Followers

Saturday 23 March 2013

పూజలో హారతి ఉద్దేశ్యం

భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని "హారతి" లేదా "ఆరతి" అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. అనంతరం హారతిని కళ్ళకద్దుకొంటారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి వెలుగులో కనుల పండువుగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. ఇది హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఒక కారణం కావచ్చును.


నేతి వత్తులతో హారతి ఇవ్వడంలో అనేక సంప్రదాయాలున్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై - ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. హారతి తరువాత మంత్రపుష్పం పూజ జరుగుతుంది.

Popular Posts