప్రహ్లాదుడి మనవడు.

బలి చక్రవర్తి భార్య?
వింధ్యావళి.

బలి చక్రవర్తి అమరావతిని ఎందుకు ముట్టడించాడు?
స్వర్గంపై దండెత్తి అమృతభాండాన్ని తెచ్చుకోవాలని.

వామనుడి తల్లిదండ్రులు?
అదితి, కశ్యపులు.

పరశురాముని తల్లిదండ్రులు?
జమదగ్ని, రేణుక

కామధేనువును జమదగ్ని ఆశ్రమం నుంచి బలవంతంగా తీసుకుపోయిన రాజు?
కార్తవీర్యార్జునుడు.

కార్తవీర్యార్జునుడిని సంహరించినవాడు?
పరశురాముడు (జమదగ్ని కొడుకు)

Popular Posts