Followers

Wednesday 10 July 2013

న్యాయ మార్గమే ధర్మపథం


అనాదిగా మానవుల మధ్య సంఘర్షణ, వైరం, దేషం, అసూయ మొదలైనవి నివారించడానికి, రాక్షస ప్రవృత్తిని అణగదొక్కడానికి మహర్షు, తాత్త్వికులు ధర్మబద్ధమైన జీవితాన్నీ, జీవన విధానాలనీ బోధించారు. నాలుగు వేదాల్లో ఉన్న సారాన్ని గమనిస్తే దైవాంశ సంభూతమైనదీ, మహోన్న తమైనదీ మానవ జీవితం. దైవశక్తి, దైవ ప్రేరణ వల్ల మానవుల జీవితాలు ఏ విధంగా నడవాలో తెలియ జెప్పేవీ, ఆచరించ దగినవీ, ఆచరించకూడనివీ అన్నీ వేదాల్లో ఉన్నాయని అర్థమౌతుంది. భగవంతు డే ధర్మ సంస్థాపనార్థం స్వయంగా భూలోకంలో అవతరిస్తానని తెలియజేసాడు. ధర్మబద్ధమైన జీవితం ఎప్పుడూ న్యాయ సమ్మతంగా ఉంటుంది. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందనీ, అన్యాయం ఎప్పటికైనా ఓటమి పాలవు తుందనీ, మన పురాణ గాధలు, కథలు, ఇతిహాసాలు చెపుతున్నాయి. అందుకే ‘యతో ధర్మస్తతో జయః’ అని అందరూ గుర్తించారు. అయితే ధర్మానికి గెలుపు, ఓటమిలతో సంబంధంలేదు. ఇక్కడ ధర్మం జయించింది అంటే న్యాయమే గెలిచింది అని అర్ధం చేసుకుటే మంచిది.

F2afన్యాయం ఎప్పుడూ ఒకరి పక్షాన్నే ఉండదు. ఎవరికి తోచింది వారికి న్యాయం అనిపిస్తుంది. కానీ, న్యాయం కోసం ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు - ‘తీర్పు’ అనేదదది మూడో వ్యక్తి ద్వారా లేదా వ్యవస్థ ద్వారానో వెలువడుతుంది. ఆ ‘తీర్పు’ న్యాయ పోరాటానికి తెర దించుతుంది. సమస్యను పరిష్కరిస్తుం ది. ఆ మూడో వ్యక్తి అధికారి అయిన జడ్జి కావ చ్చు లేదా న్యాయం తెలిసిన పెద్ద మనిషైనా కావచ్చు. ఈ ‘తీర్పు’కు కట్టుబడినవారు న్యాయాన్ని గౌర వించినట్టే. తీర్పు రుచిం చని వారు ‘అంతిమ తీర్పు’ కోసం పోరాటం కొనసాగి స్తూనే ఉంటారు. అందుకే నేటి లోయర్‌ కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులు - ఇలా న్యాయవ్యవస్థకు బాసటగా నిలుస్తున్నాయి. 

మన తెలుగునాట సంప్రదాయబద్దంగా వివిధ న్యాయ సూత్రాలు వర్గీకరించిన విషయం అందరికీ విదితమే. అవి మొత్తం 230 సూత్రాలు. ఇవన్నీ మనం నిత్యం చూస్తున్న సాధారణ విషయాలకు, చిన్న చిన్న సమస్యల కు, సందేహాలకు సమాధానాలగా కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి క్షీర నీర న్యాయము, కుంభదీప న్యాయము, మార్జాల కిశోర న్యాయము, అభావ విరక్తి న్యాయము, కూపస్థ మండూక న్యాయ ము మొదలైనవి. అయితే ఈ న్యాయాన్ని ఉదహరించి అనుసరించి, ఎవరూ తీర్పు చెప్పిన దాఖలాలు లేవు. 

శాంతి, అహింస, గౌరవ మర్యాదలకు ఆలవాలమైన భార తదేశం పురాణకాలం నుండీ న్యాయ వ్యవస్థకు అగ్రతాం బూలం ఇస్తూనే ఉంది. న్యాయం కోసం, ధర్మం కోసం, మహారాజులు రాజ్యాలు వదిలి అడవులకి వెళ్ళిన కథలు న్నాయి. భార్యను, సంతానాన్నీ వదిలి కష్టాలనుభవించిన మహారాజుల చరిత్రలూ ఉన్నాయి . యుద్దాలు చేసిన మహారాజులూ ఉన్నారు. అంతిమంగా దైవానుగ్రహం కూడా న్యాయం వైపే ఉంటుంది. దీనికి ఉదాహరణ కౌరవ పాండవుల యుద్దం. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ పాండ వులకు అండగా ఉండి న్యాయాన్ని గెలిపిస్తాడు. అందుకే 

‘యాంతి న్యాయ ప్రవృత్తస్య
తిర్యంచోపి సహాయతామ్‌
అపంథానంతు గచ్ఛంతమ్‌
సోదరోపి విముచ్యగి అన్నారు.
న్యాయము తప్పకుండిన జనంబులకున్‌ మృగజాతులేనియున్‌
సాయమొనర్చు, పో విడుచు,
చయ్యన సోదరుడైన గూడ నా
న్యాయ సమేతు తోడుప కపి మూకలు,
పూజ్య రామ భూ
నాయకుజేరి అన్న అయినన్‌ దశకంఠువిడెన్‌ తగ తమ్ముడేనియున్‌


అన్యాయం ఎప్పుడూ దురాశనీ, అసూయనీ, ద్వేషాన్నీ, క్రోధాన్నీ, అసమర్ధతనీ ఆశ్రయించుకుని ఉంటుం ది. న్యాయం ఎప్పుడూ సత్యాన్ని, ధర్మాన్నీ, కార్యదీక్షనీ, సమర్థతనీ, ఆశ్రయించి ఉంటుంది. పూర్వం రహదారి దూరమైనా గమ్యం క్షేమంగా చేరుస్తుంది. దొడ్డిదారి, అడ్డదారి దగ్గరైనా అగమ్యగోచరంగా రాళ్ళు, ముళ్ళ బాటలతో కష్టాన్ని కలిగిస్తుందని పెద్దలు చెప్పేవారు. అందుకే నేటికీ ప్రపంచంలో అడ్డదారులు తొక్కే వారి జీవితాలు ఎలా చితికిపోయాయో, న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజేతలైన వారు చివరికి ఎంత మనశ్శాంతితో ఉన్నారో - అనేక దృష్టాంతాలు మనకి గోచరిస్తాయి. కష్టపడి న్యాయంగా సంపాదించే వానికి సుఖశాంతులు అమితంగా లభిస్తాయని సత్యవంతుడు సావిత్రితో అం టాడు. తాను గొడ్డలి పట్టుకుని కట్టెలమ్ముకుని జీవించినా, అందులో ఉన్న తృప్తి, ఆనందం మరెక్కడా లభించదని - గృహస్తు యొక్క ధర్మాన్ని ఈ విధంగా వివరిస్తాడు. పతికెదురాడనట్టి సతి, భవ్య గుణుల్‌ సుతులాత్మ మానినీ
రతి, ప్రముదాఢ్య మందిదరము, ప్రాజ్ఞులు సేవకు, లిష్ట భోజనం,

బతిధి సుపూజ సత్సఖుడు న్యాయ సమార్జిత విత్తమీశ్వరా
ర్పిత మతి సాధు గోష్టిగల పెద్ద కుటుంబి కృతార్ధుడెంతయున్‌


ఒక గృహస్తు, పెద్ద కుటుంబం కలవాడికి కష్టార్జితమైన న్యాయ సమార్జితమైన ధనం ఉంటే మొత్తం కుటుం బం అంతా సుఖశాంతులతో ఉంటుంది. చెఱువులో ఒక రాయి విసిరితే చెఱువంతా అలలతో అల్లకల్లోల మైనట్టు ఒక అన్యాయం, దౌర్జన్యం, హింస, కుట్ర ఉంటే సమాజం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. అందుకని ఏ వ్యవస్థలోనైనా దాని స్వరూప, స్వభావాలెరిగి న్యాయంగా సడచుకుంటే మొత్తం సమాజం, దేశం శాంతియుత సహజీవనంతో పురోగతి పాధిస్తుంది.

Popular Posts