Followers

Sunday 21 July 2013

అయ్య అన్నా, అప్ప అన్నా తండ్రి అనే అర్ధం.

అయ్య అన్నా, అప్ప అన్నా తండ్రి అనే అర్ధం. అయ్యప్ప దీక్ష అనేది పితృస్వామ్య వ్యవస్థకి చెందిన పండుగగా అనిపిస్తుంది. ఈ పండుగలో ేకవలం భక్తిమాత్రమే కాకుండా, టూరిజం, నియమనిష్టలు, ట్రెక్కింగ్‌, అటవీ సందర్శనం వంటి ఎన్నో ఉత్కంఠ భరితమైన అంశాలు ఇమిడి ఉన్నారుు. ముఖ్యంగా దీక్షలో ఉన్న భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు వారిని క్రమశిక్షణ మార్గంలో పెడతారుు. అయ్యప్ప భక్తుల్లో వేరువేరు ఆర్ధిక స్థారుులకు చెందిన భక్తులు ఉండటం అందుేక జరుగుతోందని చెప్పవచ్చు. ఇది పితృస్వామ్య వ్మవస్థ తాలూకు పండగ అని చెప్పడానికి మరో ఉదాహరణ. ఈ దీక్షలో స్ర్తీలకు అంతగా ప్రాముఖ్యం లేకపోవడమే! పూర్వం అయ్యప్ప ఆలయంలోకి స్ర్తీలను (పిల్లలను కూడా) అనుమతించేవారు కాదు. అరుుతే ఇప్పుడు పరిస్థితులు మారడంతో బాలికలను, వయోవృద్ధులైన మహిళలను అనుమతిస్తున్నారు. ఇది విపరీత ప్రాచుర్యం పొందడానికి అన్ని కులాలను సమంగా ఆదరించడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. వేరే హిందూ ఆలయాల్లో అగ్రకులాధిపత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయ్యప్ప ఆలయాల్లో ఈ విధమైన వేర్పాటు ఉండదు. ఈ దీక్షల ఆంతర్యం కూడా మనిషి మనుగడని ఆరోగ్యవంతంగా ఉంచడమే.

అయ్యప్ప ఎవరు..!
Unti52హరిహర సుతుడుగా అయ్యప్ప అవతరించినట్టు చరిత్ర చెపుతుంది. అయితే ఒకప్పటి కాలానికి వెడితే, విష్ణువుని ఆరాధించే వారిని వైష్ణువులని, శివుణ్ణి ఆరాధిం చేవారిని శైవులని, బ్రహ్మని ఆరాధించే వారంతా బ్రాహ్మణులని వర్గీకరణ జరిగింది. అయితే శృష్టిస్థితిలయ కారకులుగా రూపుదిద్దుకున్న ఆ పరమేశ్వరుని రూపాన్ని , భగవంతుడు ఒక్కడే అనే నిజాన్ని విస్మరించి, ఈ త్రిమూర్తులలో ఎవరు ఎక్కువ అనే తత్వం ఈ మూడువర్గాల్లోనూ తలెత్తింది. విష్ణువే ఎక్కువ అని వైష్ణవులు, శివుడే ఎక్కువ అని శైవులు వాదించుకోవడం మొదలు పెట్టి, హత్యలు చేసుకునే స్థితికి చేరుకున్నారు. బ్రాహ్మణులు ఇద్దరి మధ్య మీమాంశలో పడి కొందరు వైష్ణువుల్లోను, అత్యధిక శాతం శైవుల్లోను కలిసిపోయారు. 

శైవుల మధ్య వైష్ణవుల మధ్య విపరీతంగా పెరిగిపోయిన విబేధాల వల్ల రక్తపాతం జరుగుతూవుండేది. హిందూ సమాజం అస్తవ్యస్థంగా మారింది. చివరికి విష్ణుభక్తులు పెట్టుకునే నామాలు కూడా శైవులు నాకి అవమానించేవారు. ఆ కోపావేశంలో శైవుల్ని హత్యచేయడానికి విషం కలిపిన నిలువునామాలు పెట్టు కునేవారు. వీరి నామాలు నాకిన శైవులు విషప్రభావంతో మరణించేవారు. ఎవరికి వారు మా మతం గొప్పదంటే, మా మతం గొప్పది అంటూ ఆధిపత్యపోరు నిరంతరం సాగిస్తూవుండటంతో సమాజంలో అశాంతి ప్రబలిపోయింది. 

సాధారణ ప్రజానీకం కూడా ఎవరు ఏమీటో తెలియని వాతావరణంలో కుమ్ములాటలకి దిగడం పరిపాటిగా మారింది. చివరికి రాజవంశాల్లో కూడా ఇదమిద్ధంగా సరైన అవగాహన లోపించడంతో రారాజులు, మహారాజులు కూడా ఈ విషయంలో నిర్లిప్తధోరణి పాటించారు. సమైక్యతకి కొందరు ప్రయత్నించినా ఫలితం అంతగా కనిపించలేదు. ఇంతటి అస్థిర పరిస్థితిని అదుపుచేసి, సుస్థిర సమాజస్థాపనకోసం హరిహరులు ఒక్కరే అని చేప్పే నేపథ్యంలో హరిహర సుతుడుగా ఇద్దర్నీ ఏకంచేస్తూ ఉద్భవించినవాడే అయ్యప్ప. 

అయ్యప్ప చరిత్ర
ఏ పురాణేతిహాసాల్లోను మనకి తెలిసినంతవరకూ అయ్యప్ప ప్రస్తావన ఉండదు. అయితే భస్మాసురుని సంహరించడంకోసం శ్రీహరి జగన్మోహినిగా అవతరించడం, భస్మాసురుడికి వరాన్ని అనుగ్రహించి తన నెత్తిమీదికి తెచ్చుకుని కష్టాల్లో పడిన పరమ శివుణ్ణి రక్షించడం, జగన్మోహినిగా ఉన్న శ్రీహరిని చూసి శివుడు మోహించి కొంతకాలం తనతో దాంపత్యం చేయడం, ఆ దాంపత్య కారణంగా ఒక బాలుడు పుడతాడు. అవతార పరిసమాప్తం అవుతున్న సమయంలో ఆ కుర్రవాణ్ణి శివకేశవులు ఒంటరిగా ఆ అడవిలో విడిచి పెడుతూ, ఇతర జంతుజాలంతో ఇతనికి ఎటువంటి ఆపదా కలుగకుండా రక్షగా మెడలో ఒక మణిని వేసి ఇద్దరు తమ లోకాలకు వెళ్ళిపోతారు. అక్కడితో ఆ ఇతిహాసం పూర్తవుతుంది. అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు వేటకు రాగా ఆ అడవిలో హరిహరులకు పుట్టిన కుర్రవాడు ఒంటరిగా దొరకుతాడు. 

పిల్లలు లేని ఆ మహారాజు ఆ కుర్రవాణ్ణి దైవప్రసాదంగా భావించి తన రాణి చేతిలో ఉంచి, మణిసహితంగా దొరికిన కారణంచేత మణికంఠుడు అనే నామకరణం చేస్తారు. యుక్తవయసు వచ్చిన మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలన్న తలంపుతో అతనిని సంప్రదించగా, అందుకు మణికంఠుడు తాను ధర్మసంస్థాపనకోసమే పుట్టిన కారణంచేత, తన తరువాత ఆ రాజదంపతులకు కలిగిన సంతానానికే పట్టాభిషేకం చేయమని, తాను బ్రహ్మచారిగా అడవికి పోయి తన అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తాననీ చెప్పి, రాజ్యత్యాగం చేసి శబరిగిరిని చేరతాడు.అక్కడి నుంచి హరిహర సుతుడుగా, అయ్యప్పగా, ధర్మశాస్తగా పిలవబడుతూ, అవతార విశేషం పూర్తి అవ్వగానే అదే శబరిగిరి మీద వెలిసి ఇప్పుడు అందరి పూజలూ, సేవలూ అందుకుంటున్నాడు. 

దీక్ష పరమార్ధం 
ay58సాధారణంగా మానవ శరీరానికి ఏదైనా అలవాటు చేసుకోవాలన్నా , విడిచిపెట్టాలన్నా యోగ, ఆయుర్వేద వైద్యశాస్త్ర పరంగా కూడా 41 రోజులు పడుతుంది. అది శరీర ధర్మం. దురల వాట్లకు లోనైన భక్తులు ఈ దీక్షాసమయంలో అన్నిటినీ విడిచిపెట్టి, అయ్యప్ప సేవలో నిరం తరం గడుపుతారు. కన్న తండ్రివద్ద దురలవాట్లకు లోనైన కుమారుడు ఎంత భయభక్తులతో ఉంటాడో అదే విధంగా (ఈ తెలుగు అయ్య దగ్గర, తమిళ అప్ప దగ్గర, అంటే అయ్య అన్నా, అప్పా అన్నా ‘నాన్న’ అనే కదా అర్ధం!) అయ్యప్ప దగ్గర అంతే వినయ విధేయతలతో ఈ మం డలం రోజులు దీక్షతో గడుపుతారు. దీని వల్ల అయ్యప్ప స్వామికి ఒరిగేదేమీ ఉండదు. అది మనకే ఎంతో ఫలితాన్నిస్తుంది. 

అప్పటి వరకూ వున్న దురలవాట్లు పోయి శరీరం నూతన తేజస్సుని సంతరించుకుంటుంది. ఆరోగ్యవంతు నిగా సంపూర్ణాయుర్ధాయాన్ని ప్రసాదిస్తుం ది. అయితే దీక్షా విరమణానంతరం చాలామంది భక్తులు తిరిగి వారి గత అలవాట్లను మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. ధూమపానం, మధుపానం వంటి ఇతర వ్యసనాలకు బానిసలుగానే ఉంటున్నారు. ఏదో దేవుణ్ణి ఉద్దరించడానికి ఆ నలభై ఒక్క రోజులు గొప్ప దీక్ష పట్టినట్టు భ్రమ పడుతున్నారు. ఇటువంటి భక్తుల్ని అయ్యప్ప ఎప్పుడూ కోరుకోలేదు. కనీసం ఈ దీక్షతో శారీరకంగా పవిత్రుడయిన మానవుడు ఇప్పటి నుంచైనా తనలాగే ధర్మపథంలో ప్రయాణిస్తాడని, అతని ద్వారా మరింత ధర్మ సంస్థాపన జరిగితే తన ఆశయం యుగాంతం వరకూ కొనసాగుతుందని, కామ, క్రోధాదిగా గల 18 రకాల దర్గుణాల్ని ఒకొక్కటిగా విడిచి ప్రతి భక్తుడు ఆ 18 సోపానాలు ఎక్కి తనంతటి వాడు కావాలన్నదే అయ్యప్ప ఆశయం. 

అందుకే ఈ దీక్షలోని పరమార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి ఈనాటి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులంతా, ఆయురారోగ్యాల్ని పొంది, సమాజంలో ధర్మమార్గాన వారు సంచరిస్తూ, మరింత మందికి మార్గదర్శకులు కావాలన్నదే అందరి కోరిక..! స్వస్తి.

అయ్యప్ప పరిచయం..
ఇక అయ్యప్పని లోకానికి అందించిన మహాపురుషుడు జగద్గురు ఆదిశంకరులవారు. శైవ, వైష్ణవ సమ రాన్ని అదుపుచేసి, ఈ రెండు మతాలనీ ఏకంచేసి, అగమ్యగోచరంగా అయోమయస్థితిలో ఉన్న సమాజాన్ని ఒక తాటిమీదకి తేవడంలో అధె్వైత మత స్థాపనచేసి శంకర భగవత్పాదులు కృతకృత్యులయ్యారు. అక్కడితో ఎన్నో దశాబ్ధాలుగా ఆధిపత్య పోరుతో సతమతమైన రెండు వర్గాలు శాంతించాయి. అదె్వైతం బహుళ ప్రచారంలోకి వచ్చి సర్వమానవులకు ఆచరణయోగ్యంగా ఉండటంతో దానినే యావత్‌ హిందూ మతం ఆమోదించింది, ప్రతిపాదించింది, ఆచరించడం మొదలుపెట్టింది. 

దానితో శైవ, వైష్ణవ వర్గాల ప్రాబల్యం పూర్తిగా తగ్గడంతో అందులో కొందరు అదైత సిద్ధాంతాలని అనుసరించ డానికి మొగ్గుచూపగా, అందుకు ఇష్టపడని కొందరు మౌనంగా వారి అభిమతానికి కట్టుబడి జీవించడం అలవాటుచేసుకున్నారు. లోక కల్యాణం జరిగింది. మతం కన్నా, మనుషుల కన్నా, శాస్త్రాల కన్నా సర్వేశ్వరుడొక్కడే నిరంజన, నిరామయ, నిర్వికల్ప, నిరాకారుడుగా, జ్యోతి స్వరూపుడిగా లోకం అంగీకరించింది. అలా అంగీకరింపచేయడంలో ఆది శంకరులవారు ఎన్నో పరీక్షలకు నిలిచి భాష్యాల్ని రచించి, మత సిద్దాంతాల్ని ఏర్పరచి, తిరిగి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా దేశం నలుమూలలా పీఠాలు నెలకొల్పి నిరంతర సనాతన ధర్మ ప్రచారంలో ఈ మఠాలు నడవాలని శాసించారు.

Popular Posts