Followers

Saturday 17 August 2013

కలియుగంలో దైవదర్శనం జరగడం సులభమా?


అతి సులభము. కృత , త్రేతా, స్ద్వపర యుగాలలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవద్దర్శనం పొందినటులు వున్నది. కలియుగంలో భగవద్దర్శనం పొందినవారు అనేకులు, త్యాగయ, పోతన, కాళిదాస, విక్రమార్క , ఆదిశంకరుల వంటివారు అనేకులు/ వీరు అయఃఅప్రయాణం అందరికీ వంద సంవత్సరములలోపే. అందులోను ఆది శంకరులు తన ముప్పదిరెండు సంవత్సరాల జీవితకాలంలో తాను భగవంతుని చూచి తనతల్లికి కూడా చూపించగలిగారు. విష్ణుపురాణంలో కలియుగ విశిష్టతలను తెలిపే అద్యాయాలలో కలియుగంలో భగవద్దర్శనం చాలా సులభమని లక్ష్యం ప్రధానం అనీ తెలుపబడినది. అంతేకాక స్త్రీలకు శూద్రులకు కలియుగంలో త్వరగా భగవద్దర్శనం చాలా సులభంగా కాగలదని విష్ణుపురాణంలో తెలుపబడినది. అందువలన సాధన ప్రారంభిస్తే ఏదైనా సాధించవచ్చు. అన్నిటికీ నిష్కల్మషమయిన మనసే ప్రధానం.

Popular Posts