Followers

Thursday 30 May 2013

తపస్సుతో ఏదయినా సాధించవచ్చు - Achieve Anything by Tapassu



పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో ''తపస్సు'' అనే పదం తరచూ వినిపిస్తుంది. మన మహర్షులు తపస్సు చేసి అద్వితీయమైన శక్తులను సాధించేవారు. ఆఖరికి హిరణ్యాక్షుడు, రావణాసురుడు తదితర రాక్షసులు కూడా తపస్సు (Tapassu) చేయడం ద్వారా ఎన్నో వరాలు పొందారు. ఇంతకీ తపస్సు అంటే ఏమిటి.. చందమామ కథల్లో కూడా ''తపస్సు'' అనే పదం చాలాసార్లు వస్తుంది కనుక ''ఏముంది.. ముక్కు మూసుకుని కూర్చోవడమే'' అని చెప్పేస్తే సరిపోతుందా?! తపస్సు అందరికీ సాధ్యమయ్యేది కాదు. అది అంత సులువే అయితే ప్రతి ఒక్కరూ తపస్సు చేసి మహర్షులు అయ్యేవారు. తపస్సు మహాద్భుతమైందని పురాణాలు వర్ణించడమే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆ విషయాన్ని నిరూపించారు. కనుక తపస్సు అంటే ఏమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.
తపస్సుకు విగ్రహాలు, నైవేద్యాలు అక్కర్లేదు. మందిరాలు, ఆర్భాటాలు అవసరం లేదు. మనసా, వాచా, కర్మణా.. అంటారు చూడండి.. అలా త్రికరణశుద్ధిగా దేవుని ధ్యానించాలి. దృఢ సంకల్పంతో, ఎలాంటి సంశయం లేకుండా ధ్యానించినట్లయితే ఇక ఆ ఆరాధనకు తిరుగులేదు. అదే తపస్సు. అలా దీక్షగా చేసే తపశ్శక్తి (Tapasshakti) సామాన్యమైంది కాదు. అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అకుంఠిత దీక్ష, (Akunthita Deeksha) చాంచల్యం లేని స్థిర చిత్తం (sthira chittam) ఉంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఎందరో మహా మునులు నిరూపించారు. పులిని పిల్లిగా మార్చడమూ, బొందితో స్వర్గానికి చేరడమూ కూడా సాధ్యమని మహర్షులు ప్రవచించారు.
తపశ్శక్తితో తలచిన పనులు నేరవేరడమే కాదు, నుదుట త్రినేత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి టెలిఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులు లేని పూర్వకాలంలోనే మన మహర్షులు ఉన్న చోటే ఉండి దివ్య దృష్టితో అన్నీ చూడగలిగేవారు, తెలుసుకునేవారు. అదంతా తపశ్శక్తి మహిమే.
మెదడులో ఏనియల్ గ్లాండ్ ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసినప్పుడు ఈ గ్రంధినుండి అపురూపమైన, మహాద్భుతమైన దివ్య కిరణాలు ప్రసరిస్తాయి. ఈ కిరణాలు విశ్వంలో తిరుగుతున్న ఎలక్ట్రో మేగ్నటిక్ పవర్ ను కదిలించివేస్తుంది. ఆ కిరణాలు మేఘాలను, ట్రోపోస్పియర్ని, , స్ట్రేటోస్పియర్ని, ధర్మోస్పియర్ని, ఎక్సోస్పియర్ని, మించి అంతరిక్షం లోనికి దూసుకువెళ్ళి విశ్వశక్తుల వైపు దూసుకుపోతుంది.
ఒక వ్యక్తి కఠోర దీక్షలో నిమగ్నమైనప్పుడు మాజిక్ సర్కిల్ ఏర్పడుతుంది. ఆ దీక్ష, ధ్యానంతో, వారి నుదుటినుండి మహోజ్జ్వలమైన కాంతి కిరణాలు వెలువడి, అవి అంతే ప్రకాశవంతంగా, మనోహరంగా ప్రసరిస్తాయి. అయితే, ఈ దివ్య తేజో కిరణాలు సాధారణ వ్యక్తులకు కనిపించవు. తపశ్శక్తి ఉన్నవారు మాత్రమే దర్శించగలరు.
కిర్లియాన్ ఫొటోగ్రఫీ ఈ తేజో కిరణాలను పట్టుకోగలుగుతోంది. కారణం కఠోర దీక్ష వల్ల మాజిక్ సర్కిల్ నుండి వెలువడే తేజో కిరణాలు బహుశా అతి నీలలోహిత (Ultra Violet) కిరణాలు అయ్యుండటమే. కాస్మిక్ కిరణాల్లా అంగ్ స్ట్రమ్ యూనిట్ లో అత్యంత సూక్ష్మమై, బహు వేగంగా పయనించే కిరణాలు అయ్యుంటాయి. విశ్వంలో మనకు కనిపించే శక్తులు కాకుండా కనపడని అదృశ్య, అతీత శక్తులు ఎన్నో ఉంటాయి. మహర్షులు తపస్సుతో సాధించే శక్తి కూడా అలాంటిదే. తపశ్శక్తితో విశ్వంలోని విద్యుదయస్కాంత శక్తులు సైతం కల్లోలమౌతాయి.
మహర్షులు కన్నెర్ర చేసి ఆగ్రహోదగ్రులైతే సముద్రాలు అల్లకల్లోలం అయ్యేవని, పర్వతాలు బద్దలయ్యేవని పురాణాల్లో వర్ణించారు. అవి కట్టుకథలు, పిట్టకథలు కాదని, తపశ్శక్తి అంత మహాద్భుతమైందని అర్ధం చేసుకోవాలి.
ముక్కు మూసుకుని ఒక మూల కూర్చుని తపస్సు (Tapassu) చేసుకోవడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. క్షణం కూడా నిలకడగా ఉండని మనసును నియంత్రిస్తూ ఒకచోట కేంద్రీకరించడమే తపస్సు. మనసు పగ్గాలు గనుక పట్టుకోగలిగితే ఉంటే ఇక లోకంలో దేన్నయినా అదుపు చేయగల రిమోట్ కంట్రోలు మన చేతిలో ఉన్నట్లే. ఏమయినా చేయగలం. దేన్నయినా శాసించగలం. రోజులో కాసేపు ధ్యానం (meditation) చేయమని చెప్పేది అందుకే. మనం ప్రతిరోజూ చేసేది చిన్నసైజు తపస్సు అన్నమాట.

Popular Posts