Followers

Thursday 18 July 2013

దక్షిణ తిరుమల, ఆంబోతు తిరుమల అంటారు

Marteru

      దీనిని దక్షిణ తిరుమల, ఆంబోతు తిరుమల అంటారు. విశాల మైన ప్రాంగణము పెళ్ళిళ్ళకోసం రెండు అంతస్తులలో పైన ఒకటి క్రింద ఒకటీ రెండు విశాలమైన కల్యాణ మండపములు కలవు. ప్రతి సంవత్సరము శ్రీ రామ నవమి తరువాత వచ్చే మత త్రయ (వైష్ణవ) ఏకాదశి రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణముతోడను ఇక్కడకూడా వైఖానస ఆగమన పధ్దతిన అభిశేకము, అంకురార్పణ, ద్వజారోహణమూ, పెళ్ళికుమారుని చేయుట, కల్యాణము, చక్రస్నా నము, గర్భాదానము అనే వరుసలో ఐదు రోజుల పాటు యజ్ఞ హోమాలతో సంపూర్ణ కళ్యాణమహో త్సవాలు జరుపుతారు. ఈ క్షేత్రము నందు శ్రీనివాసుని కళ్యాణము జరిపించు దంపతులు అలోకిక మైన ఆధ్యాత్మికానుభూతిని పోందెదరు. కళ్యాణమురోజు ఉద యము ఆంబోతు ను ఉరేగించి అతి వైభవముగ ఉత్సవములు నిర్వహిస్తారు. మూడు రోజులు ఇక్కడ జరిగే తీర్ధము లేదా తిరునాళ్ళు చూసేందుకు మరియు దాదాపు నాలుగు గంటలపాటు కాల్చబడు చిత్రవిత్రమైన బాణాసంచా ప్రదర్శన కొరకు వేలాదిగా జనం తరలివస్తారు.

శ్రీ వరాహస్వామివారి దేవస్థానం
ఇది ఊరిలో గల పురాతన దేవస్థానము. వెంకటేశ్వరస్వామివారి దేవాలయము ప్రక్కనే దాదాపు అంతే విస్తీర్ణము కలిగిన దేవాలయము. ఇందులో కూడా ఒక కల్యాణ మండపము కలదు. ఈ దేవాలయములోని ప్రతి గోడపై రంగులతో చిత్రించిన వెంకటేశ్వర కల్యాణ ఘట్టములు బహు సుందరముగా ఉండును.
శ్రీ సోమేశ్వరస్వామివారి దేవస్థానము మార్టేరుకు చివరలో నెగ్గిపూడికి దగ్గరలో గల పురాతన శివాలయము.

శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయము
మార్టేరు ప్రధాన కూడలిలో వంతెన ప్రక్కగా కలదు. ఈ దేవాలయమునకు జనవరి, 2006 న ప్రతిష్టా మహోత్సవము నిర్వహించారు.

శ్రీ మావుళ్ళమ్మ దేవాలయము
ఇది మార్టేరు మరియు అత్తిలి మార్గములో వెలగలేరుకు సమీపాన గలదు. ఇటువైపుగా పోయే ప్రతివారూ తప్పక ఆగి దర్శించుకొనే ఆలయము. వాహనదారులు మొదటి ట్రిప్పు ఇక్కడ పూజతో ప్రారంబిస్తే లాభిస్తుందని నమ్ముతారు. ఈ దేవాలయ సమీపానే సంతోషిమాత ఆలయము, గ్రామదేవత పోలేరమ్మ వారి దేవాలయములు కలవు. ఇవి కాక పాలకొల్లు మార్గములో వల్లీసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము, షిరిడీసాయి, కనకదుర్గ ఆలయాలు ఉన్నవి.

Popular Posts