Followers

Friday 19 April 2013

సాష్టాంగ నమస్కారము చేయడం ఎలా?



సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.  అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు ?


ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. - 


> > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా 

పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః <<

 ౧) ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


౨) శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు 

తాకాలి.

౩) దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


౪) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి. 


౫) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.  

అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో 
ఓం నమో మేరీతనయాయ అనో లేక ఓం నమో మహమ్మదాయ అనో 
మాట పలుకుతూ నమస్కరించాలి. 

౬) పద్భ్యాం నమస్కారం  - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 


౭) కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు  రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


౮) జానుభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


Popular Posts